IPL2021 MI vs SRH: మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందా ఏంది? ముంబై ఇండియన్స్ ఇదేం బాదుడురా బాబూ...

Published : Oct 08, 2021, 08:05 PM ISTUpdated : Oct 08, 2021, 08:16 PM IST

ఐపీఎల్ 2021 సీజన్ ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే, ముంబై ఇండియన్స్ ముందు భారీ టార్గెట్ ఉంది. ఆఖరి లీగ్‌ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 170+ పరుగుల తేడాతో గెలవాల్సి ఉంటుంది. ఎవ్వరైనా మరీ ఇంత తేడాతో గెలవాలంటే అసాధ్యమనే అనుకున్నారు. అయితే టాస్ గెలిచి, బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ చూస్తే... ఏదైనా సాధ్యమనే అనిపిస్తోంది...

PREV
17
IPL2021 MI vs SRH: మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందా ఏంది? ముంబై ఇండియన్స్ ఇదేం బాదుడురా బాబూ...

ఇన్నింగ్స్‌లో తాను ఎదుర్కొన్న మొదటి బంతికే సిక్సర్ బాదిన ఇషాన్ కిషన్... ఆ తర్వాత సిద్ధార్థ్ కౌల్ వేసిన రెండో ఓవర్‌లో వరుసగా నాలుగు ఫోర్లు బాది ఏకంగా 18 పరుగులు రాబట్టాడు...

27

మూడో ఓవర్‌లో రోహిత్ శర్మ ఓ ఫోర్ బాదగా, ఇషాన్ కిషన్ రెండు ఫోర్లు బాది... 15 పరుగులు రాబట్టారు. ఆ తర్వాత జాసన్ హోల్డర్ వేసిన నాలుగో ఓవర్‌లో ఏకంగా 22 పరుగులు రాబట్టారు ముంబై బ్యాట్స్‌మెన్...

37

16 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో హాఫ్ సెంచరీ మార్కు అందుకున్న ఇషాన్ కిషన్... 2021 సీజన్‌లో ఫాస్టెస్ట్ అర్ధశతకం బాదిన ప్లేయర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు...

47

ఐపీఎల్‌ చరిత్రలో మూడో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేసిన ప్లేయర్‌గా నిలిచాడు ఇషాన్ కిషన్. ఇంతకుముందు కెఎల్ రాహుల్ 14 బంతుల్లో, యూసఫ్ పఠాన్,సునీల్ నరైన్ 15 బంతుల్లో హాఫ్ సెంచరీ బాదారు. సురేష్ రైనాతో పాటు మూడో స్థానంలో నిలిచాడు ఇషాన్ కిషన్...

57

ఐదు ఓవర్లు ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 78 పరుగులు చేసింది ముంబై ఇండియన్స్. రన్‌రేట్ 15కి పైనే. ఇలాగే కొనసాగితే 20 ఓవర్లు ముగిసే సమయానికి 250+ కొట్టడం పెద్ద కష్టమేమీ కాదు...

67

అయితే ఆరో ఓవర్‌లో బౌలింగ్‌కి వచ్చిన రషీద్ ఖాన్, సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి కావాల్సిన బ్రేక్ అందించాడు. 13 బంతుల్లో 3 ఫోర్లతో 18 పరుగులు చేసిన రోహిత్ శర్మ, భారీ షాట్‌కి ప్రయత్నించి నబీకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు...

77

6 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టానికి 83 పరుగులు చేసిన ముంబై ఇండియన్స్. కీలక మ్యాచ్‌లో ఈ రేంజ్‌లో ముంబై బ్యాట్స్‌మెన్ విరుచుకుపడుతుండడంతో కేకేఆర్ టీమ్ గుండెల్లో రైళ్లు పరుగెడుతుండవచ్చు..

click me!

Recommended Stories