ఐపీఎల్ 2022 మెగా వేలానికి ఇంకా కొన్ని రోజులు మాత్రమే ఉంది. ఈసారి వేలంలో జాక్ పాట్ కొట్టేది ఎవరు? లక్కీగా లాటరీలో కోట్లు దక్కించుకునేది ఎవరు? అనేది ఆసక్తికరంగా మారింది. ఐపీఎల్ 2022 మెగా వేలంలో అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న యంగ్ ప్లేయర్లు వీరే...
కార్తీక్ త్యాగి: అండర్-19 వరల్డ్ కప్ 2020 ద్వారా ఐపీఎల్‌లోకి వచ్చిన యంగ్ పేసర్ కార్తీక్ త్యాగి. ఐపీఎల్ 2021 సీజన్‌లో పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అద్భుత స్పెల్‌తో అందరి దృష్టిని ఆకర్షించాడు కార్తీక్ త్యాగి...
211
ఆఖరి ఓవర్‌లో పంజాబ్ కింగ్స్ విజయానికి 4 పరుగులు కావాల్సిన దశలో మూడు డాట్ బాల్స్ వేసిన కార్తీక్ త్యాగి, రెండు వికెట్లు తీశాడు. దీంతో 2 పరుగుల తేడాతో ఉత్కంఠ విజయాన్ని అందుకుంది రాజస్థాన్ రాయల్స్...
311
140 కి.మీ.ల వేగంతో నిప్పులు చెరిగే బంతులు వేసే కార్తీక్ త్యాగి, ఈ వేలంలో రూ.3 నుంచి రూ.5 కోట్ల వరకూ ఈజీగా దక్కించుకునే అవకాశం ఉందని అంచనా... ఫ్రాంఛైజీలు పోటీపడితే త్యాగికి రూ.7-8 కోట్ల వరకూ దక్కొచ్చు.
411
ఆవేశ్ ఖాన్: ఐపీఎల్ 2021 సీజన్‌లో హర్షల్ పటేల్ తర్వాత అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా నిలిచాడు ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్ ఆవేశ్ ఖాన్. టీమిండియా ఆరంగ్రేటం కోసం ఎదురుచూస్తున్న ఆవేశ్ ఖాన్‌కి ఈజీగా రూ.4-8 కోట్ల వరకూ ధర పలికే అవకాశం ఉంది...
511
ఛేతన్ సకారియా: ఐపీఎల్ 2021 ద్వారా ఆరంగ్రేటం చేసి, మొదటి సీజన్‌లోనే అందర్నీ మెస్మరైజ్ చేశాడు ఛేతన్ సకారియా. ఎమ్మెస్ ధోనీ, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి స్టార్లను అవుట్ చేసిన సకారియాకి రూ.3-5 కోట్ల వరకూ దక్కే అవకాశం ఉంది...
611
షారుక్ ఖాన్: ఐపీఎల్ 2021 సీజన్‌లోనే భారీ అంచనాలతో అడుగుపెట్టాడు ఆల్‌రౌండర్ షారుక్ ఖాన్. భారీ సిక్సర్లతో మ్యాచ్‌ని మలుపు తిప్పే ఈ ఫినిషర్, తన బేస్ ప్రైజ్‌ను కూడా రూ.40 లక్షలకు పెంచాడు. షారుక్ ఖాన్ ఈసారి రూ.4 కోట్ల వరకూ ఈజీగా దక్కించుకోవచ్చు...
711
శివమ్ మావి: ఐపీఎల్ 2021 సీజన్‌లో అందరి దృష్టినీ ఆకర్షించిన మరో యంగ్ బౌలర్ శివమ్ మావి. కేకేఆర్ విజయాల్లో కీలక పాత్ర పోషించిన శివమ్ మావి, రూ.1 - 3 కోట్ల వరకూ దక్కించుకోవచ్చు...
811
రాహుల్ త్రిపాఠి: నిలకడైన బ్యాటింగ్‌తో అందరినీ ఆకట్టుకున్న ప్లేయర్ రాహుల్ త్రిపాఠి. ఐపీఎల్ 2021 సీజన్‌లో మెరుపులు మెరిపించిన రాహుల్ త్రిపాఠి కోసం సీఎస్‌కే, ఆర్‌సీబీ వంటి జట్లు పోటీపడే అవకాశం ఉంది. త్రిపాఠి కోసం రూ. 6 కోట్ల వరకూ చెల్లించడానికి సిద్ధంగా ఉంటాయి ఫ్రాంఛైజీలు...
911
రియాన్ పరాగ్: రాజస్థాన్ రాయల్స్‌లో ఉన్న ఈ అస్సామీ క్రికెటర్, ఐపీఎల్ 2020 సీజన్‌లో అద్భుత ఇన్నింగ్స్‌లతో జట్టుకి విజయాలు అందించాడు. గత సీజన్‌లో ఆకట్టుకోకపోయినా ఈ యంగ్ బ్యాట్స్‌మెన్‌పై రూ.1-4 కోట్ల వరకూ పెట్టేందుకు ఆసక్తి చూపించవచ్చు ఫ్రాంఛైజీలు...
1011
రాహుల్ తెవాటియా: ఐపీఎల్ 2020 సీజన్ పర్ఫామెన్స్ కారణంగా సెలక్టర్ల దృష్టిని ఆకర్షించిన ఆల్‌రౌండర్ రాహుల్ తెవాటియా. భారీ సిక్సర్లతో మ్యాచ్‌ను మలుపు తిప్పే తెవాటియా, గత సీజన్‌లో మెరుపులు మెరిపించలేకపోయాడు. అయితే తెవాటియాకి ఈజీగా రూ.5 కోట్ల వరకూ దక్కొచ్చు...
1111
కెఎస్ భరత్: ఐపీఎల్ 2021 సీజన్‌లో ఆరంగ్రేటం చేసి, ఆకట్టుకున్నాడు తెలుగు వికెట్ కీపర్ కె శ్రీకర్ భరత్. ఢిల్లీపై ఆఖరి బంతికి సిక్సర్ కొట్టి విజయాన్ని అందించిన భరత్, ఈసారి రూ.2- 7 కోట్ల వరకూ దక్కించుకోవచ్చు...