టీమిండియా కంటే ముందుగానే సౌతాఫ్రికా టూర్‌కి శార్దూల్ ఠాకూర్... టెస్టు సిరీస్ ఆరంభానికి ముందు...

First Published Nov 23, 2021, 4:47 PM IST

టీమిండియా పేసర్ శార్దూల్ ఠాకూర్‌కి సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. లేటుగా ఎంట్రీ ఇచ్చినా టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో పెద్దగా ప్రభావం చూపించలేకపోయిన శార్దూల్ ఠాకూర్, న్యూజిలాండ్‌తో సిరీస్‌కి ఎంపిక కాలేదు...

న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్ ఆడని శార్దూల్ ఠాకూర్, టెస్టు సిరీస్‌కి కూడా ఎంపిక కాలేదు. అయితే వచ్చే నెలలో జరిగే సౌతాఫ్రికా టూర్‌కి శార్దూల్ ఠాకూర్‌ని ఎంపిక చేయాలని భావిస్తోంది బీసీసీఐ. 

అయితే సౌతాఫ్రికా వాతావరణ పరిస్థితులకు, అక్కడి పిచ్‌లకు అలవాటు పడేందుకు వీలుగా... ఇండియా A టీమ్‌తో కలిసి మూడు టెస్టులు (నాలుగు రోజుల పాటు సాగే మ్యాచులు) ఆడాల్సిందిగా సూచించింది బీసీసీఐ...

నవంబర్ 23న మొదలయ్యే ఇండియా A టీమ్, సౌతాఫ్రికా టూర్‌‌లో మూడు మ్యాచులు జరిగితే, కేవలం ఆఖరి మ్యాచ్‌లో శార్ధూల్ ఠాకూర్ పాల్గొంటాడు. ఆ తర్వాత భారత జట్టుతో కలిసి సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్ ఆడతాడు..

రవిచంద్రన్ అశ్విన్, కెఎల్ రాహుల్, హనుమ విహారి, జస్ప్రిత్ బుమ్రా, ఉమేశ్ యాదవ్, మహ్మద్ షమీ, రవీంద్ర జడేజా వంటి కీ ప్లేయర్లు గాయపడడంతో గబ్బాలో జరిగిన ఇండియా, ఆస్ట్రేలియా టెస్టు ద్వారా రీఎంట్రీ ఇచ్చాడు శార్దూల్ ఠాకూర్...

తొలి ఇన్నింగ్స్‌లో వాషింగ్టన్ సుందర్‌తో కలిసి శతాధిక భాగస్వామ్యం నెలకొల్పిన శార్దూల్ ఠాకూర్, తొలి ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు తీసి ఆల్‌రౌండ్‌ షోతో అదరగొట్టాడు...

అప్పటి నుంచి భారత జట్టులో కీ ప్లేయర్‌గా మారిపోయిన శార్దూల్ ఠాకూర్, ఇండియా-ఇంగ్లాండ్ టెస్టు సిరీస్‌లో రెండు టెస్టులు ఆడాడు. ఈ రెండు టెస్టుల్లోనూ టీమిండియా విజయాన్ని అందుకోవడం మరో విశేషం...

అంతర్జాతీయ మ్యాచ్ ఆడడానికి ముందు తగినంత ప్రాక్టీస్ ఉండాలని శార్దూల్ ఠాకూర్‌‌కి భారత కొత్త హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ ఈ సిరీస్‌లో ఆడాల్సిందిగా సూచించాడట...

అంతేకాకుండా ఇండియా A టీమ్‌లో సభ్యులుగా ఉన్న పృథ్వీషా, హనుమ విహారి వంటి ప్లేయర్లకు కూడా సౌతాఫ్రికా టూర్‌లో అవకాశం దక్కొచ్చని క్రికెట్ విశ్లేషకుల అంచనా...

‘శార్దూల్ ఠాకూర్ టీమిండియాకి చాలా కీ ప్లేయర్‌గా మారాడు. అతను ఒత్తిడిని ఎదుర్కొనే విధానం అద్భుతం. ప్రతీ మ్యాచ్‌ కూడా తన ఆరంగ్రేటం మ్యాచ్‌లా ఆడతాడు శార్దూల్...

అతని బ్యాటింగ్, బౌలింగ్‌లో కూడా అగ్రెషన్ చూపిస్తాడు. బ్రిస్బేన్, లీడ్స్‌ మ్యాచుల్లో అతను బౌలింగ్ చేసిన విధానం అద్భుతం... అతనో తెలివైన బౌలర్...’ అంటూ చెప్పుకొచ్చాడు భారత మాజీ బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్...

click me!