సౌతాఫ్రికాలో భారత సక్సెస్ మంత్ర అదే, బౌలర్లు దాన్ని ఫాలో అయితే చాలు... భారత మాజీ బౌలింగ్ కోచ్...

First Published Dec 23, 2021, 10:18 AM IST

India vs South Africa 1st Test: మరో మూడు రోజుల్లో సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. 29 ఏళ్లుగా సౌతాఫ్రికాలో టెస్టు సిరీస్ గెలవలేకపోయిన భారత జట్టు, ఈసారి ఆ కలను నెరవేర్చుకోవాలని చూస్తోంది...

గత పర్యటనలో వరుసగా రెండు టెస్టుల్లో విరాట్ సేన, మూడో టెస్టులో గెలిచి క్లీన్ స్వీప్ నుంచి తప్పించుకుంది. రాహుల్ ద్రావిడ్, ఎమ్మెస్ ధోనీ తర్వాత సౌతాఫ్రికాలో టెస్టు మ్యాచ్ గెలిచిన మూడో కెప్టెన్‌గా నిలిచాడు విరాట్ కోహ్లీ...

భారత స్టార్ పేసర్ జస్ప్రిత్ బుమ్రా, సౌతాఫ్రికాలో జరిగిన టెస్టు సిరీస్ ద్వారానే టెస్టు ఎంట్రీ ఇచ్చాడు... భారత జట్టు మాజీ బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, సౌతాఫ్రికాలో పిచ్‌ల గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు. 

‘భారత బౌలర్లు మంచి ఫామ్‌లో ఉన్నారు. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ పిచ్‌ల మీద మన బౌలర్లు అదిరిపోయే పర్ఫామెన్స్ ఇచ్చారు. అయితే సౌతాఫ్రికా పిచ్‌ల మీద రాణించడం అంత తేలిక కాదు...

అయితే పిచ్‌ గురించి కానీ, తమ సామర్థ్యంపై ఉన్న నమ్మకంతో బౌలింగ్ చేయాలని భారత బౌలర్లకు ఎప్పుడూ చెబుతూ ఉంటాను. వికెట్ల గురించి ఆలోచించకుండా బౌలింగ్ చేయాలి...

కేవలం బ్యాట్స్‌మెన్‌కి పరుగులు ఇవ్వకుండా కట్టుదిట్టమైన లైన్ అండ్ లెంగ్త్‌ను ఫాలో అయితే సరిపోతుంది, వికెట్లు వాటంతట అవే వస్తాయి... 

ప్రత్యర్థి జట్టుపై ఒత్తిడి పెట్టడానికి రెండే విధానాలు ఉన్నాయి. ఒకటి వెంటవెంటనే వికెట్లు తీయడం, మరోటి పరుగులు ఇవ్వకుండా కట్టడి చేయడం. పరుగుల ప్రవాహనికి అడ్డుకట్ట వేస్తే, బ్యాట్స్‌మెన్ తప్పులు చేయడం మొదలెడతాడు...

వికెట్లు రానప్పుడు, ప్రత్యర్థికి పరుగులు ఇవ్వకుండా అడ్డుకుంటే చాలు, బ్యాట్స్‌మెన్‌ని ప్రెషర్‌లోకి నెట్టొచ్చు. అప్పుడు రన్స్ కోసం ప్రయత్నించి, బ్యాట్స్‌మెన్ తప్పులు చేస్తాడు...

ఒక రెండు వికెట్లు పడితే చాలు, మిగిలిన బ్యాట్స్‌మెన్‌పై ఆ ప్రెషర్ పడుతుంది. అప్పుడు బౌలర్ల పని ఈజీ అవుతుంది. సౌతాఫ్రికాలోనే కాదు, ఎక్కడైనా ఇదే బౌలర్ల సక్సెస్ మంత్ర ఇదే...

ఇప్పటికే ఎలాంటి పరిస్థితుల్లోనైనా రాణించగలమని భారత బౌలర్లు నిరూపించుకున్నారు. ఇంగ్లాండ్‌లో, ఆస్ట్రేలియాలో ఫాస్ట్ బౌలింగ్ పిచ్‌లపై, ప్రత్యర్థి బౌలర్ల కంటే మెరుగ్గా రాణించారు...

సౌతాఫ్రికాలో పరిస్థితులు ఈ రెండు దేశాలకు భిన్నంగా ఉంటాయి. ఓ రకంగా చెప్పాలంటే ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా పరిస్థితులను కలిపితే సౌతాఫ్రికాలో ఉన్నట్టుగా ఉంటుంది... ఈజీగా బౌన్స్ లభిస్తుంది...’ అంటూ కామెంట్ చేశాడు భారత మాజీ బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్...

click me!