IPL 2021: స్టార్లు ఎందరున్నా, ‘కింగ్’ ఒక్కడే... విరాట్ కోహ్లీ ఖాతాలో మరో రికార్డు...

Published : Sep 26, 2021, 08:33 PM IST

క్రికెట్‌లో స్టార్ ప్లేయర్లు, భారీ హిట్టర్లు, మ్యాచ్ విన్నర్లు ఎందరైనా వచ్చి ఉండొచ్చు, కానీ క్రికెట్ సామ్రాజ్యానికి అసలు సిసలైన ‘కింగ్’ మాత్రం ఒక్కడే ఉంటాడు... అతనే భారత సారథి విరాట్ కోహ్లీ. తన రికార్డుల పుస్తకంలో మరో రికార్డును లిఖించుకున్నాడు విరాట్ కోహ్లీ...

PREV
16
IPL 2021: స్టార్లు ఎందరున్నా, ‘కింగ్’ ఒక్కడే... విరాట్ కోహ్లీ ఖాతాలో మరో రికార్డు...

ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌ ద్వారా టీ20 క్రికెట్‌లో 10 వేల పరుగులు పూర్తిచేసుకున్నాడు విరాట్ కోహ్లీ... ఈ ఘనత సాధించిన మొట్టమొదటి భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ...

26

ఓవరాల్‌గా క్రిస్ గేల్ 14275, కిరన్ పోలార్డ్ 11195, షోయబ్ మాలిక్ 10808 పరుగులతో టాప్ 3లో ఉండగా... విరాట్ కోహ్లీ టాప్ 4లోకి ఎంట్రీ ఇచ్చాడు. డేవిడ్ వార్నర్ 10019 పరుగులతో టాప్ 5లో ఉన్నాడు...

36

టీమిండియా తరుపున టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా ఉన్న విరాట్ కోహ్లీ, అంతర్జాతీయ క్రికెట్‌లో టీ20 ఫార్మాట్‌లోనూ అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా ఉన్నాడు...

46

ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్ కూడా విరాట్ కోహ్లీయే... అంతేకాదు ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 10 వేల పరుగులు, లిస్టు ఏలో 10 వేల పరుగులు, టీ20ల్లో 10 వేల పరుగులు పూర్తిచేసుకున్న మొట్టమొదటి భారత క్రికెటర్ విరాట్ కోహ్లీయే...

56

టీమిండియా తరుపున టెస్టుల్లో 10 వేల పరుగులు అందుకున్న మొట్టమొదటి క్రికెటర్ సునీల్ గవాస్కర్ కాగా, వన్డేల్లో సచిన్ టెండూల్కర్ ఆ ఫీట్ సాధించారు... టీ20ల్లో ఆ ఫీట్ విరాట్ కోహ్లీ ఖాతాలో చేరింది...

66

విరాట్ కోహ్లీ టీ20ల్లో 10+ పరుగులు చేస్తే, రోహిత్ శర్మ 9348 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు. సురేష్ రైనా 8649 టీ20 పరుగులతో, శిఖర్ ధావన్ 8618 పరుగులతో టాప్ 4లో ఉన్నారు...

click me!

Recommended Stories