IPL2021 SRH vs MI: ఇరగదీసిన ఇషాన్ కిషన్, సెన్సేషనల్ సూర్యకుమార్ యాదవ్... ముంబై రికార్డు స్కోరు...

First Published Oct 8, 2021, 9:32 PM IST

ప్లేఆఫ్ ఆశలు సజీవంగా ఉండాలనే భారీ స్కోరు చేయాల్సిన మ్యాచ్‌లో ఆకాశమే హద్దురా అన్నట్టుగా ఇన్నింగ్స్ ఆరంభించింది ముంబై ఇండియన్స్. ఇషాన్ కిషన్ మెరుపులు, సూర్యకుమార్ యాదవ్ సునామీ ఇన్నింగ్స్‌లతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి235 పరుగులు చేసింది ముంబై ఇండియన్స్. ఐపీఎల్ చరిత్రలో ముంబై ఇండియన్స్‌కి ఇదే అత్యధిక స్కోరు.

సీజన్‌ ఆసాంతం ఫామ్‌లో లేరని విమర్శలు ఎదుర్కొన్న ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ ఇద్దరూ ఈ మ్యాచ్‌లో అద్భుత ఇన్నింగ్స్‌లతో కమ్‌బ్యాక్ ఘనంగా చాటుకున్నారు...  

మొదటి బంతికే సిక్సర్ బాదిన ఇషాన్ కిషన్... ఆ తర్వాత సిద్ధార్థ్ కౌల్ వేసిన రెండో ఓవర్‌లో వరుసగా నాలుగు ఫోర్లు బాది ఏకంగా 18 పరుగులు రాబట్టాడు... మూడో ఓవర్‌లో రోహిత్ శర్మ ఓ ఫోర్ బాదగా, ఇషాన్ కిషన్ రెండు ఫోర్లు బాది... 15 పరుగులు రాబట్టారు. ఆ తర్వాత జాసన్ హోల్డర్ వేసిన నాలుగో ఓవర్‌లో ఏకంగా 22 పరుగులు రాబట్టారు ముంబై బ్యాట్స్‌మెన్...

16 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో హాఫ్ సెంచరీ మార్కు అందుకున్న ఇషాన్ కిషన్... 2021 సీజన్‌లో ఫాస్టెస్ట్ అర్ధశతకం బాదిన ప్లేయర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు... ఐపీఎల్‌ చరిత్రలో మూడో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేసిన ప్లేయర్‌గా నిలిచాడు ఇషాన్ కిషన్. 

ఐదు ఓవర్లు ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 78 పరుగులు చేసింది ముంబై ఇండియన్స్.  అయితే ఆరో ఓవర్‌లో బౌలింగ్‌కి వచ్చిన రషీద్ ఖాన్, సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి కావాల్సిన బ్రేక్ అందించాడు. 13 బంతుల్లో 3 ఫోర్లతో 18 పరుగులు చేసిన రోహిత్ శర్మ, భారీ షాట్‌కి ప్రయత్నించి నబీకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు...

6 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టానికి 83 పరుగులు చేసిన ముంబై ఇండియన్స్. 10 ఓవర్లు ముగిసేసరికి 131 పరుగులు చేసింది. వన్‌డౌన్‌లో వచ్చిన హార్దిక్ పాండ్యా 8 బంతుల్లో ఓ సిక్సర్‌తో 10 పరుగులు చేసి అవుట్ అయ్యాడు...

ఆ తర్వాత 32 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్సర్లతో 84 పరుగులు చేసిన ఇషాన్ కిషన్‌ను ఉమ్రాన్ మాలిక్ పెవిలియన్ చేర్చాడు. ఇషాక్ కిషన్ అవుటైన తర్వాత వరుస వికెట్లు కోల్పోయింది ముంబై ఇండియన్స్...

సిద్ధార్థ్ కౌల్ బౌలింగ్‌లో అంపైర్ అవుట్ ఇచ్చినా డీఆర్‌ఎస్ తీసుకుని బతికిపోయిన కిరన్ పోలార్డ్, 12 బంతుల్లో ఓ ఫోర్‌తో 13 పరుగులు మాత్రమే చేసి అభిషేక్ శర్మ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు.

పోలార్డ్‌ను అవుట్ చేసిన తర్వాతి బంతికే జేమ్స్ నీశమ్‌‌ను డకౌట్ చేసి, ముంబైకి ఊహించని షాక్ ఇచ్చాడు అభిషేక్ శర్మ. ఆ తర్వాత కృనాల్ పాండ్యా 7 బంతుల్లో ఓ ఫోర్‌తో 9 పరుగులు చేసి రషీద్ ఖాన్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు...

మిడిల్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ కూడా వస్తూనే సన్‌రైజర్స్‌ బౌలర్లపై దాడికి దిగాడు... 24 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు సూర్యకుమార్ యాదవ్...

కౌంటర్‌నైల్ 3 పరుగులు చేసి జాసన్ హోల్డర్ బౌలింగ్‌లో అవుట్ కాగా పియూష్ చావ్లా భారీ షాట్‌కి ప్రయత్నించి అవుట్ అయ్యాడు.. సూర్యకుమార్ యాదవ్ 40 బంతుల్లో 13 ఫోర్లు, 3 సిక్సర్లతో 82 పరుగులు చేశాడు...

ఒకే మ్యాచ్‌లో ఇద్దరు ముంబై ఇండియన్స్ బ్యాట్స్‌మెన్ 80+ పరుగులు చేయడం ఇదే తొలిసారి. సూర్యకుమార్ యాదవ్‌కి కూడా ఐపీఎల్‌లో ఇదే అత్యుత్తమ స్కోరు. ఇంతకుముందు 2020లో రాజస్థాన్‌పై చేసిన 79 పరుగులే సూర్య హైయెస్ట్ స్కోరు..

ఇంతకుముందు 2016లో పంజాబ్ కింగ్స్‌పై 223/6 పరుగులు చేసిన ముంబై ఇండియన్స్, నేటి మ్యాచ్‌తో ఆ స్కోరును అధిగమించి అత్యుత్తమ స్కోరు నమోదుచేసింది... సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై కూడా ఇదే అత్యధిక స్కోరు. 

click me!