IPL2021 RRvsPBKS: ఐదు వికెట్లతో మెరిసిన అర్ష్‌దీప్ సింగ్... అయినా పంజాబ్ ముందు భారీ టార్గెట్...

Published : Sep 21, 2021, 09:33 PM IST

IPL2021 RRvsPBKS: ఐపీఎల్ 2021 సీజన్ ఫస్టాఫ్‌లో జరిగినట్టే రాజస్థాన్, పంజాబ్ మధ్య మ్యాచ్ క్రికెట్ ఫ్యాన్స్‌కి ఫుల్లు మజాని అందిస్తోంది.  రాజస్థాన్ రాయల్స్ బ్యాట్స్‌మెన్ బ్యాటింగ్‌లో రాణించి నిర్ణీత 20 ఓవర్లలో 26 బౌండరీలతో 185 పరుగులు చేయగా... పంజాబ్ బౌలర్లు బంతితో రాణించి, 10 వికెట్లు తీశారు...

PREV
19
IPL2021 RRvsPBKS: ఐదు వికెట్లతో మెరిసిన అర్ష్‌దీప్ సింగ్... అయినా పంజాబ్ ముందు భారీ టార్గెట్...

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్‌కి శుభారంభం అందించారు ఓపెనర్లు. తొలి వికెట్‌కి 54 పరుగులు జోడించిన తర్వాత ఇవిన్ లూయిస్ అవుట్ అయ్యాడు...

29

21 బంతుల్లో 7 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 36 పరుగులు చేసిన లూయిస్, అర్ష్‌దీప్ బౌలింగ్‌లో మయాంక్ అగర్వాల్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యడు...

39

ఆ తర్వాత కొద్దిసేపటికే 5 బంతుల్లో 4 పరుగులు చేసిన సంజూ శాంసన్, ఇషాన్ పోరెల్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు... 68 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది రాజస్థాన్...

49

17 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 25 పరుగులు చేసిన లియామ్ లివింగ్‌స్టోన్, అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్‌లో ఫ్యాబియన్ ఆలెన్ పట్టిన కళ్లు చెదిరే క్యాచ్‌తో పెవిలియన్ చేరాడు...

59

ఆ తర్వాత 36 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 49 పరుగులు చేసిన యశస్వి జైస్వాల్, హాఫ్ సెంచరీకి 1 పరుగు ముందు అవుట్ అయ్యాడు. హర్‌ప్రీత్ బ్రార్ బౌలింగ్‌లో మయాంక్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు జైస్వాల్..

69

5 బంతుల్లో 4 పరుగులు చేసిన రియాన్ పరాగ్, మహ్మద్ షమీ బౌలింగ్‌లో భారీ షాట్‌కి ప్రయత్నించి అవుట్ అయ్యాడు...

79

17 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 43 పరుగులు చేసిన మహిపాల్ లోమ్రోర్, అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు...

89
Yashasvi Jaiswal-Photo Credit BCCI

ఆ తర్వాతి ఓవర్‌లో మొదటి బంతికే రాహుల్ తెవాటియాను క్లీన్‌బౌల్డ్ చేసిన మహ్మద్ షమీ.. అదే ఓవర్‌లో క్రిస్ మోరిస్‌ను అవుట్ చేశాడు...

99

చేతన్ సకారియా 7 పరుగులు చేసి అవుట్ కాగా... ఆఖరి బంతికి కార్తీక్ త్యాగిని బౌల్డ్ చేసి ఐదు వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు అర్ష్‌దీప్ సింగ్... 

click me!

Recommended Stories