ఐదేళ్లల్లో ఎప్పుడూ ఇలా జరగలేదు, టీ20 వరల్డ్ కప్ 2021కి ఎంపిక కాకపోవడంతో... యజ్వేంద్ర చాహాల్..

First Published Feb 7, 2022, 10:36 AM IST

టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీకి ఎంపిక చేసిన జట్టులో స్పిన్నర్ యజ్వేంద్ర చాహాల్ లేకపోవడంపై పెద్ద చర్చే జరిగింది. టీ20ల్లో టీమిండియాకి మెయిన్ స్పిన్నర్‌గా ఉంటూ వస్తున్న చాహాల్‌ను ఎందుకు పక్కనబెట్టారనేది అంతుచిక్కని ప్రశ్నగా మారింది...

యూఏఈ పిచ్‌లపై జరిగిన ఐపీఎల్ 2021 సీజన్ సెకండాఫ్‌లో అద్భుతమైన ప్రదర్శన ఇచ్చిన యజ్వేంద్ర చాహాల్, టీ20 వరల్డ్ కప్ 2021 జట్టులోకి ఎంట్రీ ఇస్తాడని అనుకున్నారంతా...

అయితే ఐపీఎల్ పర్ఫామెన్స్ కారణంగా శార్దూల్ ఠాకూర్‌ని తుది జట్టుకి జత చేసిన సెలక్టర్లు, అక్షర్ పటేల్‌ను రిజర్వు ప్లేయర్‌గా మార్చడం తప్ప పెద్దగా మార్పులేమీ చేయలేదు...

‘టీ20 వరల్డ్ కప్ టోర్నీకి జట్టును 9:30కి ప్రకటిస్తారని చెప్పారు, ఆ రోజు కాస్త ఆలస్యంగా అనౌన్స్ చేశారు. ప్రపంచకప్ జట్టులో నా పేరు ఉండదని అస్సలు ఊహించలేదు...

వరల్డ్ కప్‌కి ప్రకటించిన జట్టును చూసిన తర్వాత ఓ పావుగంట పాటు నేనేమీ మాట్లాడకుండా షాక్‌లో ఉండిపోయాను. ఓ విధమైన షాక్‌లోకి వెళ్లిపోయాను...

డిన్నర్ వచ్చింది. కానీ తినాలని అనిపించలేదు. ఐదేళ్లుగా ప్రతీ టీ20 మ్యాచ్‌ ఆడుతూ వచ్చాను. నన్ను ఎప్పుడూ పర్ఫామెన్స్ బాలేదని, ఏ మ్యాచ్‌కీ పక్కనబెట్టింది లేదు...

అందుకే టీ20 వరల్డ్ కప్ టీమ్‌లో నా పేరు లేకపోవడంతో తీవ్ర నిరుత్సాహాన్ని గురయ్యాను. అయితే నన్ను నేను నిరూపించుకోవడానికి దీన్ని మరో అవకాశంగా భావించాలని ఫిక్స్ అయ్యాను,...’ అంటూ చెప్పుకొచ్చాడు యజ్వేంద్ర చాహాల్...

టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీకి జట్టును ప్రకటించిన ఛీఫ్ సెలక్టర్ ఛేతన్ శర్మ, చాహాల్‌తో పోలిస్తే రాహుల్ చాహార్ వేగంగా బంతులు వేస్తాడని, యూఏఈ పిచ్‌లకు అతని బౌలింగ్ సరిగ్గా సూట్ అవుతుందని కామెంట్ చేశాడు..

అయితే ప్రధాన స్పిన్నర్ యజ్వేంద్ర చాహాల్ స్థానంలో టీ20 వరల్డ్ కప్ 2021కి ఎంపికైన రాహుల్ చాహాల్, టోర్నీలో ఒకే ఒక్క మ్యాచ్ మాత్రమే ఆడగలిగాడు... యంగ్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి కూడా పెద్దగా ప్రభావం చూపించలేకపోయాడు. 

వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో 49 పరుగులకి 4 వికెట్లు తీసి విండీస్‌ను స్వల్ప స్కోరుకి కట్టడి చేయడంలో కీలక పాత్ర పోషించిన యజ్వేంద్ర చాహాల్ ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు గెలిచాడు. 

click me!