అప్పుడు ధోనీ రివ్యూ సిస్టమ్ అయితే, ఇప్పుడు అది రోహిత్‌ది... సునీల్ గవాస్కర్ కామెంట్స్...

Published : Feb 07, 2022, 11:25 AM IST

వెస్టిండీస్‌తో జరిగిన మొదటి వన్డేలో భారత జట్టు ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టింది. కెప్టెన్‌గా కొత్త ఇన్నింగ్స్ మొదలెట్టిన రోహిత్ శర్మ, ఫీల్డింగ్ మార్పులతో పాటు బౌలింగ్ మార్పులు, డీఆర్‌ఎస్ తీసుకోవడంలోనూ క్రికెట్ ఫ్యాన్స్‌ను ఇంప్రెస్ చేశాడు...

PREV
110
అప్పుడు ధోనీ రివ్యూ సిస్టమ్ అయితే, ఇప్పుడు అది రోహిత్‌ది... సునీల్ గవాస్కర్ కామెంట్స్...

మొదటి వన్డేలో టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్న తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ తీసుకున్న మూడు డీఆర్‌ఎస్ నిర్ణయాలు, టీమిండియాకి అనుకూలంగా వచ్చాయి... 

210

భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా మూడు ఫార్మాట్లలో సక్సెస్ అయినా, డీఆర్‌ఎస్ తీసుకునే విషయంలో మాత్రం అతనికి చెప్పుకోదగ్గ రికార్డు లేదు...

310

బౌలర్ అవుట్ అంటూ అప్పీలు చేస్తే చాలు, మరో ఆలోచన లేకుండా డీఆర్‌ఎస్ తీసుకునేవాడు విరాట్ కోహ్లీ... అందుకే చాలాసార్లు డీఆర్‌ఎస్ నిర్ణయాలు, టీమిండియాకి వ్యతిరేకంగా వచ్చేవి... ఈ విషయంలో విరాట్ చాలాసార్లు ట్రోల్స్ ఎదుర్కోవాల్సి వచ్చింది...

410

అయితే రోహిత్ శర్మ మాత్రం అలా చేయడం లేదు. చాలా కూల్‌గా, కామ్‌గా బౌలర్, వికెట్ కీపర్‌తో పాటు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీతో కూడా చర్చించి డీఆర్‌ఎస్ తీసుకున్నాడు రోహిత్ శర్మ...

510

విండీస్‌తో మొదటి వన్డేలో రోహిత్ శర్మ తీసుకున్న మూడు డీఆర్‌ఎస్ నిర్ణయాలు, భారత జట్టుకి అనుకూలంగా వచ్చి, కీలక సమయాల్లో అవసరమైన వికెట్లు తెచ్చిపెట్టాయి...

610

నికోలస్ పూరన్ అవుట్ విషయంలో, ఆ తర్వాత అకీల్ హస్సేన్ వికెట్ విషయంలో విరాట్ కోహ్లీ బ్యాటుకి తగిలిందని చెప్పడం, రోహిత్ రివ్యూ తీసుకోవడం... రిప్లైలో వికెట్ దక్కడం జరిగిపోయాయి...

710

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి డీఆర్‌ఎస్ తీసుకోవడంలో మంచి రికార్డు ఉంది. ధోనీ డీఆర్‌ఎస్ కోరాడంటే, అంపైర్ తన నిర్ణయాన్ని మార్చుకోవడానికి సిద్ధంగా ఉండాల్సిందేనని నమ్ముతారు మాహీ ఫ్యాన్స్...

810

అందుకే డీఆర్‌ఎస్ అంటే డెసిషన్ రివ్యూ సిస్టమ్ కాదు, ధోనీ రివ్యూ సిస్టమ్ అని కొత్త అర్థం కూడా చెబుతారు. ఈ విషయంలో మాత్రం ఎమ్మెస్ ధోనీ అడుగుజాడల్లో రోహిత్ శర్మ నడుస్తున్నాడంటూ అప్పుడే సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తుతున్నాయి...

910

‘రోహిత్ శర్మ రివ్యూల విషయంల పక్కాగా ఉన్నాడు. ఇంతకుముందు ధోనీ, డీఆర్‌ఎస్ తీసుకుంటే చాలాసార్లు అంపైర్లు నిర్ణయాలను మార్చుకోవాల్సి వచ్చింది. అందుకే డీఆర్‌ఎస్‌ను ధోనీ రివ్యూ సిస్టమ్ అనేవాళ్లు...

1010

ఇకపై డీఆర్‌ఎస్ అంటే డెఫినెట్లీ రోహిత్ సిస్టం అని అనాల్సి ఉంటుందేమో... అతని కెప్టెన్సీకి నేను 10కి 9.9 మార్కులు ఇస్తా...’ అంటూ కామెంట్ చేశాడు మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్...

Read more Photos on
click me!

Recommended Stories