ఆ ఫుడ్‌పై నిషేధం విధించిన బీసీసీఐ... హలాల్‌ను ప్రమోట్ చేస్తోందంటూ భారత క్రికెట్ బోర్డుపై...

Published : Nov 23, 2021, 05:27 PM IST

టీ20 వరల్డ్ కప్ 2021 పరాజయం తర్వాత స్వదేశంలో ప్రత్యర్థి న్యూజిలాండ్‌ను టీ20 సిరీస్‌లో క్లీన్ స్వీప్ చేసింది భారత జట్టు. టెస్టు సిరీస్ కోసం సిద్ధమవుతోంది. అయితే ‘బీసీసీఐ ప్రమోట్స్ హలాల్’ అనే ఓ హ్యాష్‌ ట్యాగ్ ట్విట్టర్‌లో తెగ ట్రెండ్ అవుతోంది...

PREV
112
ఆ ఫుడ్‌పై నిషేధం విధించిన బీసీసీఐ... హలాల్‌ను ప్రమోట్ చేస్తోందంటూ భారత క్రికెట్ బోర్డుపై...

టీమిండియాకి ఆడాలంటే డైట్, ఫిట్‌నెస్ వంటి మెయింటైన్ చేయడం తప్పనిసరి. తెలిసీ తెలియక నిషేధిత ఉత్పేరకాలు తీసుకున్నా,క్రికెట్‌కి దూరం కావాల్సి ఉంటుంది...

212

విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్లేయర్ల ఫిట్‌నెస్‌పై చాలా ఫోకస్ పెట్టాడు. ఫిట్‌నెస్ టెస్టును క్లియర్ చేస్తేనే ఏ ప్లేయర్‌కైనా భారత జట్టులో చోటు దక్కుతుంది...

312

అయితే ఇవన్నీ పక్కనబెడితే తాజాగా భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు, ఓ వివాదంలో ఇరుక్కుంది. దానికి కారణం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న ఓ వార్తే...

412

భారత మెన్స్ క్రికెట్ ఆటగాళ్లు బీఫ్ (గొడ్డు మాంసం), పోర్క్ (పంది మాంసం)తో చేసిన పదార్థాలను ఆహారంగా స్వీకరించకూడదని ఓ కొత్త డైట్‌ రూల్‌ని బీసీసీఐ జారీ చేసిందని ఓ వార్త ప్రచారంలో ఉంది...

512

అంతేకాకుండా కేవలం హలాల్ చేసిన మాంసాన్ని మాత్రమే తీసుకోవాలని కూడా ఈ డైట్ రూల్‌లో చేర్చినట్టు వార్త వైరల్ అవుతోంది. 

612

‘ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండేందుకు టీమిండియా ప్లేయర్లు పోర్క్, బీఫ్ తీసుకోకూడదని ఆదేశాలు జారీ చేశారు...’ అంటూ ఓ ప్రముఖ వార్త ఛానెల్ ప్రసారం చేసింది...

712

అలాగే హలాల్ చేసిన మాంసాహారాన్ని మాత్రమే తీసుకోవాలని కూడా తెలిపింది. ఈ వార్తే ఇప్పుడు భారత క్రికెట్ బోర్డుపై తీవ్రమైన విమర్శలు రావడానికి కారణమైంది...

812

బీఫ్, పోర్క్ తినకూడదని చెప్పడంలో ఎలాంటి వివాదం లేవలేదు కానీ, హలాల్ చేసిన మాంసాన్ని మాత్రమే తినాలని చెప్పడం ఎంత వరకూ సమంజసం అంటూ ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు...

912

హలాల్ అనేది ఓ మతానికి సంబంధించిన ఆచారం. అది ఓ నమ్మకం మాత్రమే. అలాంటప్పుడు హలాల్ చేయని మాంసంలో ఏం తగ్గుతుంది? హలాల్ చేస్తే మాంసంలో కొత్త శక్తులు ఏం కలుస్తాయంటూ ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు...

1012

ఈ డైట్ ప్లాన్‌ తయారుచేయడానికి న్యూట్రిషన్ సలహా ఇచ్చాడా? లేక ఏదైనా మత పెద్ద సలహా ఇచ్చాడా? అంటూ ప్రశ్నిస్తూ ‘బీసీసీఐ ప్రమోట్స్ హలాల్’ (BCCI Promotes Hahal) హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ చేస్తున్నారు...

1112

ప్రస్తుత టీమ్‌లో మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ మాత్రమే ఇస్లాం మతానికి చెందినవారు. అలాంటప్పుడు మిగిలిన 25 ప్లేయర్లు, ‘హలాల్’ నియమాన్ని పాటించాల్సిన అవసరం ఏముందని నిలదీస్తున్నారు...

1212

అయితే ఈ బీసీసీఐ డైట్‌ ప్లాన్ నిజమా? నిజంగానే భారత క్రికెట్ బోర్డు హలాల్ చేసిన ఆహారాన్నే తినాలని ప్లేయర్లకు సూచించిందా? లేక ఇది తప్పుడు వార్తా? అనేది తేలాల్సి ఉంది..

click me!

Recommended Stories