IPL2021 RR vs SRH: టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్... నాలుగు మార్పులతో సన్‌రైజర్స్...

IPL 2021 SRH vs RR: సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు... 

ఐపీఎల్ 2021 సీజన్‌లో ఇప్పటికే ప్లేఆఫ్ రేసు నుంచి తప్పుకుంది సన్‌రైజర్స్ హైదరాబాద్. 9 మ్యాచుల్లో ఒకే ఒక్క మ్యాచ్ గెలిచిన సన్‌రైజర్స్, కనీసం ఆఖరి స్థానం నుంచి పైకి రావాలన్నా.. మిగిలిన అన్ని మ్యాచుల్లో తప్పక గెలవాల్సి ఉంటుంది...

ఫస్టాఫ్‌లో డేవిడ్ వార్నర్ కెప్టెన్సీ తొలగించిన తర్వాత కేన్ విలియంసన్ కెప్టెన్సీలో ఆడిన మొదటి మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్‌పైనే... ఆ మ్యాచ్‌లో 55 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది సన్‌రైజర్స్...


ఫస్టాఫ్‌లో డేవిడ్ వార్నర్ లేకుండా రాజస్థాన్ రాయల్స్‌పై మ్యాచ్ ఆడిన సన్‌రైజర్స్ హైదరాబాద్, సెకండాఫ్‌లోనూ ఆర్‌ఆర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో వార్నర్ భాయ్‌ని పక్కనబెట్టింది...

మనీశ్ పాండే, కేదార్ జాదవ్, డేవిడ్ వార్నర్‌లను పక్కనబెట్టిన సన్‌రైజర్స్ హైదరాబాద్, వారి స్థానంలో ప్రియమ్ గార్గ్, అభిషేక్ శర్మ, జాసన్ రాయ్‌లకు అవకాశం ఇచ్చింది...

అలాగే గాయపడిన సన్‌రైజర్స్ బౌలర్ ఖలీల్ అహ్మద్ స్థానంలో సిద్ధార్థ్ కౌల్‌కి తుదిజట్టులో అవకాశం దక్కింది... 

సన్‌రైజర్స్ హైదరాబాద్: జాసన్ రాయ్, వృద్ధిమాన్ సాహా, కేన్ విలియంసన్, ప్రియమ్ గార్గ్, అభిషేక్ శర్మ, అబ్దుల్ సమద్, జాసన్ హోల్డర్, రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, సిద్ధార్థ్ కౌల్, సందీప్ శర్మ

రాజస్థాన్ రాయల్స్: ఇవిన్ లూయిస్, యశస్వి జైస్వాల్, సంజూ శాంసన్, లియాన్ లివింగ్‌స్టోన్, మహిపాల్ లోమ్రోర్, రియాన్ పరాగ్, రాహుల్ తెవాటియా, క్రిస్ మోరిస్, చేతన్ సకారియా, జయ్‌దేవ్ ఉనద్కడ్, ముస్తాఫిజుర్ రహ్మాన్

Latest Videos

click me!