ఫాస్ట్ బౌలర్లను ఎలా వాడాలో రోహిత్ కంటే విరాట్ కోహ్లీకి బాగా తెలుసు! అతని వల్లే... - ఇషాంత్ శర్మ

First Published Aug 16, 2023, 3:17 PM IST

ధోనీ టెస్టు కెప్టెన్సీ తప్పుకున్నాక ఆ బాధ్యతలు చేపట్టిన విరాట్ కోహ్లీ, వరుసగా ఐదేళ్లు టీమిండియాని టెస్టుల్లో టాప్ టీమ్‌గా నిలబెట్టాడు. కోహ్లీ కెప్టెన్సీలో టీమిండియా, విదేశాల్లో చారిత్రక విజయాలు అందుకుంది..

మహేంద్ర సింగ్ ధోనీ నుంచి విరాట్ కోహ్లీ టెస్టు కెప్టెన్సీ పగ్గాలు అందుకునే సమయానికి వరుస పరాజయాలతో టెస్టు ర్యాంకింగ్స్‌లో ఏడో స్థానానికి పడిపోయింది భారత జట్టు. టీమిండియా టెస్టు టీమ్‌ని పునఃనిర్మించడానికి ఫాస్ట్ బౌలింగ్ యూనిట్‌ని పటిష్టం చేయడం ఒక్కటే మార్గంగా భావించాడు విరాట్ కోహ్లీ..

Jasprit Bumrah, Ishant Sharma, Mohammed Shami, Bhuvneshwar Kumar, Umesh Yadav

విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో జస్ప్రిత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, జస్ప్రిత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్, నవ్‌దీప్ సైనీ, శార్దూల్ ఠాకూర్.. వంటి ప్రపంచ స్థాయి ఫాస్ట్ బౌలర్లుగా ఎదిగారు. వీరితో  ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాల్లో టెస్టు సిరీస్‌లు గెలిచింది భారత జట్టు...

Latest Videos


Ishant Sharma

2021 లార్డ్స్ టెస్టులో ఇంగ్లాండ్ జట్టును ఒకటిన్నర సెషన్లలోనే ఆలౌట్ చేసేసింది భారత జట్టు. అసలు రిజల్ట్ రావడమే కష్టం అనుకున్న సమయంలో సిరాజ్ 4, బుమ్రా 3, ఇషాంత్ శర్మ 2, మహ్మద్ షమీ ఓ వికెట్ తీసి.. ఇంగ్లాండ్ జట్టును 120 పరుగులకే ఆలౌట్ చేశారు. దీంతో భారత జట్టు 151 పరుగుల తేడాతో ఘన విజయం అందుకుంది...

Ishant Sharma

విరాట్ కోహ్లీ కెప్టెన్సీలోనే కాదు, భారత క్రికెట్ చరిత్రలో ఈ టెస్టు మ్యాచ్ విజయం ఓ మైలురాయిలాంటిది. అయితే విరాట్ కోహ్లీ టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకున్న తర్వాత ఇదే ఫాస్ట్ బౌలర్లు మునుపటి ప్రదర్శన ఇవ్వలేకపోతున్నారు..

Ishant Sharma

‘విరాట్ కోహ్లీ బౌలర్ల కెప్టెన్. అతని కెప్టెన్సీలో పేసర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. దీనికి ప్రధాన కారణం అతను ప్రతీ బౌలర్‌ని అర్థం చేసుకున్నాడు. వారికి అండగా నిలిచాడు..

Ishant Sharma

ఫాస్ట్ బౌలర్లను వాడడంలో విరాట్ కోహ్లీ తర్వాతే ఎవ్వరైనా. అంతకుముందు కెప్టెన్లు కానీ, ఆ తర్వాత కెప్టెన్లు కానీ భారత ఫాస్ట్ బౌలర్లను సరిగ్గా వాడలేకపోయారనేది నిజం...

Ishant Sharma

విరాట్ కోహ్లీ ప్రతీ ప్లేయర్‌తో మాట్లాడేవాడు. ఎలాంటి ప్రెషర్ లేకుండా చూసుకునేవాడు. మరీ ముఖ్యంగా తన ప్లేయర్లను ఎవ్వరైనా ఏమైనా అంటే కోపంతో ఊగిపోయేవాడు. అది ప్లేయర్‌కి, మనవెనక కెప్టెన్ ఉన్నాడనే భరోసాని ఇస్తుంది..

Ishant Sharma, Jasprit Bumrah, Mohammed Shami, Mayank Agarwal, Rishabh Pant

విరాట్ కోహ్లీ డెడికేషన్ గురించి చెప్పాలంటే ఓసారి విదేశీ పర్యటనకి వెళ్లాం. విరాట్, ఫ్లైట్‌లో నా పక్కనే పడుకున్నాడు. నీకు, మిగిలిన ప్లేయర్లం అందరూ కలిసి ఫోన్ చేస్తూ, ఏదో మాట్లాడుకుంటూ కాలక్షేపం చేశాం. 

 ఫ్లైట్ దిగగానే మేమేమో జెట్ ల్యాగ్‌తో పడుకోవడానికి హోటల్ రూమ్‌లకి వెళితే..  విరాట్ లేచి జిమ్‌కి వర్కవుట్లు చేశాడు. ఫిట్‌నెస్‌కి, ప్రాక్టీస్‌కి అంత ప్రాధాన్యం ఇచ్చేవాడు..’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా సీనియర్ బౌలర్ ఇషాంత్ శర్మ.. 

click me!