2007లో అంతర్జాతీయ ఆరంగ్రేటం చేసిన రోహిత్ శర్మ, టీమ్‌లో స్థిరమైన చోటు దక్కించుకోవడానికి 2013 వరకూ వేచిచూడాల్సి వచ్చింది. ఓపెనర్‌గా మారిన తర్వాత రోహిత్ శర్మ, ‘హిట్‌మ్యాన్’గా మారాడు.. సంజూ కూడా ఇలాగే అవుతాడని అంటున్నాడు భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా..
2015లో అంతర్జాతీయ ఆరంగ్రేటం చేసిన సంజూ శాంసన్, 2023 ఆగస్టు వరకూ ఆడింది మొత్తంగా 12 వన్డేలు, 16 టీ20 మ్యాచులే.. 2021లో ఎంట్రీ ఇచ్చిన సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్.. సంజూ శాంసన్ కంటే రెట్టింపు మ్యాచులు ఆడేశారు..
28
Sanju Samson
అడపాదడపా వచ్చే అవకాశాలను సంజూ శాంసన్ సరిగ్గా వాడుకోలేకపోతున్నాడు. వెస్టిండీస్ టూర్‌లో టీ20 సిరీస్‌లో 5 మ్యాచులు ఆడిన సంజూ శాంసన్, మూడు మ్యాచుల్లో బ్యాటింగ్‌కి వచ్చినా పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు..
38
‘సంజూ శాంసన్ కూడా రోహిత్ శర్మ లాంటోడే. అతని నుంచి బెస్ట్ పర్ఫామెన్స్ రాబట్టాలంటే ఫార్మాట్‌తో సంబంధం లేకుండా టాపార్డర్‌లో ఆడించాలి.. టాపార్డర్‌లోనే సంజూ సక్సెస్ అవ్వగలడు...
48
రోహిత్ శర్మ కూడా చాలా చక్కగా బ్యాటింగ్ చేస్తాడు. అతనిలో టాలెంట్ పుష్కలంగా ఉందని అందరికీ తెలుసు. అందరి కెరీర్ ప్రారంభంలో మిడిల్ ఆర్డర్, లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేయడానికి రోహిత్ శర్మ చాలా ఇబ్బంది పడ్డాడు..
58
sanju samson
రోహిత్ శర్మ గణాంకాలు, ఓపెనర్‌గా మారిన తర్వాతే మారాయి. సంజూ శాంసన్‌ని కూడా టాపార్డర్‌లో బ్యాటింగ్‌కి పంపితే ఇదే జరుగుతుంది. అతను ఓపెనర్‌గా, వన్‌డౌన్ ప్లేయర్‌గా, నాలుగో స్థానంలో కూడా ఆడగల ప్లేయర్. ఐపీఎల్‌లోనూ ఈ స్థానాల్లోనూ సక్సెస్ అయ్యాడు..
68
లోయర్ మిడిల్ ఆర్డర్‌లో సంజూ శాంసన్‌ని బ్యాటింగ్‌కి పంపి, ఫినిషర్‌గా చేయాలనుకోవడం సరైన వ్యూహం కాదని నాకు అనిపిస్తోంది. ఎందుకంటే అతనికి ఇచ్చిన అవకాశాలను సరిగా వాడుకోలేకపోయాడు కూడా...
78
మిడిల్ ఆర్డర్‌లో అతని గణాంకాలు సరిగా లేవని తెలిసినా అక్కడే ఆడాలని పంపడం ఎందుకో నాకైతే అర్థం కావడం లేదు. అతనికి అవకాశాలు ఇస్తున్నాం, ఆడడం లేదని చెప్పడానికే ఇలా లోయర్ ఆర్డర్‌లో సంజూని బ్యాటింగ్‌కి పంపుతున్నట్టుగా ఉంది..’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్, కామెంటేటర్ సంజూ శాంసన్..
88
Sanju Samson
వెస్టిండీస్‌తో టీ20 సిరీస్ ముగిసిన తర్వాత ఇషాన్ కిషన్, హార్ధిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, శుబ్‌మన్ గిల్, కుల్దీప్ యాదవ్, యజ్వేంద్ర చాహాల్ వంటి ప్లేయర్లు స్వదేశానికి వచ్చేశారు. సంజూ శాంసన్ మాత్రం ఐర్లాండ్ టూర్‌లో ఆడబోతున్నాడు.