ఆ కుర్రాడిని కొనాలని ఎంతో ట్రై చేశాం, మమ్మల్ని టార్చర్ పెట్టాడు... - సీఎస్‌కే కోచ్ స్టీఫెన్ ఫ్లెమ్మింగ్

First Published May 20, 2023, 6:14 PM IST

ఐపీఎల్‌లో మోస్ట్ సక్సెస్‌ఫుల్ టీముల్లో చెన్నై సూపర్ కింగ్స్ ఒకటి. నాలుగు టైటిల్స్ గెలిచిన సీఎస్‌కే నుంచి టీమిండియా తరుపున ఆరంగ్రేటం చేసిన ప్లేయర్ల సంఖ్య చాలా తక్కువ... 
 

PTI PhotoR Senthil Kumar)(PTI04_02_2023_000246B)

రవిచంద్రన్ అశ్విన్, మోహిత్ శర్మ తర్వాత కొన్నేళ్లకు రుతురాజ్ గైక్వాడ్, చెన్నై సూపర్ కింగ్స్ నుంచి టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చాడు. సీనియర్లు, 30+ ప్లేయర్లను కొనుగోలు చేసేందుకే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించే ధోనీ టీమ్, ఓ కుర్రాడిని కొనుగోలు చేయడానికి బాగా ఆసక్తి చూపించిందట..

Image credit: PTI

అతను ఎవరో కాదు, ఐపీఎల్ 2020 సీజన్‌ ద్వారా వెలుగులోకి వచ్చి, టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ ఆడే అవకాశం కూడా కొట్టేసిన కేకేఆర్ మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి. ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించాడు సీఎస్‌కే కోచ్ స్టీఫెన్ ఫ్లెమ్మింగ్..

Latest Videos


Image credit: PTI

తమిళనాడుకి చెందిన వరుణ్ చక్రవర్తి, చెన్నై సూపర్ కింగ్స్‌‌కి ఎన్నో సీజన్ల పాటు నెట్ బౌలర్‌గా వ్యవహరించాడు. 2019 ఐపీఎల్ వేలంలో రూ.8.4 కోట్లకు వరుణ్ చక్రవర్తిని కొనుగోలు చేసింది పంజాబ్ కింగ్స్...

Image credit: Varun ChakravarthyInstagram

అయితే 2019 సీజన్‌లో ఒకే ఒక్క మ్యాచ్ ఆడిన వరుణ్ చక్రవర్తి, ఒకే వికెట్ తీశాడు. 2019లో పంజాబ్ కింగ్స్‌కి టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కెప్టెన్‌గా వ్యవహరించడంతో వరుణ్ చక్రవర్తికి ఎక్కువ అవకాశాలు రాలేదు. 

ఆ తర్వాత 2020 సీజన్‌లో రూ.4 కోట్లకు వరుణ్ చక్రవర్తిని కొనుగోలు చేసిన కోల్‌కత్తా నైట్‌రైడర్స్, 2022 సీజన్‌లో అతన్ని రూ.8 కోట్లకు రిటైన్ చేసుకుంది. ఈ సీజన్‌లో అతను ఏకంగా రూ.12 కోట్లు తీసుకుంటున్నాడు..

Stephen Fleming

‘వరుణ్ చక్రవర్తి‌ని వేలంలో కొనుగోలు చేయకపోయినందుకు ఇప్పటికీ బాధపడుతుంటాం. అతను కొన్నేళ్ల పాటు నెట్స్‌లో మమ్మల్ని టార్చర్ చేశాడు.. వేలంలో అతనికి భారీ ధర దక్కడంతో కొనుగోలు చేయలేకపోయాం..

Image credit: PTI

తమిళనాడు ప్లేయర్లకు అన్ని టీమ్స్‌లో డిమాండ్ ఉంటుంది. అయితే అతని గురించి బాగా తెలిసిన మేం, సొంతం చేసుకోవడంలో మాత్రం ఫెయిల్ అయ్యాం...

మొదటి సీజన్‌లో వరుణ్ చక్రవర్తికి భారీ ధర దక్కింది. ఆ తర్వాత కాస్త తగ్గినా కొనుగోలు చేయలేకపోయాం. గత సీజన్‌లో అతను గాయంతో బాధపడ్డాడు. 

ఈసారి మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి ఇద్దరూ కేకేఆర్‌కి ప్రధాన బలం...’ అంటూ కామెంట్ చేశాడు చెన్నై సూపర్ కింగ్స్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమ్మింగ్.. 

click me!