ఎప్పుడూ మాస్క్ వేసుకుని ఉండలేం... రిషబ్ పంత్‌కి బీసీసీఐ బాస్ గంగూలీ సపోర్ట్...

First Published Jul 16, 2021, 10:29 AM IST

ఇంగ్లాండ్ టూర్‌లో ఉన్న భారత జట్టులో సభ్యుడైన యంగ్ వికెట్ కీపర్ రిషబ్ పంత్, కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. బయో బబుల్ నుంచి బయటికి వచ్చిన తర్వాత ఫ్రెండ్స్‌తో కలిసి తిరుగుతూ ఫుల్లుగా ఎంజాయ్ చేశాడు రిషబ్ పంత్.

యూరో 2020 ఫుట్‌బాల్ మ్యాచులను వీక్షించేందుకు వెళ్లిన రిషబ్ పంత్, అక్కడ మాస్క్ లేకుండా కనిపించడమే కాకుండా భౌతిక దూరం కూడా పాటించకుండా అభిమానులతో సెల్ఫీలు దిగాడు...
undefined
రిషబ్ పంత్ స్నేహితులతో కలిసి ఫుట్‌బాల్ మ్యాచులు చూస్తున్న ఫోటోలతో పాటు ఫ్యాన్స్‌తో కలిసి దిగిన ఫోటోగ్రాఫ్‌లు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి...
undefined
తాజాగా అతను కరోనా బారిన పడడంతో ఇంగ్లాండ్‌లో థర్డ్ వేవ్ కేసులు ఉన్నాయని తెలిసీ, మాస్కు పెట్టుకోకుండా ఫుట్‌బాల్ మ్యాచులు చూసేందుకు వెళ్తావా? కనీసం సోషల్ డిస్టెన్స్ పాయించాలనే విషయం కూడా తెలియదా? అంటూ పంత్‌పై ట్రోల్స్ వినిపిస్తున్నాయి...
undefined
‘ఇంగ్లాండ్‌లో యూరో ఛాంపియన్‌షిప్, వింబుల్డన్ మ్యాచులు చూసేందుకు భారత జట్టుకి అనుమతులు ఇచ్చాం. ఇప్పుడు అక్కడ రూల్స్ మారాయి. ప్రేక్షకులను మ్యాచులు చూసేందుకు అనుమతిస్తున్నారు...
undefined
అయినా ప్రస్తుతం టీమిండియా ప్లేయర్లు అందరూ హాలీడేస్‌లో ఉన్నారు. ఎప్పుడూ మాస్కు పెట్టుకుని ఉండలేం కదా...’ అంటూ కామెంట్ చేశాడు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ...
undefined
‘ప్రస్తుతం రిషబ్ పంత్, తన బంధువుల ఇంట్లో ఐసోలేషన్‌లో గడుపుతున్నాడు. అతను జట్టుతో కలిసి డోహ్రామ్ రావడం లేదు... అతను భారత జట్టులో ఎవ్వరితోనూ కలవలేదు... ప్రోటోకాల్ పాటించాల్సిందిగా ప్లేయర్లందరికీ బీసీసీఐ సెక్రటరీ జై షా లెటర్ రాశారు...’ అంటూ తెలిపాడు బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా...
undefined
నాటింగ్‌హమ్‌లోని ట్రెంట్ బ్రిడ్జ్‌లో ఆగస్టు 4 నుంచి ఇంగ్లాండ్‌తో మొదటి టెస్టు మ్యాచ్ ఆడనుంది టీమిండియా. ఆ తర్వాత లార్డ్స్, హెడ్డింగ్‌లీ, కెన్నింగ్టన్ ఓవల్, ఓల్డ్ ట్రాఫోర్డ్ ఏరియాల్లో మ్యాచులు ఆడుతుంది భారత జట్టు.
undefined
click me!