అక్కడ ఆరంగ్రేటం చేయకపోయినా, ఐపీఎల్‌లో అదరగొట్టారు... నలుగురు అన్‌క్యాప్డ్‌ ప్లేయర్లకీ...

Published : Dec 02, 2021, 12:54 PM IST

ఐపీఎల్ 2022 సీజన్‌కి సంబంధించిన రిటెన్షన్ పాలసీలో అట్టిపెట్టుకునే ప్లేయర్లకు కోట్లు చెల్లించాల్సి రావడంతో చాలా ఫ్రాంఛైజీలు, స్టార్ ప్లేయర్లను కూడా వేలానికి వదిలివేశాయి. నలుగురు ప్లేయర్లను రిటైన్ చేసుకున్న జట్లు నాలుగంటే నాలుగే...

PREV
112
అక్కడ ఆరంగ్రేటం చేయకపోయినా, ఐపీఎల్‌లో అదరగొట్టారు...  నలుగురు అన్‌క్యాప్డ్‌ ప్లేయర్లకీ...

ఐదుసార్లు టైటిల్ గెలిచిన ముంబై ఇండియన్స్ జట్టు రోహిత్ శర్మ (రూ.16 కోట్లు), జస్ప్రిత్ బుమ్రా (రూ.12కోట్లు), సూర్యకుమార్ యాదవ్ (రూ.8 కోట్లు), కిరన్ పోలార్డ్ (రూ.6 కోట్లు) చెల్లించి, రిటైన్ చేసుకుంది. 

212

నాలుగు సార్లు టైటిల్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ రవీంద్ర జడేజా (రూ.16 కోట్లు), ఎమ్మెస్ ధోనీ (రూ.12 కోట్లు), మొయిన్ ఆలీ (రూ.8కోట్లు), రుతురాజ్ గైక్వాడ్ (రూ.6 కోట్లు) చెల్లించి, అట్టిపెట్టుకుంది. 

312

అలాగే టూ టైం ఛాంపియన్ కోల్‌కత్తా నైట్‌రైడర్స్ జట్టు ఆండ్రే రస్సెల్ (రూ.12 కోట్లు), వరుణ్ చక్రవర్తి (రూ.8 కోట్లు), వెంకటేశ్ అయ్యర్ (రూ.8 కోట్లు), సునీల్ నరైన్ (రూ.6 కోట్లు)లను అట్టిపెట్టుకుంది.   

412

ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు రిషబ్ పంత్ (రూ.16 కోట్లు), అక్షర్ పటేల్ (రూ.9 కోట్లు), పృథ్వీషా (రూ.7.5 కోట్లు), అన్రీచ్ నోకియా (రూ.6.5 కోట్లు) లను రిటైన్ చేసుకుని, అట్టి పెట్టుకుంది. 

512

వీళ్లంతా స్టార్ ప్లేయర్ల కోసం భారీగా ఖర్చు కొడితే అన్‌క్యాప్డ్ ప్లేయర్ల కోసం రూ.4 కోట్లు చెల్లించాల్సి రావడంతో చాలా ఫ్రాంఛైజీలు ఈ విషయంలో ముందుకు రాలేదు. అయితే మూడు ఫ్రాంఛైజీలు మాత్రం అన్‌క్యాప్డ్ ప్లేయర్ల కోసం భారీగా ఖర్చు పెట్టేందుకు సిద్ధమయ్యాయి...

612

ఉమ్రాన్ మాలిక్: నటరాజన్ కరోనా బారిన పడడంతో అతని స్థానంలో జట్టులోకి వచ్చాడు ఉమ్రాన్ మాలిక్. 150 కి.మీ.ల వేగంతో బంతులు విసిరి, క్రికెట్ ప్రపంచాన్ని అబ్బురపరిచాడు ఉమ్రాన్ మాలిక్...

712

విరాట్ కోహ్లీ కూడా 150కి.మీ.ల వేగంతో బంతులు వేసే భారత పేసర్‌పై ప్రశంసలు కురిపించాడు. కెప్టెన్‌ కేన్ విలియంసన్‌ను తప్ప, అందరినీ వదిలేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్... అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా ఉమ్రాన్ మాలిక్ కోసం రూ.4 కోట్లు చెల్లించడానికి సిద్ధమైంది. 

812

అబ్దుల్ సమద్:  ఉమ్రాన్ మాలిక్ మాదిరిగానే జమ్మూకశ్మీర్ నుంచి ఎంట్రీ ఇచ్చి, అదరగొట్టిన ఆల్‌రౌండర్ అబ్దుల్ సమద్. అటు బ్యాటింగ్‌తో, ఇటు బౌలింగ్‌తో ఆకట్టుకున్న అబ్దుద్ సమద్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ రిటైన్ చేసుకుంది...

912

‘కశ్మీర్ నుంచి వచ్చిన నన్నూ, ఉమ్రాన్ మాలిక్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ రిటైన్ చేసుకోవడం గర్వంగా భావిస్తున్నా. అన్‌క్యాప్డ్ ప్లేయర్లమైనా, మమ్మల్ని అట్టిపెట్టుకోవడం ఆనందంగా ఉంది...’ అంటూ కామెంట్ చేశాడు అబ్బుదల్ సమద్...

1012

యశస్వి జైస్వాల్: అండర్-19 వరల్డ్ కప్ నుంచి ఐపీఎల్‌లోకి దూసుకొచ్చాడు యశస్వి జైస్వాల్. సీఎస్‌కేతో జరిగిన లీగ్ మ్యాచ్‌లో 19 బంతుల్లో హాఫ్  సెంచరీ చేసిన జైస్వాల్‌ను రాజస్థాన్ రాయల్స్ జట్టు, రూ.4 కోట్లు చెల్లించి రిటైన్ చేసుకుంది..

1112

అర్ష్‌దీప్ సింగ్: పంజాబ్ కింగ్స్ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు యంగ్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్. కేవలం రూ.20 లక్షలకు అర్ష్‌దీప్ సింగ్‌ను కొనుగోలు చేసింది పంజాబ్. 12 మ్యాచుల్లో 18 వికెట్లు తీసిన అర్ష్‌దీప్ సింగ్, పంజాబ్ కింగ్స్‌ తరుపున మహ్మద్ షమీ తర్వాత అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా ఉన్నాడు..

1212

సీనియర్ స్టార్ పేసర్ మహ్మద్ షమీ 14 మ్యాచుల్లో 19 వికెట్లు తీస్తే, అర్ష్‌దీప్ సింగ్ 12 మ్యాచుల్లో 18 వికెట్లు పడగొట్టాడు. శ్రీలంక టూర్‌లో నెట్ బౌలర్‌గా వ్యవహరించిన అర్ష్‌దీప్ సింగ్, త్వరలో టీమిండియా తరుపున ఆరంగ్రేటం చేయడానికి సిద్ధమవుతున్నాడు..

click me!

Recommended Stories