ఆ ముగ్గురు ప్లేయర్ల కోసం రూ.30 కోట్లు... సీజన్లు మారుతున్నా తీరు మార్చుకోని ఆర్‌సీబీ...

Published : Feb 08, 2022, 02:00 PM IST

ఐపీఎల్‌లో ఫాలోయింగ్ విషయంలో ఆర్‌సీబీ స్థాయి వేరు. ప్రపంచంలోనే అత్యధిక ఫాలోయింగ్, క్రేజ్ ఉన్న ఫ్రాంఛైజీల్లో ఒకటైన ఆర్‌సీబీ, ఇప్పటిదాకా టైటిల్ మాత్రం గెలవలేకపోయింది. సీజన్లు మారుతున్నా, ఆర్‌సీబీ తీరు మాత్రం మారడం లేదు...

PREV
111
ఆ ముగ్గురు ప్లేయర్ల కోసం రూ.30 కోట్లు... సీజన్లు మారుతున్నా తీరు మార్చుకోని ఆర్‌సీబీ...

ఐపీఎల్‌ 2021 వేలంలో గ్లెన్ మ్యాక్స్‌వెల్, కేల్ జెమ్మీసన్, డాన్ క్రిస్టియన్ ప్లేయర్ల కోసం రూ.29.25 కోట్లు ఖర్చు పెట్టింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు..

211

అయితే గ్లెన్ మ్యాక్స్‌వెల్ మినహా మిగిలిన ఇద్దరూ చెప్పుకోదగ్గ పర్ఫామెన్స్ ఇచ్చింది లేదు. అంతకుముందు సీజన్లలో కూడా భారీ మొత్తాన్ని ఖర్చు చేసి ప్లేయర్లను కొనుగోలు చేయడం, వాళ్లు సరిగా పర్ఫామెన్స్ ఇవ్వకపోవడంతో తర్వాతి సీజన్‌లో వారిని వదిలించుకోవడం ఆర్‌సీబీని ఆనవాయితీగా వస్తోంది...

311

షేన్ వాట్సన్, కెఎల్ రాహుల్, క్రిస్ గేల్, క్రిస్ మోరిస్, మొయన్ ఆలీ వంటి ప్లేయర్లు కూడా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నుంచి వేరే జట్లకి వెళ్లిన తర్వాత అదరగొట్టినవాళ్లే...

411

ఐపీఎల్ 2022 సీజన్‌ మెగా వేలంలోనూ ఇదే రకమైన ప్లానింగ్‌తోనూ వెళ్లాలని ఆలోచిస్తోందట ఆర్‌సీబీ. కేవలం ముగ్గురు ప్లేయర్ల కోసం రూ.30 కోట్లు ఖర్చు పెట్టేందుకు సిద్ధమైందని సమాచారం...

511

ఐపీఎల్ 2022 మెగా వేలంలో 590 మంది క్రికెటర్లు పాల్గొనబోతున్నారు. వీరిలో 228 మంది క్యాప్డ్‌ ప్లేయర్లు, 355 మంది అన్‌క్యాప్డ్‌ ప్లేయర్లు ఉన్నారు...

611

పేస్ ఆల్‌రౌండర్ల కోసం వెతుకున్న ఆర్‌సీబీ, వెస్టిండీస్ ఆల్‌రౌండర్ జాసన్ హోల్డర్ కోసం అవసరమైతే రూ.12 కోట్ల వరకూ ఖర్చు చేయాలని ఆలోచన చేస్తోందని సమాచారం...

711

అలాగే సీనియర్ ప్లేయర్, వికెట్ కీపర్ బ్యాటర్ అంబటి రాయుడు కోసం రూ.8 కోట్లు పక్కన పెట్టిన ఆర్‌సీబీ, రియాన్ పరాగ్ కోసం రూ.7 కోట్ల వరకూ ఖర్చు చేయాలని చూస్తోందట...

811

అంటే ఈ ముగ్గురు ప్లేయర్ల కోసమే రూ.27 కోట్లు ఖర్చు పెట్టబోతుందట ఆర్‌సీబీ. ఇదే నిజమైతే ఇప్పటికే అట్టిపెట్టుకున్న విరాట్, మ్యాక్స్‌వెల్, సిరాజ్‌లకు చెల్లించగా ఆర్‌సీబీ పర్సులో మిగిలింది రూ.57 కోట్లు మాత్రమే...

911

అందులో రూ.27 కోట్లు ఈ ముగ్గురి కోసం ఖర్చు పెడితే, ఇక మిగిలేది రూ.30 కోట్లు మాత్రమే. ఆరుగురు ప్లేయర్ల కోసం రూ.60 కోట్లు ఖర్చు పెడితే, మిగిలినదాంట్లో జట్టును నిర్మించడం చాలా కష్టమైపోతుంది...

1011

ఇంతకుముందు సీజన్లలోనూ ఆర్‌సీబీని ఇలాంటి సమస్యే వెంటాడింది. మిడిల్ ఆర్డర్‌లో సరైన ప్లేయర్లు లేక, సరైన డెత్ బౌలర్ లేక...చాలా మ్యాచులు ఓడిపోయింది రాయల్ ఛాలెంజర్స్...

1111

అయినా కూడా ప్లేయర్లను ఎలా కొనుగోలు చేయాలని, జట్టును ఎలా నిర్మించాలనే విషయంలో ఆర్‌సీబీ యాజమాన్యానికి సరైన క్లారిటీ రావడం లేదని అంటున్నారు క్రికెట్ విశ్లేషకులు...  

Read more Photos on
click me!

Recommended Stories