భారత్‌కు వెళ్లి వరల్ కప్ గెలిస్తే బీసీసీఐకి చెంపపెట్టు: పీసీబీ చీఫ్‌కు అఫ్రిది కీలక సూచన

Published : May 20, 2023, 10:18 PM IST

Asia Cup 2023: ఆసియా కప్ - 2023 నిర్వహణ వివాదం తర్వాత  ఈ ఏడాది భారత్ వేదికగా  జరుగబోయే వన్డే వరల్డ్ కప్ లో తాము  పాల్గొనబోమని చెబుతున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డుపై  మాజీ ఆల్ రౌండర్ షాహిద్ అఫ్రిది ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 

PREV
17
భారత్‌కు వెళ్లి వరల్ కప్ గెలిస్తే బీసీసీఐకి చెంపపెట్టు: పీసీబీ చీఫ్‌కు అఫ్రిది కీలక సూచన

ఆసియా కప్ - 2023  ఆడేందుకు పాకిస్తాన్ కు రాబోమని ఇదివరకే తేల్చి చెప్పేసిన భారత క్రికెట్ జట్టు తర్వాత ప్రతిపాదించిన హైబ్రిడ్ మోడల్ ను కూడా తిరస్కరించింది.  భారత్ తో పాటు శ్రీలంక, బంగ్లాదేశ్ లు కూడా  భారత్ కు మద్దతు తెలపడంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)కి వరుస షాకులు తప్పడం లేదు. 

27

ఈ టోర్నీని   శ్రీలంకకు తరలించనున్నారని... అదే జరిగితే ఆసియా కప్  నుంచి తాము బహిష్కరిస్తామని  పీసీబీ బెదిరింపులతో   రాజకీయం వేడెక్కింది. ఆసియా కప్ ఆడేందుకు భారత్.. తమ దేశానికి రాకపోవడంతో   పీసీబీ కూడా భారత్ వేదికగా ఈ ఏడాది అక్టోబర్ నుంచి జరుగోబోయే వన్డే వరల్డ్ కప్  లో పాల్గొనేందుకు రానని  చెబుతున్నది. 

37
Image credit: Wikimedia Commons

పీసీబీ, బోర్డు అధ్యక్షుడు నజమ్ సేథీ చేస్తున్న ఈ వ్యాఖ్యలపై  తాజాగా ఆ జట్టు మాజీ ఆల్ రౌండర్ షాహిద్ అఫ్రిది ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పాకిస్తాన్.. భారత్ కు వెళ్లకపోవడం తెలివితక్కువ ఆలోచన అని..  అక్కడకు వెళ్తేనే  బీసీసీఐ చెంప ఛెల్లుమని అనిపించినట్టు అవుతుందని  అఫ్రిది తెలిపాడు. 

47
Image credit: Shahid Afridi/Twitter

అఫ్రిది మాట్లాడుతూ.. ‘వన్డే వరల్డ్ కప్ లో ఆడేదీ లేదని, తాము భారత్ కు వెళ్లబోమని  పీసీబీ  ఎందుకు చెబుతుందో నాకు అర్థం కావడం లేదు.   వాళ్లు (పీసీబీ) పరిస్థితులను సరళీకరించుకోవాలి. పాక్ ఆడకున్నా ఇంటర్నేషనల్ క్రికెట్ టోర్నమెంట్ జరుగుతుందన్న విషయాన్ని గుర్తెరగాలి.  ఈ విషయంలో సానుకూలంగా ఉండటం చాలా అవసరం. 

57

భారత్‌కు వెళ్లి వన్డే వరల్డ్ కప్ ఆడండి.  మీ క్రికెటర్లకు  ట్రోఫీని గెలవమని చెప్పండి. దేశం మొత్తం మీకు  అండగా ఉంటుంది.  ఒకవేళ భారత్ కు వెళ్లి అక్కడ పాకిస్తాన్ ట్రోఫీ నెగ్గితే అది మనకు  పెద్ద విజయమే కాదు..  బీసీసీఐ  చెంప ఛెల్లుమనిపించినట్టే అవుతుంది..’ అని  అన్నాడు. 

67

అంతేగాక.. పాకిస్తాన్ జట్టును భారత్ కు పంపించి  అక్కడ   ట్రోఫీ నెగ్గితే  అప్పుడు  బీసీసీఐకే గాక  ప్రపంచానికంతటికీ తాము  ఎక్కడైనా ఆడి విజయం సాధించగలమని చాటి చెప్పినట్టు అవుతుందని  తెలిపాడు.  

77
Image credit: Getty

పీసీబీ చీఫ్ నజమ్  సేథీ కూడా  టీవీలలో పూటకో మాట మాట్లాడటం మానుకోవాలని  అఫ్రిది హితువు పలికాడు.   టీవీ ఛానెళ్లకు అతడు ఇంటర్వ్యూలు ఇవ్వాల్సిన అవసరమే లేదని.. వయసు పైబడటంతో  ఆయన  ఏదేదో మాట్లాడుతున్నాడని అన్నాడు. పీసీబీ చైర్మన్ అనే పోస్టు చాలా పెద్దదని, దానికి అనుగుణంగా ఆయన నడుచుకోవాలని  సూచించాడు. 

click me!

Recommended Stories