300 వికెట్ల క్లబ్‌లో ఇషాంత్ శర్మ... 113 ఏళ్ల తర్వాత రవిచంద్రన్ అశ్విన్ రికార్డు ఫీట్...

Published : Feb 08, 2021, 01:30 PM IST

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత బౌలర్లు ఆలస్యంగానైనా రిథమ్‌ను అందుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో ప్రత్యర్థికి 578 పరుగుల భారీ స్కోరు అందించిన భారత జట్టు, రెండో ఇన్నింగ్స్‌లో 71 పరుగులకే నాలుగు వికెట్లు తీసింది. అయితే ఫస్ట్ ఇన్నింగ్స్‌లో అద్భుత డబుల్ సెంచరీతో ఆకట్టుకున్న జో రూట్, రెండో ఇన్నింగ్స్‌లోనూ దూకుడు చూపిస్తున్నాడు. రెండో ఇన్నింగ్స్‌లో ఇషాంత్ శర్మ, రవిచంద్రన్ అశ్విన్ రికార్డులు క్రియేట్ చేశారు.

PREV
16
300 వికెట్ల క్లబ్‌లో ఇషాంత్ శర్మ...  113 ఏళ్ల తర్వాత రవిచంద్రన్ అశ్విన్ రికార్డు ఫీట్...

భారత జట్టును తొలి ఇన్నింగ్స్‌లో 337 పరుగులకి ఆలౌట్ చేసిన ఇంగ్లాండ్... ఫాలోఆన్ ఆడించకుండా రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేయడానికే మొగ్గుచూపింది. అయితే ఇన్నింగ్స్ మొదటి బంతికే వికెట్ తీసి, ఇంగ్లాండ్‌కి ఊహించని షాక్ ఇచ్చాడు భారత సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్. మొదటి బంతికే అశ్విన్ బౌలింగ్‌లో రహానేకి క్యాచ్ ఇచ్చి డకౌట్ అయ్యాడు రోరీ బర్న్స్...

26

టెస్టు ఇన్నింగ్స్ మొదటి బంతికే వికెట్ తీసిన మూడో స్పిన్నర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు రవిచంద్రన్ అశ్విన్. 1888లో బాబీ పీల్, 1907లో దక్షిణాఫ్రికా స్పిన్నర్ ఆల్బర్ట్ వాగ్లర్ తర్వాత ఈ ఫీట్ సాధించిన మొట్టమొదటి స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్. 113 ఏళ్ల రికార్డును బ్రేక్ చేసిన అశ్విన్, రెండు ఇన్నింగ్స్‌లోనూ రోరీ బర్న్స్‌‌ను అవుట్ చేసిన నాలుగో బౌలర్‌గా నిలిచాడు...

36

సున్నాకే తొలి వికెట్ కోల్పోయిన ఇంగ్లాండ్‌, రెండో వికెట్‌కి 32 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. మొదటి ఇన్నింగ్స్‌లో 87 పరుగులు చేసిన డొమినిక్ సిబ్లీ, రెండో ఇన్నింగ్స్‌లో 37 బంతుల్లో 2 ఫోర్లతో 16 పరుగులు చేసి రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్‌లో ఛతేశ్వర్ పూజారాకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు... 32 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది ఇంగ్లాండ్.

46

ఆ తర్వాత 47 బంతుల్లో ఓ ఫోర్‌తో 18 పరుగులు చేసిన డానియల్ లారెన్స్‌ని ఇషాంత్ శర్మ అవుట్ చేశాడు. ఇషాంత్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు లారెన్స్. ఇషాంత్ శర్మకి ఇది టెస్టుల్లో 300వ వికెట్ కావడం విశేషం. మొదటి ఇన్నింగ్స్‌లో వరుస బంతుల్లో రెండు వికెట్లు తీసిన ఇషాంత్ శర్మ, 177 ఇన్నింగ్స్‌ల్లో 300 టెస్టు వికెట్లు పూర్తి చేసుకున్నాడు.

56

భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్, జహీర్ ఖాన్ తర్వాత టెస్టుల్లో 300 వికెట్లు తీసిన మూడో భారత పేసర్‌గా నిలిచాడు ఇషాంత్ శర్మ. కపిల్ దేవ్ 434 వికెట్లు పడగొట్టగా, జహీర్ ఖాన్ 311 వికెట్లు తీశాడు. 300 వికెట్లు తీసిన ఇషాంత్ శర్మ, మరో 12 వికెట్లు తీస్తే జహీర్ ఖాన్ రికార్డును అధిగమిస్తాడు. 

66

12 బంతుల్లో ఓ ఫోర్‌తో 7 పరుగులు చేసిన బెన్ స్టోక్స్, రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్‌లో రిషబ్ పంత్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. 71 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది ఇంగ్లాండ్. అయితే కెప్టెన్ జో రూట్ దూకుడుగా బ్యాటింగ్ చేస్తుండడంతో ఇంగ్లాండ్ ఆధిక్యం ఇప్పటికే 310+ దాటింది.  

click me!

Recommended Stories