IPL 2021: సంజూ శాంసన్ మళ్లీ అదే తప్పు... భారీ ఫైన్‌, ఇంకోసారి రిపీట్ అయితే నిషేధం...

First Published Sep 26, 2021, 8:11 PM IST

ఐపీఎల్ 2021 సీజన్‌లో కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్న సంజూ శాంసన్, రాజస్థాన్ రాయల్స్‌ తరుపున అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా టాప్‌లో నిలిచాడు... పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆఖరి ఓవర్‌కి ఉత్కంఠ విజయం అందుకున్న రాజస్థాన్, ఆ తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 33 పరుగుల తేడాతో ఓడింది...

ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్ రేటు కారణంగా రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్‌కి రూ.24 లక్షల భారీ జరిమానా విధించింది ఐపీఎల్ యాజమాన్యం...

వరుసగా రెండో మ్యాచ్‌లో స్లో ఓవర్ రేటును కొనసాగించిన కెప్టెన్ సంజూ శాంసన్‌‌కి రూ.24 లక్షల ఫైన్‌తో పాటు రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్లందరికీ తలా రూ.6 లక్షల జరిమానా విధించారు ఐపీఎల్ నిర్వాహకులు...

క్రికెట్ ఫ్యాన్స్‌కి ఫుల్లు కిక్ అందించిన రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన భారీ స్కోరింగ్ మ్యాచ్‌లో భారత యంగ్ బౌలర్ కార్తీక్ త్యాగి మ్యాజిక్ స్పెల్ కారణంగా ఆఖరి ఓవర్‌లో 4 పరుగులను కాపాడుకుని 2 పరుగుల తేడాతో ఉత్కంఠ విజయం అందుకుంది రాజస్థాన్ రాయల్స్...

అయితే ఈ మ్యాచ్ చూసిన వారెవ్వరైనా పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్ చాలా నెమ్మదిగా సాగినట్టు అర్థమవుతుంది. మ్యాచ్ ముగిసేసమయానికి దాదాపు 12 కావచ్చొంది. దీంతో స్లో ఓవర్ రేటు కారణంగా రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్‌కి రూ.12 లక్షల జరిమానా విధించింది ఐపీఎల్ యాజమాన్యం...

ఇప్పటికే రెండు సార్లు స్లో ఓవర్ రేటు కారణంగా జరిమానా కట్టిన సంజూ శాంసన్, మరో మ్యాచ్‌లో ఇదే తప్పిదాన్ని కొనసాగిస్తే... అతనిపై ఒక మ్యాచ్ నిషేధం పడే అవకాశం కూడా ఉంటుంది...

పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో ఉన్న రాజస్థాన్ రాయల్స్, తమ తర్వాతి మ్యాచ్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఆడనుంది. ఇప్పటికే ప్లేఆఫ్ రేసు నుంచి తప్పుకున్న సన్‌రైజర్స్, పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో ఉంది...

9 మ్యాచుల్లో ఒకే ఒక్క విజయం సాధించిన సన్‌రైజర్స్ హైదరాబాద్, కనీసం పరువు నిలుపుకోవాలనే ఉద్దేశంతో మిగిలిన మ్యాచుల్లోనైనా గెలవాలని కోరుకుంటున్నారు ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్...

click me!