ఓపెనర్‌గా సెహ్వాగ్, టూ డౌన్‌లో సచిన్ టెండూల్కర్... ద్రావిడ్, విరాట్ కోహ్లీ, అనిల్ కుంబ్లేలకు దక్కని చోటు...

First Published Dec 2, 2021, 12:08 PM IST

భారత సీనియర్ స్పిన్నర్ హర్భజన్ సింగ్, ఆల్‌టైం టెస్టు ఎలెవన్ జట్టును ప్రకటించాడు. భజ్జీ ప్రకటించిన ఆల్‌టైం బెస్ట్ టెస్టు ఎలెవన్ టీమ్‌లో కేవలం ఇద్దరు భారతీయ ప్లేయర్లకు మాత్రమే చోటు దక్కడం విశేషం...

అలెస్టర్ కుక్: ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్, బ్యాట్స్‌మెన్ అలెస్టర్ కుక్‌ని ఓపెనర్‌గా ఎంచుకున్నాడు హర్భజన్ సింగ్. 161 టెస్టుల్లో 12,472 పరుగులు చేసిన కుక్, 33 సెంచరీలు, 57 హాఫ్ సెంచరీలు బాదాడు..

వీరేంద్ర సెహ్వాగ్: భారత మాజీ క్రికెటర్, మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ 104 టెస్టుల్లో 23 సెంచరీలు, 32 హాఫ్ సెంచరీలతో 8586 పరుగులు చేశాడు. వీరూని తన టీమ్‌కి ఓపెనర్‌గా ఎంచుకున్నాడు భజ్జీ...

బ్రియాన్ లారా: విండీస్ మాజీ దిగ్గజ బ్యాట్స్‌మెన్ బ్రియాన్ లారాని తన ఆల్‌టైం బెస్ట్ టెస్టు ఎలెవన్ టీమ్‌లో వన్ డౌన్ ప్లేయర్‌గా చోటు కల్పించాడు హర్భజన్ సింగ్...

సచిన్ టెండూల్కర్: తన కెరీర్‌లో 200 టెస్టు మ్యాచులు ఆడిన సచిన్ టెండూల్కర్, 51 సెంచరీలు, 68 హాఫ్ సెంచరీలతో 15,921 పరుగులు చేశాడు. మాస్టర్‌ను తన టీమ్‌లో డూ డౌన్ ప్లేయర్‌గా ఎంపిక చేశాడు హర్భజన్ సింగ్. 

స్టీవ్ వా (కెప్టెన్): ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ వాని తన ఆల్‌టైం బెస్ట్ టెస్ట్ ఎలెవన్ టీమ్‌కి కెప్టెన్‌గా ఎంచుకున్నాడు హర్భజన్ సింగ్. తన కెరీర్‌లో 168 టెస్టులు ఆడిన స్టీవ్ వా, 32 సెంచరీలతో 10,927 పరుగులు చేశాడు...

జాక్వస్ కలీస్: సౌతాఫ్రికా మాజీ ఆల్‌రౌండర్ జాక్వస్ కలీస్‌కి హర్భజన్ సింగ్ ఆల్‌టైం బెస్ట్ టెస్టు టీమ్‌లో చోటు దక్కింది. తన కెరీర్‌లో 166 టెస్టులు ఆడిన కలీస్, 45 సెంచరీలతో 13,289 పరుగులు చేయడమే కాకుండా బౌలింగ్‌లో 292 వికెట్లు పడగొట్టాడు.

కుమార్ సంగర్కర (వికెట్ కీపర్): శ్రీలంక మాజీ క్రికెటర్, కెప్టెన్ కుమార సంగర్కరకి హర్భజన్ సింగ్ ఆల్‌టైం బెస్ట్ టెస్టు టీమ్‌లో వికెట్ కీపర్‌ బ్యాట్స్‌మెన్‌గా చోటు దక్కింది. 134 టెస్టులు ఆడిన కుమార సంగర్కర, 38 సెంచరీలతో 12,400 పరుగులు చేశాడు. అలాగే వికెట్ కీపింగ్‌లో 182 క్యాచులు, 20 స్టంపౌట్లు చేశాడు.

షేన్ వార్న్: ఆసీస్ దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్‌కి కూడా హర్భజన్ సింగ్ ఆల్‌టైం బెస్ట్ టెస్టు ఎలెవన్‌లో ప్లేస్ దక్కింది. 145 టెస్టులు ఆడిన షేన్ వార్నర్, 708 వికెట్లు పడగొట్టాడు...

వసీం అక్రమ్: పాక్ మాజీ పేసర్ వసీం అక్రమ్‌కి కూడా హర్భజన్ సింగ్ ఆల్‌టైం బెస్ట్ టెస్టు ఎలెవన్‌లో చోటు దక్కింది. 104 టెస్టుల్లో 3 సెంచరీలతో 2898 పరుగులు చేసిన వసీం అక్రమ్, 414 వికెట్లు పడగొట్టాడు. 

గ్లెన్ మెక్‌గ్రాత్: ఆసీస్ మాజీ పేసర్ గ్లెన్ మెక్‌గ్రాత్, తన కెరీర్‌లో 124 టెస్టుల్లో 563 వికెట్లు పడగొట్టాడు. మెక్‌గ్రాత్‌కి కూడా హర్భజన్ సింగ్, ఆల్‌టైం బెస్ట్ టెస్టు ఎలెవన్‌లో చోటు దక్కింది...

జేమ్స్ అండర్సన్: ఇంగ్లాండ్ సీనియర్ పేసర్ జేమ్స్ అండర్సన్‌కి హర్భజన్ సింగ్ ఆల్‌టైం బెస్ట్ ఎలెవన్ టీమ్‌లో చోటు దక్కింది. 166 టెస్టుల్లో 632 వికెట్లు తీసిన అండర్సన్, ఇంకా క్రికెట్‌లో కొనసాగుతున్నాడు. భజ్జీ ఆల్‌టైం టెస్టు టీమ్‌లో చోటు దక్కించుకున్న ఒకే ఒక్క రిటైర్ కాని క్రికెటర్ అండర్సన్.. 

ముత్తయ్య మురళీధరన్ (12వ సభ్యుడు): శ్రీలంక మాజీ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్‌కి ఆల్‌టైం బెస్ట్ టెస్టు ఎలెవన్‌ టీమ్‌లో 12వ ప్లేయర్‌గా చోటు కల్పించాడు.  133 టెస్టులు ఆడిన మురళీధరన్, 800 టెస్టు వికెట్లు తీశాడు...

భారత మాజీ క్రికెటర్, ప్రస్తుత హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్‌తో పాటు విరాట్ కోహ్లీ, అనిల్ కుంబ్లే వంటి భారత దిగ్గజ క్రికెటర్లకు హర్భజన్ సింగ్ ఆల్‌టైం బెస్ట్ ఎలెవన్ టీమ్‌లో చోటు దక్కకపోవడం విశేషం... 

హర్భజన్ సింగ్ ఆల్‌టైం బెస్ట్ టెస్టు ఎలెవన్: అలెస్టర్ కుక్, వీరేంద్ర సెహ్వాగ్, బ్రియాన్ లారా, సచిన్ టెండూల్కర్, స్టీవ్ వా (కెప్టెన్), జాక్వస్ కలీస్, కుమార సంగర్కర (వికెట్ కీపర్), షేన్ వార్న్, వసీం అక్రమ్, గ్లెన్ మెక్‌గ్రాత్, జేమ్స్ అండర్సన్ (12వ సభ్యుడు ముత్తయ్య మురళీధరన్)

click me!