రోహిత్ శర్మను ఆ పదవి నుంచి తప్పించాలని కోహ్లీ కోరాడా... విరాట్‌పై మళ్లీ మొదలెట్టేశారుగా...

First Published Sep 17, 2021, 4:16 PM IST

విరాట్ కోహ్లీ టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకుంటూ సంచలన నిర్ణయం ప్రకటించాడు. టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీ తర్వాత రోహిత్ శర్మ కెప్టెన్సీలో టీ20 సిరీస్‌లు ఆడనుంది టీమిండియా... అయితే ఈ సమయంలో కూడా విరాట్‌పై విద్వేషం నింపేలా ఓ వార్త, సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది...

టీ20 ఫార్మాట్‌లో కెప్టెన్సీని వదులుకున్న విరాట్ కోహ్లీ, వన్డే, టెస్టు ఫార్మాట్‌లో మాత్రం కెప్టెన్‌గా కొనసాగుతానని స్పష్టం చేశాడు... ఈ వార్తలతో ఒక్కసారిగా క్రికెట్ ఫ్యాన్స్‌‌లో విరాట్ కోహ్లీపై పాజిటివ్ కార్నర్ మొదలైంది...

అయితే దీన్ని ఏ మాత్రం తట్టుకోలేకపోయిన కొందరు మాహీ, రోహిత్ అభిమానులు.. విరాట్‌పై విద్వేషాన్ని నింపేలా మరో వార్తను సోషల్ మీడియాలో బీభత్సంగా ప్రచారం చేస్తున్నారు...

‘టీ20  ఫార్మాట్‌లో కెప్టెన్సీ నుంచి తప్పుకున్న విరాట్ కోహ్లీ... తను ఈ నిర్ణయం తీసుకోవడానికి పరోక్షంగా కారణమైన రోహిత్ శర్మను వన్డేల్లో వైస్ కెప్టెన్‌గా తొలగించాలని టీమ్ మేనేజ్‌మెంట్‌ను కోరాడు...

వచ్చే టీ20 వరల్డ్‌కప్ టోర్నీలో కూడా రోహిత్ శర్మ వైస్ కెప్టెన్‌గా ఉండకూడదని, అతని స్థానంలో కెఎల్ రాహుల్‌కి వైస్ కెప్టెన్సీ ఇవ్వాలని డిమాండ్ చేశాడు... ’ అని ఓ బీసీసీఐ అధికారి చెప్పినట్టు ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది...

రోహిత్ శర్మకు వైస్ కెప్టెన్సీ దక్కడానికి విరాట్ కోహ్లీయే ప్రధాన కారణం. అలాంటిది అతన్ని వైస్ కెప్టెన్సీ నుంచి తప్పించాలని ఎందుకు డిమాండ్ చేస్తాడు... అనేది విరాట్ అభిమానుల అభిప్రాయం..

తన కెప్టెన్సీ పోయిందని, రోహిత్ శర్మ వైస్ కెప్టెన్సీ పీకేయాలని ఆలోచించేంత స్వార్థపరుడు విరాట్ కోహ్లీ కాదని, అలా ఆలోచిస్తే... టీమిండియా ఆటతీరు మరోలా ఉండేదని వాదిస్తున్నారు ‘కింగ్’ కోహ్లీ ఫ్యాన్స్...

టీ20ల్లో, టెస్టుల్లో మహేంద్ర సింగ్ ధోనీ కంటే మెరుగైన సక్సెస్ రేటు ఉండి కూడా... టీ20 ఫార్మాట్‌లో కెప్టెన్సీని వదులుకోవాలంటే ఎంతో నిస్వార్థమైన ఆలోచన ఉండాలని గుర్తుచేస్తున్నారు విరాట్ ఫ్యాన్స్..

రోహిత్ శర్మ చాలా గొప్ప బ్యాట్స్‌మెన్ అని విరాట్ కోహ్లీ చాలాసార్లు నిస్వార్థంగా ఒప్పుకున్నాడని, 70 అంతర్జాతీయ సెంచరీలు చేసిన ప్లేయర్ అలా చెప్పాడంటే అతని క్యారెక్టర్ ఏంటో అర్థం చేసుకోవాలని కామెంట్లు చేస్తున్నారు కోహ్లీ ఫ్యాన్స్...

click me!