ఇషాన్ కిషన్ బాగా ఫీలైనట్టున్నాడుగా... టీమ్‌లో ప్లేస్ ఇవ్వలేదని, పుష్ఫ డైలాగ్‌తో ఇన్‌స్టాలో పోస్టు...

First Published Aug 10, 2022, 6:25 PM IST

ఐపీఎల్ ద్వారా టీమిండియాలో ఎంట్రీ ఇచ్చిన యంగ్ సెన్సేషనల్ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్. అండర్ 19 వరల్డ్ కప్‌ టీమ్‌కి కెప్టెన్‌గా వ్యవహరించిన ఈ జార్ఖండ్ డైనమేట్, ఐపీఎల్ 2020 తర్వాత టీమిండియాలోకి వచ్చి పెద్దగా అనుభవం లేకుండానే టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ ఆడేశాడు...

Image credit: PTI

టీ20 వరల్డ్ కప్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇషాన్ కిషన్‌ని కెఎల్ రాహుల్‌తో కలిసి ఓపెనింగ్‌కి పంపించింది టీమిండియా. 8 బంతులాడి ఓ ఫోర్ బాదిన ఇషాన్ కిషన్, ఆ తర్వాతి బంతికే భారీ షాట్‌కి ప్రయత్నించి అవుట్ అయ్యాడు...

Image credit: BCCI

ఈ ఫెయిల్యూర్ తర్వాత కూడా టీమిండియాలోకి వచ్చి పోతూ ఉన్న ఇషాన్ కిషన్, కెఎల్ రాహుల్ గాయపడడంతో సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌కి ఓపెనర్‌గా వ్యవహరించాడు. ఈ ఏడాది టీమిండియా తరుపున అత్యధిక పరుగులు చేసిన రెండో భారత బ్యాటర్‌గా ఉన్నాడు ఇషాన్ కిషన్...

Image credit: PTI

2022లో 14 ఇన్నింగ్స్‌ల్లో 30.71 సగటుతో 430 పరుగులు చేశాడు ఇషాన్ కిషన్. స్ట్రైయిక్ రేటు 130కి పైగా ఉంది. అయితే ఇషాన్ కిషన్ నిలకడలేమి కారణంగా అతనికి ఆసియా కప్ 2022 టోర్నీలో అవకాశం ఇవ్వలేదు సెలక్టర్లు...

Ishan Kishan

ఆసియా కప్‌ 2022 జట్టులో చోటు దక్కకపోవడంతో బాగా ఫీలైన ఇషాన్ కిషన్, ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పద్యంతో తన బాధను, ఆవేదనను అభిమానులతో పంచుకున్నాడు... ‘ఏదో బాధపెట్టిందని నీ పద్ధతి మార్చుకోకు. ఎవరైనా నిన్ను ‘ఫ్లవర్’ అనుకుంటే, నువ్వు ‘ఫైర్’గా మారిపో... (పుష్ఫ సినిమాలో డైలాగ్... పుష్ఫ అంటే ఫ్లవర్ అనుకుంటివా, ఫైర్...)

‘వెనక్కే ఉండు, కానీ జాగ్రత్తగా ఉండు. ఇలా ముందుకు వెళ్లిపోయే వాళ్లలా మాయం అయిపోకు... నా మాట విను.. నేను ద్వేషాన్ని తీసుకుని ఎక్కడికి వెళతా... కానీ ఈ ద్వేషాన్ని ఇష్టంగా మాత్రం మార్చుకోగలుగుతా...’ అంటూ బెల్లా హంబుల్ పోయట్‌ పాటలోని పదాలను పోస్టుగా చేశాడు ఇషాన్ కిషన్...

Image credit: PTI

ఈ ఏడాది ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో టాప్ 10లోకి ఎంట్రీ ఇచ్చిన ఇషాన్ కిషన్, గత ఐదు ఇన్నింగ్స్‌ల్లో అట్టర్ ఫ్లాప్ ప్రదర్శన ఇచ్చి మళ్లీ తన ర్యాంకుని, టీమిండియాలో స్థానాన్ని కోల్పోయాడు. గత ఐదు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 64 పరుగులే చేశాడు ఇషాన్ కిషన్.. 

click me!