ఆ ఇద్దరినీ పక్కనబెట్టి టీమిండియా మరోసారి తప్పు చేస్తోందా... ఎక్కువ పరుగులు చేసినవాళ్లనే...

Published : Aug 10, 2022, 04:56 PM IST

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి ముందు ప్రిపరేషన్‌గా ఆసియా కప్ 2022 టోర్నీ ఆడుతోంది టీమిండియా. ఆసియా కప్‌లో ఉన్న ప్లేయర్లే, టీ20 వరల్డ్ కప్ ఆడే అవకాశం ఉంది. ఆసియా కప్‌లో మళ్లీ అట్టర్ ఫ్లాప్ అయితే తప్ప, ఆసియా కప్ ఆడే జట్టులో, టీ20 వరల్డ్ కప్ ఆడే జట్టులో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు...

PREV
17
ఆ ఇద్దరినీ పక్కనబెట్టి టీమిండియా మరోసారి తప్పు చేస్తోందా... ఎక్కువ పరుగులు చేసినవాళ్లనే...
Image credit: PTI

జస్ప్రిత్ బుమ్రా, హర్షల్ పటేల్ గాయపడడంతో ఆసియా కప్ 2022 టోర్నీకి ఎంపిక చేసిన భారత జట్టులో అర్ష్‌దీప్ సింగ్, ఆవేశ్ ఖాన్ వంటి యంగ్ పేసర్లకు అవకాశం ఇచ్చింది బీసీసీఐ...

27
Ravi Bishnoi

అలాగే కుల్దీప్ యాదవ్‌ని పక్కనబెట్టి రవి భిష్ణోయ్‌ వంటి యువ స్పిన్నర్‌కి, రవిచంద్రన్ అశ్విన్‌ రూపంలో సీనియర్ స్పిన్నర్‌కి అవకాశం కల్పించారు సెలక్టర్లు. అయితే ఈ ఏడాది టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఇద్దరికీ ఆసియా కప్ జట్టులో చోటు దక్కలేదు..

37

గాయం కారణంగా ఐపీఎల్ 2021 సీజన్ ఫస్టాఫ్‌కి దూరమైన శ్రేయాస్ అయ్యర్‌, ఈ ఏడాది 14 ఇన్నింగ్స్‌ల్లో 44.9 సగటుతో 449 పరుగులు చేశాడు. అయ్యర్ స్ట్రైయిక్ రేటు 142.99గా ఉంది. అయినా ఆసియా కప్ 2022 జట్టులో అయ్యర్‌కి అవకాశం దక్కలేదు...

47
Image credit: PTI

టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ ఆడిన భారత యంగ్ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్‌కి కూడా ఆసియా కప్ ఆడ భారత జట్టులో చోటు దక్కలేదు. ఈ ఏడాది 14 ఇన్నింగ్స్‌ల్లో 30.71 సగటుతో 430 పరుగులు చేశాడు ఇషాన్ కిషన్..
 

57

టీమిండియా తరుపున ఈ ఏడాది టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్లతో మొదటి రెండు స్థానాల్లో ఉన్న శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్‌లకు ఆసియా కప్ ఆడే జట్టులో చోటు కల్పించలేదు సెలక్టర్లు... 

67


గాయం కారణంగా ఐపీఎల్ 2022కి దూరమైన ఆల్‌రౌండర్ దీపక్ చాహార్‌, స్పిన్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌తో పాటు శ్రేయాస్ అయ్యర్‌కి స్టాండ్ బై ప్లేయర్‌గా ఆసియా కప్‌లో అవకాశం ఇచ్చారు. టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలోనూ ఈ ముగ్గురూ స్టాండ్ బై ప్లేయర్లుగానే ఉండడం మరో విశేషం...

77
rohit sharma

ఫామ్‌లో ఉన్న ప్లేయర్లను పక్కనబెట్టి మరోసారి టీమిండియా తప్పు చేయబోతుందా? అసలే జస్ప్రిత్ బుమ్రా, హర్షల్ పటేల్ గాయపడడం, శిఖర్ ధావన్ వంటి సీనియర్‌కి ఏడాదిగా టీ20ల్లో అవకాశం ఇవ్వకపోవడంతో ఆసియా కప్‌తో పాటు టీ20 వరల్డ్ కప్‌లోనూ భారత జట్టు ఛాలెంజ్‌లు ఫేస్ చేయాల్సి ఉంటుందనేది క్రికెట్ ఎక్స్‌పర్ట్స్ వాదన.. 

click me!

Recommended Stories