IPL 2021: డియర్ సీఎస్‌కే, ఇదే నా మీ క్రీడాస్ఫూర్తి... కెఎల్ రాహుల్ సెంచరీ చేయకుండా ఉండేందుకు...

First Published Oct 8, 2021, 7:51 PM IST

ఐపీఎల్ 2021 సీజన్‌లో ప్లేఆఫ్స్‌కి చేరిన మొట్టమొదటి జట్టుగా నిలిచింది చెన్నై సూపర్ కింగ్స్. గత సీజన్‌లో ప్లేఆఫ్ రేసు నుంచి తప్పుకున్న మొదటి టీమ్‌గా నిలిచిన సీఎస్‌కే, అదిరిపోయే కమ్‌బ్యాక్ ఇచ్చింది...

గ్రూప్ స్టేజ్‌లో ఆఖరి మూడు మ్యాచుల్లో విజయాన్ని అందుకోలేకపోయింది చెన్నై సూపర్ కింగ్స్... టాప్ 2లో ఉన్న సీఎస్‌కేకి ఈ పరాజయాలు పెద్దగా ప్రభావం చూపించలేదు...

ఫెయిర్ ప్లే అవార్డులోనూ అన్ని జట్ల కంటే అత్యధిక పాయింట్లు సాధించి, టాప్‌లో కొనసాగుతోంది సీఎస్‌కే... ప్లేఆఫ్స్‌కి అర్హత సాధించిన ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కేకేఆర్ మాత్రం ఈ లిస్టులో ఆఖరున ఉండడంతో ఈ అవార్డు చెన్నైకి దక్కడం ఖాయంగా మారింది...
(photo Source- Getty)

అయితే పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ చేసిన పని, క్రీడాస్ఫూర్తికి విరుద్ధమంటూ, ధోనీ కెప్టెన్సీలోని టీమ్‌ ఇలా ప్రవర్తించడం కరెక్ట్ కాదంటూ ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు...

ఇంతకీ ఏం జరిగిందంటే... అవతలి ఎండ్‌లో పెద్దగా సపోర్ట్ దక్కకపోయినా 135 పరుగుల టార్గెట్‌ ఛేదనలో 42 బంతుల్లో 7 ఫోర్లు, 8 సిక్సర్లతో 98 పరుగులు చేసి వన్ మ్యాన్ షో చూపించాడు కెఎల్ రాహుల్...

అయితే సీఎస్‌కే బౌలర్లు చేసిన పని కారణంగానే కెఎల్ రాహుల్ సెంచరీకి 2 పరుగుల దూరంలో ఆగిపోయాడు.. పంజాబ్ కింగ్స్ విజయం ఖాయమైపోయిన తర్వాత సీఎస్‌కే బౌలర్లు ఎక్స్‌ట్రాలు ఇవ్వడం మొదలెట్టారు...

11వ ఓవర్‌ వేసిన దీపక్ చాహార్, తన ఓవర్‌లో రెండు వైడ్లు ఇవ్వగా, ఆ తర్వాత 12వ ఓవర్ వేసిన డీజే బ్రావో కూడా రెండు వైడ్లు వేశాడు. అంటే రెండు ఓవర్లలోనే 4 అదనపు పరుగులు వచ్చాయి...

ఈ కారణంగానే కెఎల్ రాహుల్ ఓ సెన్సేషనల్ సెంచరీని 2 పరుగుల తేడాతో మిస్ కావాల్సి వచ్చిందని, ఇదేనా చెన్నై ప్లేయర్ల క్రీడాస్ఫూర్తి అంటూ ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు...

అయితే చెన్నై అభిమానులు మాత్రం ఈ విమర్శలను తిప్పికొడుతున్నారు. మయాంక్ అగర్వాల్‌ అవుట్ విషయంలో కెఎల్ రాహుల్ క్రీడాస్ఫూర్తి చూపించాడా? అంటూ ట్రోల్ చేస్తున్నారు...

12 బంతుల్లో 2 ఫోర్లతో 12 పరుగులు చేసిన మయాంక్ అగర్వాల్, శార్దూల్ ఠాకూర్ ఓవర్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. రివ్యూ తీసుకునే విషయంలో కెఎల్ రాహుల్‌తో చర్చించిన మయాంక్, అతని సలహా విని రివ్యూ తీసుకోకుండా పెవిలియన్ చేరాడు..

అయితే టీవీ రిప్లైలో బంతి వికెట్లను మిస్ అవుతున్నట్టు స్పష్టంగా కనిపించింది. ఆరెంజ్ క్యాప్ కోసం ఆడే కెఎల్ రాహుల్, తన జట్టులోని ప్లేయర్లు రాణించడాన్నే తట్టుకోలేకపోతున్నాడంటూ, అందుకే రివ్యూ అవకాశం ఉన్నా తనకోసం అట్టిపెట్టుకున్నాడని ట్రోల్ చేస్తున్నారు చెన్నై ఫ్యాన్స్..

click me!