స్టార్ బౌలర్లను పట్టించుకోని ఫ్రాంఛైజీలు... చేతన్ సకారియా, ఖలీల్ అహ్మద్‌లకు...

Published : Feb 13, 2022, 02:29 PM IST

ఐపీఎల్ 2022 మెగా వేలం రెండో రోజు కూడా అంతర్జాతీయ స్టార్లకు నిరాశ తప్పలేదు. భారత యంగ్ ప్లేయర్ల కోసం కోట్లు చెల్లించడానికి ముందుకొచ్చిన ఫ్రాంఛైజీలు, ఐసీసీ నెం.1 బ్యాటర్ డేవిడ్ మిలాన్, నెం.1 బౌలర్ షబ్రేజ్ షంసీలను అస్సలు పట్టించుకోలేదు...

PREV
115
స్టార్ బౌలర్లను పట్టించుకోని ఫ్రాంఛైజీలు... చేతన్ సకారియా, ఖలీల్ అహ్మద్‌లకు...

చేతన్ సకారియా కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు పోటీపడ్డాయి. భారత యంగ్ పేసర్ చేతన్ సకారియాని రూ.4.2 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కొనుగోలు చేసింది... 

215


భారత సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మను కొనుగోలు చేయడానికి ఏ జట్టూ ఆసక్తి చూపించలేదు. గత సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కి ఆడిన ఇషాంత్ శర్మ, గాయం కారణంగా సీజన్ మధ్యలోనే దూరమైన విషయం తెలిసిందే. 

315

ఖలీల్ అహ్మద్ కోసం ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు పోటీ పడ్డాయి. భారత పేసర్ ఖలీల్ అహ్మద్‌ను రూ. 5.25కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కొనుగోలు చేసింది... 

415

శ్రీలంక పేసర్ దుష్మంత చమీర కోసం లక్నో, ఆర్‌సీబీ జట్లు పోటీపడ్డాయి. శ్రీలంక పేసర్ దుష్మంత చమీరను రూ.2 కోట్లకు లక్నో సూపర్ జెయింట్ జట్టు కొనుగోలు చేసింది..

515

సౌతాఫ్రికా పేసర్ లుంగి ఎంగిడిని కొనుగోలు చేయడానికి ఏ ఫ్రాంఛైజీ కూడా ఆసక్తి చూపించకపోవడం ఆశ్చర్యానికి గురి చేసింది. 

615

సన్‌రైజర్స్ హైదరాబాద్‌ మాజీ బౌలర్ సందీప్ శర్మను బేస్ ప్రైజ్ రూ.50 లక్షలకు పంజాబ్ కింగ్స్ జట్టు కొనుగోలు చేసింది..

715

భారత బౌలర్ నవ్‌దీప్ సైనీ కోసం ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్, రాజస్థాన్ రాయల్స్ జట్లు పోటీపడ్డాయి. నవ్‌దీప్ సైనీని రూ. 2.6కోట్లకు కొనుగోలు చేసింది రాజస్థాన్ రాయల్స్ జట్టు... 

815


విండీస్ బౌలర్ షెల్డన్ కాట్రెల్‌ను కొనుగోలు చేయడానికి ఏ జట్టూ ఆసక్తి చూపించలేదు. భారత బౌలర్ జయద్‌వ్ ఉనద్కత్‌‌ను కొనుగోలు చేయడానికి ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు పోటీపడ్డాయి. భారత బౌలర్ జయద్‌వ్ ఉనద్కత్‌‌ను రూ.1.30 కోట్లకు ముంబై ఇండియన్స్ జట్టు కొనుగోలు చేసింది. 

915

నాథన్ కౌంటర్‌ నైల్‌ను కొనుగోలు చేయడానికి ఏ ఫ్రాంఛైజీ ఆసక్తి చూపించలేదు. భారత బౌలర్ మయాంక్ మార్కండేని రూ. 65 లక్షలకు కొనుగోలు చేసింది ముంబై ఇండియన్స్ జట్టు... 

1015

ఐసీసీ నెం. 1 బౌలర్, సౌతాఫ్రికా స్పిన్నర్ తబ్రేజ్ షంసీని ఏ జట్టూ కొనుగోలు చేయడానికి ఇష్టపడలేదు. ఆఫ్ఘాన్ స్పిన్నర్ క్వైస్ అహ్మద్‌‌ను ఏ ఫ్రాంఛైజీ కొనుగోలు చేయలేదు.

1115

షాబాజ్ నదీంను లక్నో సూపర్ జెయింట్ జట్టు బేస్ ప్రైజ్ రూ.50 లక్షలకు కొనుగోలు చేసింది... మహీష్ దీక్షణను జట్టు రూ.70 లక్షలకు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కొనుగోలు చేసింది. 

1215

భారత స్పిన్నర్లు కర్ణ్ శర్మ, న్యూజిలాండ్ స్పిన్నర్ ఇష్ సోదీ, భారత సీనియర్ స్పిన్నర్ పియూష్ చావ్లాలను ఏ జట్టూ కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపించలేదు...

1315

భారత బ్యాటర్లు హిమ్మత్ సింగ్, విరాట్ సింగ్, సచిన్ బేబీ, హర్నూర్ సింగ్, హిమాన్షు రానా, రికీ భుయ్‌లను ఏ జట్టూ కొనుగోలు చేయడానికి ముందుకు రాలేదు...

1415

రింకూ సింగ్‌ను కొనుగోలు చేయడానికి లక్నో సూపర్ జెయింట్, కోల్‌కత్తా నైట్‌రైడర్స్ జట్లు పోటీపడ్డాయి. రింకూ సింగ్‌ని రూ.55 లక్షలకు కొనుగోలు చేసింది కేకేఆర్ జట్టు...

1515

గత సీజన్‌లో పంజాబ్ కింగ్స్‌కి ఆడిన మనన్ వోహ్రాను లక్నో సూపర్ జెయింట్స్ జట్టు బేస్ ప్రైజ్ రూ.20 లక్షలకు కొనుగోలు చేసింది. 

click me!

Recommended Stories