IPL2021 MI vs SRH: టాస్ గెలిచిన రోహిత్ శర్మ... మనీశ్ పాండేకి సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్సీ...

First Published Oct 8, 2021, 7:11 PM IST

IPL 2021 ప్లేఆఫ్ రేసులో ఉండాలంటే తప్పక గెలవాల్సిన టాస్ గెలిచాడు రోహిత్ శర్మ. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన రోహిత్ శర్మ, బ్యాటింగ్ ఎంచుకున్నాడు... 

ఐపీఎల్ 2020 సీజన్‌లోలాగే ఐపీఎల్ 2021లోనూ లీగ్ ఆఖరి మ్యాచ్ వరకూ ప్లేఆఫ్ బెర్తులపై సస్పెన్స్ కొనసాగింది. అయితే ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్ రేసులో ఉన్నా, అది కేవలం నామమాత్రమే...

ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్స్ చేరాలంటే మొదటి బ్యాటింగ్ చేసి 203+ పరుగుల భారీ స్కోరు చేయాల్సి ఉంటుంది. అలాగే సన్‌రైజర్స్‌పై 170+ పరుగుల భారీ తేడాతో గెలవాల్సి ఉంటుంది. 

ఇది అసాధ్యమే అయినా ముంబైపై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి... ఐపీఎల్‌లో అనితరసాధ్యమైన విజయాలు అందుకోవడంలో ముంబై ఇండియన్స్ తర్వాతే ఏ జట్టైనా..

13 మ్యాచుల్లో 6 విజయాలు అందుకున్న ముంబై ఇండియన్స్, నేటి మ్యాచ్ గెలిస్తే ఐదో స్థానంతో సీజన్‌ను ముగించే అవకాశం ఉంది. లేదంటే పంజాబ్ కింగ్స్ కంటే నెట్‌ రన్ రేట్ తక్కువగా ఉండడంతో ఆరో స్థానంతోనే సరిపెట్టుకోవాల్సి ఉంటుంది...

ఐపీఎల్ కెరీర్‌లో 2009లో ఏడో స్థానానికి పరిమితమైంది ముంబై ఇండియన్స్. ఐపీఎల్‌లో ముంబై జట్టుకి ఇదే దారుణమైన ప్రదర్శన. ఆ తర్వాత 2016, 2018 సీజన్లలో ఐదో స్థానంతో సరిపెట్టుకుంది...

ఈ మ్యాచ్‌లో ఓడితే 2009 తర్వాత దారుణమైన పర్ఫామెన్స్ ఇచ్చినట్టు అవుతుంది. టీమిండియా టీ20 కెప్టెన్సీ ఆశిస్తున్న రోహిత్ శర్మకు ఇది ఊహించని షాక్ అవుతుంది..

మరోవైపు ఇప్పటికే 13 మ్యాచుల్లో మూడంటే మూడు విజయాలు అందుకున్న సన్‌రైజర్స్ నేటి మ్యాచ్ గెలిచినా ఆఖరి స్థానంతోనే సీజన్‌ని ముగిస్తారు. అయితే వరుసగా రెండు విజయాలు అందుకుని, పరువు కాపాడుకున్నట్టు అవుతుంది...

సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ కెప్టెన్ డేవిడ్ వార్నర్‌కి ఇది ఫేర్‌వెల్ మ్యాచ్ అని ప్రచారం జరుగుతోంది. ఆరెంజ్ ఆర్మీకి ఎన్నో విజయాలు అందించిన వార్నర్ భాయ్‌ని, వచ్చే ఏడాది వేలానికి విడిచిపెడతారని అంచనా వేస్తున్నారు క్రికెట్ ఫ్యాన్స్...
గాయపడిన కేన్ విలియంసన్‌ స్థానంలో మనీశ్ పాండే కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు: జాసన్ రాయ్, అభిషేక్ శర్మ, మనీశ్ పాండే, ప్రియమ్ గార్గ్, అబ్దుల్ సమద్, వృద్ధిమాన్ సాహా, జాసన్ హోల్డర్, రషీద్ ఖాన్, మహ్మద్ నబీ, ఉమ్రాన్ మాలిక్, సిద్ధార్ కౌల్

ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, హార్ధిక్ పాండ్యా, కిరన్ పోలార్డ్, కృనాల్ పాండ్యా, జేమ్స్ నీశమ్, నాథన్ కౌంటర్‌నైల్, పియూష్ చావ్లా, జస్ప్రిత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్,

click me!