ఆస్ట్రేలియా కెప్టెన్ మెగ్ లానింగ్ సంచలన నిర్ణయం... క్రికెట్‌కి నిరవధిక బ్రేక్...

First Published Aug 10, 2022, 5:37 PM IST

ఆస్ట్రేలియా మహిళా క్రికెట్ టీమ్ కెప్టెన్ మెగ్ లానింగ్ సంచలన నిర్ణయం తీసుకుంది. కామన్వెల్త్ గేమ్స్‌ ఫైనల్‌లో టీమిండియాని ఓడించి, స్వర్ణం నెగ్గిన మెగ్ లానింగ్... ఆ విజయోత్సాహం నుంచి పూర్తిగా బయటికి రాకముందే క్రికెట్ నుంచి నిరవధిక బ్రేక్ తీసుకుంటున్నట్టు ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరిచింది...

Image credit: Getty

మెగ్ లానింగ్ కెప్టెన్సీలో ఆస్ట్రేలియా మహిళా జట్టు, వుమెన్స్ క్రికెట్ వరల్డ్‌లో తిరుగులేని ఆధిపత్యం చూపిస్తోంది. 2014 టీ20 వరల్డ్ కప్, 2018 టీ20 వరల్డ్ కప్, 2020 టీ20 వరల్డ్ కప్‌తో పాటు మెగ్ లానింగ్ కెప్టెన్సీలో 2022 వన్డే వరల్డ్ కప్‌ టైటిల్ కూడా సొంతం చేసుకుంది ఆస్ట్రేలియా మహిళా జట్టు...

Meg Lanning

అలాగే తొలిసారి కామన్వెల్త్ గేమ్స్‌లో ప్రవేశపెట్టిన మహిళా టీ20 క్రికెట్‌లోనూ మెగ్ లానింగ్ టీమ్ గోల్డ్ మెడల్ గెలిచి, చరిత్ర లిఖించింది. ఈ విజయం వచ్చిన కొన్ని రోజులకే మెగ్ లానింగ్, వ్యక్తిగత కారణాలతో క్రికెట్ నుంచి నిరవధిక బ్రేక్ తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించింది...

మెగ్ లానింగ్ కెప్టెన్సీలో కామన్వెల్త్ గేమ్స్ ఫైనల్ ఆడిన ఆస్ట్రేలియా, కరోనా పాజిటివ్‌గా తేలిన తహిలా మెక్‌గ్రాత్‌ని ఆడించడంతో తీవ్రమైన దుమారం రేగింది. పాజిటివ్ వచ్చిన ప్లేయర్‌ని ఆడించి, మిగిలిన క్రికెటర్ల జీవితాలను ప్రమాదంలో పడేశారంటూ ట్రోలింగ్ వచ్చింది...

ఈ సంఘటన తర్వాత మెక్‌ లానింగ్, క్రికెట్ నుంచి బ్రేక్ తీసుకుంటున్నట్టు ప్రకటించడంతో హాట్ టాపిక్‌గా మారింది. అయితే రెండేళ్లుగా బిజీ క్రికెట్‌తో అలిసిపోయానని, కుటుంబంతో గడిపేందుకే బ్రేక్ తీసుకుంటున్నట్టు ప్రకటించింది మెగ్ లానింగ్...

Australia Women Team

30 ఏళ్ల మెగ్‌ లానింగ్, 115 టీ20 మ్యాచులు, 100 వన్డేలు, 6 టెస్టులు ఆడి 7500లకు పైగా అంతర్జాతీయ పరుగులు చేసింది. ఇందులో 15 వన్డే సెంచరీలు, రెండు టీ20 సెంచరీలు ఉన్నాయి. మహిళల క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్‌గా టాప్‌లో ఉంది మెగ్ లానింగ్.. 

2011లో 18 ఏళ్ల వయసులో అంతర్జాతీయ క్రికెట్ ఎంట్రీ ఇచ్చిన మెగ్‌ లానింగ్... 45 బంతుల్లోనే సెంచరీ చేసి అత్యంత వేగంగా సెంచరీ చేసిన మహిళా క్రికెటర్‌గా నిలిచింది...

click me!