అతను ఎంత పెద్ద తోపైనా, ఇక్కడ రిజర్వు బెంచ్‌లో కూర్చోవాల్సిందే... ఆడమ్ జంపాపై వసీం జాఫర్ కామెంట్...

First Published Mar 25, 2023, 4:33 PM IST

ఐసీసీ ర్యాంకుల్లో టాప్‌లో ఉన్న ప్లేయర్లను కూడా అస్సలు పట్టించుకోకపోవడం ఐపీఎల్ స్పెషాలిటీ. ఐసీసీ టీ20 నెం.1 ర్యాంకు హోదాని కొన్ని నెలల పాటు అనుభవించిన డేవిడ్ మలాన్, ఐపీఎల్‌లో వరుసగా రెండేళ్లు అమ్ముడుపోని ప్లేయర్ల జాబితాలో చేరిపోయాడు...

Adam Zampa

అంతర్జాతీయ క్రికెట్‌లో ఘనమైన రికార్డు ఉన్న జేమ్స్ నీశమ్, క్రిస్ లీన్, ఆరోన్ ఫించ్ వంటి ప్లేయర్లు కూడా ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో చాలా మ్యాచుల్లో రిజర్వు బెంచ్‌కే పరిమితం అయ్యారు. ఈ జాబితాలో ఆడమ్ జంపా కూడా చేరుతాడని అంటున్నాడు వసీం జాఫర్...
 

Image credit: PTI

ఆస్ట్రేలియా యంగ్ స్పిన్నర్ ఆడమ్ జంపాకి ఇండియాలో మంచి రికార్డు ఉంది. టీమిండియాతో జరిగిన వన్డే సిరీస్‌లో  ఆడమ్ జంపా, ఆఖరి వన్డేలో 4 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్ 2023 మినీ వేలంలో ఆడమ్ జంపా, బేస్ ప్రైజ్ రూ.1 కోటి 50 లక్షలకు కొనుగోలు చేసింది రాజస్థాన్ రాయల్స్.. 

ఐపీఎల్‌లో ఇప్పటిదాకా 14 మ్యాచులు ఆడిన ఆడమ్ జంపా, 21 వికెట్లు తీశాడు. 2021 సీజన్‌లో ఆర్‌సీబీ, ఆడమ్ జంపాని కొనుగోలు చేసింది. అయితే కరోనా సెకండ్ వేవ్ కేసులకు భయపడి చెప్పాపెట్టకుండా స్వదేశానికి పయనమయ్యాడు ఆడమ్ జంపా...

ఈ కారణంగానే ఐపీఎల్ 2022 మెగా వేలంలో ఆడమ్ జంపా, కేన్ రిచర్డ్‌సన్‌ వంటి ప్లేయర్లను కొనుగోలు చేయడానికి ఏ ఫ్రాంఛైజీ కూడా ముందుకు రాలేదు. ఈసారి కూడా ఆడమ్ జంపా, రిజర్వు బెంచ్‌లోనే కూర్చోవాల్సి ఉంటుందని అంటున్నాడు వసీం జాఫర్...

‘గత ఏడాది రాజస్థాన్ రాయల్స్‌లో రవిచంద్రన్ అశ్విన్, యజ్వేంద్ర చాహాల్‌లకు సరైన బ్యాక్ అప్ ప్లేయర్ లేడు. అందుకే ఈసారి వాళ్లు చాలా మంది ప్లేయర్లను పట్టుకొచ్చారు. ఆడమ్ జంపా, మురుగన్ అశ్విన్, కరియప్పలను తీసుకున్నారు...

ఆడమ్ జంపా, ముంబై ఇండియన్స్‌కి వెళ్లి ఉంటే అతనికి చాలా అవకాశాలు వచ్చి ఉండేవి. వాళ్లకు సరైన స్పిన్నర్ లేడు. రాజస్థాన్ రాయల్స్‌లో అశ్విన్, చాహాల్‌లను కూర్చోబెట్టి ఆడమ్ జంపాను ఆడించడం కష్టమే.. ఆస్ట్రేలియా టీమ్‌లో అతను తోపు స్పిన్నర్ కావచ్చు కానీ ఇక్కడ రిజర్వు బెంచ్‌లో కూర్చోవాల్సందే.. ’ అంటూ కామెంట్ చేశాడు వసీం జాఫర్...

ఇంగ్లాండ్ టెస్టు కెప్టెన్ జో రూట్‌ని కూడా బేస్ ప్రైజ్‌కి కొనుగోలు చేసిన రాజస్థాన్ రాయల్స్, కెఎం అసిఫ్, కృనాల్ సింగ్ రాథోడ్, అబ్దుల్ బసిత్, అకాశ్ వసిస్ట్, డేవగన్ ఫెర్రారియా, జాసన్ హోల్డర్‌లను కొనుగోలు చేసింది రాజస్థాన్ రాయల్స్..  జో రూట్‌ కూడా గత మూడు సీజన్లలో ఐపీఎల్‌లో అమ్ముడుపోని ప్లేయర్‌గా ఉన్నాడు.

click me!