మాతో ఆడకపోతే, మిమ్మల్ని క్రికెట్ ఆడనివ్వం... న్యూజిలాండ్, ఇంగ్లాండ్ జట్లకి బెదిరింపు మెయిల్స్...

First Published Sep 21, 2021, 8:06 PM IST

ఇన్ని ఏళ్లు గడుస్తున్నా పాకిస్తాన్ ప్రజల్లో ఏం మార్పు రానట్టే ఉంది. ఏదైనా నష్టం జరిగితే, నింద పడితే... అది కరెక్ట్ కాదని నిరూపించుకోవాల్సిన దారుల గురించి ఆలోచించకుండా... ఆ నిందను నిజం చేయాలని చూస్తున్నారు కొందరు పాక్ జనాలు... క్రికెట్ ప్రపంచంలో ఓ సంఘటన, ఇప్పుడు పాక్‌పై విమర్శలు రావడానికి కారణమైంది..

పాకిస్తాన్‌కి వరుసగా రెండు ఎదురుదెబ్బలు తగిలాయి. వన్డే సిరీస్ ఆరంభానికి కొన్ని నిమిషాల ముందు భద్రతా కారణాలతో పాకిస్తాన్‌ పర్యటనను రద్దు చేసుకుని, విమానమెక్కి స్వదేశానికి వెళ్లిపోయింది న్యూజిలాండ్ జట్టు... 

18 ఏళ్ల తర్వాత పాక్‌కి వెళ్లి, చూసిన వాళ్లే భయపడితే... తాము ఎలా రాగలమంటూ పాక్ టూర్‌ను రద్దు చేసుకుంటున్నట్టు ప్రకటించింది ఇంగ్లాండ్ జట్టు...

వచ్చే నెల పాకిస్తాన్‌లో పర్యటించాల్సిన ఇంగ్లాండ్ పురుషుల, మహిళల జట్లు... తమ పర్యటనను రద్దు చేసుకుంటున్నట్టు ప్రకటించింది ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు... ఎన్నో ఏళ్ల తర్వాత ఇప్పుడిప్పుడే క్రికెట్ టోర్నీలు నిర్వహిస్తున్న పాకిస్తాన్‌కి ఈ సంఘటన ఊహించని షాక్‌కి గురి చేసింది...

పాకిస్తాన్‌కి సెక్యూరిటీ అధికారులను పంపి, తనిఖీ చేసి... క్వారంటైన్ పూర్తిచేసుకుని, ప్రాక్టీస్ చేసిన తర్వాత అర్ధాంతరంగా భయాందోళనలకు ఎందుకు కలిగాయో, ఆ సెక్యూరిటీ రీజెన్స్ ఏంటో చెప్పాలంటూ న్యూజిలాండ్‌ను కోరింది పాకిస్తాన్...

అయితే తమకు ఎక్కడి నుంచి ఆ సమాచారం వచ్చిందో చెప్పలేమని, వారి గోపత్య తమ బాధ్యత అంటూ కామెంట్ చేసింది న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు... ఈ వరుస సంఘటనలు పాక్ జనాలకు న్యూజిలాండ్, ఇంగ్లాండ్ జట్లపై కోపాన్ని పెంచాయి...

ప్రస్తుతం న్యూజిలాండ్ మహిళా జట్టు, ఇంగ్లాండ్‌లో పర్యటిస్తోంది. అయితే న్యూజిలాండ్ జట్టుపై దాడులు చేస్తామంటూ ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డుకి బెదిరింపు మెయిల్స్ వచ్చినట్టు తెలిసింది...

‘న్యూజిలాండ్ క్రికెటర్ల గురించి ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ)కి బెదిరింపు మెయిల్స వచ్చాయి. అయితే భద్రతా కారణాల దృష్ట్యా అందులో ఏముందో చెప్పలేం... న్యూజిలాండ్ జట్టుకి సెక్యూరిటీ పెంచాం, మరిన్ని రక్షణా చర్యలు తీసుకుంటున్నాం...’ అంటూ తెలిపారు ఈసీబీ అధికారులు...

ఈ బెదిరింపు మెయిల్స్, పాకిస్తాన్ క్రికెట్‌పై మరింత ప్రభావం చేసే అవకాశం ఉందని అనుమానిస్తున్నారు క్రికెట్ విశ్లేషకులు... ఇలాంటి పనుల వల్లే టూర్ ఆరంభానికి ముందు న్యూజిలాండ్ టీమ్ ఆడకుండా వెళ్లిపోయిందని హెచ్చరిస్తున్నారు..

click me!