Published : Sep 21, 2021, 07:08 PM ISTUpdated : Sep 21, 2021, 07:30 PM IST
ఐపీఎల్ 2021 ఫేజ్ 2లో భాగంగా నేడు రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది... పాయింట్ల పట్టికలో ఆరు, ఏడు స్థానాల్లో ఉన్న జట్ల మధ్య జరుగుతున్న ఈ మ్యాచ్ ఇరుజట్లకీ కీలకం కానుంది...
ఇషాన్ పోరెల్, అయిడెన్ మార్క్‌రమ్, అదిల్ రషీద్ పంజాబ్ కింగ్స్ తరుపున ఆరంగ్రేటం చేస్తున్నారు... రాజస్థాన్ రాయల్స్ తరుపున ఇవిన్ లూయిస్ ఆరంగ్రేటం చేస్తున్నాడు...
29
ఇరు జట్ల మధ్య సీజన్‌లో జరిగిన మొదటి మ్యాచ్ ఆఖరి ఓవర్ ఆఖరి బంతి వరకూ ఉత్కంఠభరితంగా సాగి, క్రికెట్ ఫ్యాన్స్‌కి కావాల్సినంత మజాని అందించింది...
39
తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్, కెఎల్ రాహుల్ 91, క్రిస్‌గేల్ 40, దీపక్ హుడా 64 ఇన్నింగ్స్‌ల కారణంగా 221 పరుగుల భారీ స్కోరు చేసింది...
49
222 పరుగుల టార్గెట్‌తో బరిలో దిగిన రాజస్థాన్ రాయల్స్... కెప్టెన్ సంజూ శాంసన్ సంచలన ఇన్నింగ్స్ కారణంగా 217 పరుగులకి పరిమితమైంది...
59
ఆఖరి రెండు బంతులకు విజయానికి సిక్సర్ కావాల్సిన దశలో సంజూ శాంసన్, క్రిస్ మోరిస్‌కి స్ట్రైయిక్ ఇవ్వడానికి ఇష్టపడకపోవడానికి హాట్ టాపిక్ అయ్యింది...
69
కెప్టెన్‌గా ఆడిన తొలి మ్యాచ్‌లోనే 63 బంతులలో 12 ఫోర్లు, 7 సిక్సర్లతో 119 పరుగులు చేసిన సంజూ శాంసన్, ఆఖరి బంతికి సిక్సర్‌కి ప్రయత్నించి అవుట్ అయ్యాడు...
79
రాజస్తాన్ ఏడు మ్యాచుల్లో 3 విజయాలతో పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉంటే, 8 మ్యాచుల్లో మూడింట్లో గెలిచి ఏడో స్థానంలో ఉంది పంజాబ్... ఈ రెండు జట్లకీ ఈ మ్యాచ్ విజయం కీలకం కానుంది...