కోహ్లీ ఫార్ములా కరెక్టు కాదు, ధోనీ కూడా అదే తప్పు చేశాడు... - మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్...

Published : Jul 16, 2021, 10:48 AM IST

భారత జట్టుకి అత్యధిక విజయాలు అందించిన టెస్టు కెప్టెన్‌గా నిలిచిన విరాట్ కోహ్లీ, రిజర్వు బెంచ్‌ని అత్యంత ప్రటిష్టంగా తయారుచేయడంలో కీలక పాత్ర పోషించాడు. అయితే కోహ్లీ, తన జట్టు సభ్యుల పట్ల వ్యవహరిస్తున్న తీరు కరెక్ట్ కాదని అంటున్నాడు మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్...

PREV
19
కోహ్లీ ఫార్ములా కరెక్టు కాదు, ధోనీ కూడా అదే తప్పు చేశాడు... - మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్...

‘భారత జట్టులో ఎవరు ఉంటారు? ఎవరు ఉండరు అనే విషయంలో సరైన క్లారిటీ ఉండడం లేదు. దీనికి విరాట్ కోహ్లీ వ్యవహరిస్తున్న తీరే కారణం...

29

ఫామ్‌లో ఉన్న ప్లేయర్ల కోసం అతను సీనియర్లను కూడా పక్కనబెట్టేస్తున్నాడు. భారత జట్టు కీలక టోర్నీల్లో రాణించాలంటే ఫామ్‌తో సంబంధం లేకుండా రాణించే ప్లేయర్లు కావాలి...

39

ఐపీఎల్‌లో ఫామ్‌లో ఉన్నారని సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, ప్రసిద్ధ్ కృష్ణ వంటి ప్లేయర్లకు టీమిండియాలో చోటు కల్పించాడు విరాట్ కోహ్లీ...

49

ఫామ్‌లో లేడని సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్, టెస్టుల్లో కెఎల్ రాహుల్ వంటి ప్లేయర్లను కూడా కోహ్లీ పక్కనబెట్టేశాడు... ఇలాగే కొనసాగితే ప్లేయర్లలో ప్రెషర్ పెరుగుతుంది...

59

ఓ ప్లేయర్ తన కెరీర్‌లో సాధించిన విజయాలను, టీమిండియాకి అందించిన సేవలను గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఫామ్‌లో లేని ప్లేయర్లకు కూడా అవకాశం ఇస్తేనే మంచి పర్ఫామెన్స్‌లు వస్తాయి...

69

ఒకప్పుడు సౌరవ్ గంగూలీ, ఆటగాళ్లను ఇలాగే ప్రోత్సాహించేవాడు. అందుకే దాదా కెప్టెన్సీలో ఎందరో యంగ్ ప్లేయర్లు, స్టార్లుగా ఎదిగేందుకు అవకాశం దొరికింది.

79

అయితే ఆ తర్వాత ధోనీ కూడా కోహ్లీలాగే వ్యవహరించాడు. ఫామ్‌లో ఉన్న ప్లేయర్లకే చోటు ఉంటుందని, సెహ్వాగ్ లాంటి సీనియర్లను పక్కనబెట్టాడు. ఇప్పుడు విరాట్ కూడా అదే చేస్తున్నాడు... అయితే ధోనీకి అదృష్టం కలిసి వచ్చింది, కోహ్లీకి అది కూడా లేదు.

89

ఇలాగే కొనసాగితే ఆటగాళ్లు, జట్టులో స్థానం సంపాదించడమే ప్రధాన లక్ష్యంగా ఆడతారు. అంతేకానీ ఒత్తిడిని ఎదుర్కొని, కీలక సమయాల్లో విజయాలను అందించగల మానసిక సామర్థ్యం వారిలో పెంపొందదు...

99

అందుకే విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా ఏం సాధించాడంటే, అతను గెలవని ఐసీసీ టైటిల్స్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తోంది...’ అంటూ కామెంట్ చేశాడు మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్.

click me!

Recommended Stories