IPL2021 KKR vs DC: టాస్ గెలిచిన కోల్‌కత్తా నైట్‌రైడర్స్... ఆండ్రే రస్సెల్ స్థానంలో టిమ్ సౌథీ..

IPL2021 DC vs KKR: ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన కోల్‌కత్తా నైట్‌రైడర్స్, ఫీల్డింగ్ ఎంచుకుంది. ఢిల్లీ తొలుత బ్యాటింగ్ చేయనుంది...ఇప్పటికే ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ప్లేఆఫ్స్‌కి క్వాలిఫై కాగా, కేకేఆర్‌కి ఈ మ్యాచ్ అత్యంత కీలకం కానుంది...

ఐపీఎల్ 2021 సీజన్‌లో ఇప్పటికే 10 మ్యాచుల్లో 8 విజయాలు అందుకున్న ఢిల్లీ క్యాపిటల్స్... పాయింట్ల పట్టికలో టాప్ 2లో ఉంది. మరోవైపు కేకేఆర్ 10 మ్యాచుల్లో 4 విజయాలు మాత్రమే అందుకుంది...

ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌కి ఈ మ్యాచ్ ఫలితం కీలకం కానుంది. మిగిలిన నాలుగు మ్యాచుల్లో నాలుగు విజయాలు అందుకుంటేనే ప్లేఆఫ్ రేసులో అవకాశం ఉంటుంది...


గత మ్యాచ్‌లో గాయపడిన ఆండ్రే రస్సెల్ స్థానంలో టిమ్ సౌథీ జట్టులోకి వచ్చాడు. జడ్డూకి 22 పరుగులు సమర్పించి, కేకేఆర్ పరాజయానికి కారణమైన ప్రసిద్ధ్ కృష్ణ స్థానంలో సందీప్ వారియర్‌కి చోటు దక్కింది...

ఢిల్లీ క్యాపిటల్స్: శిఖర్ ధావన్, స్టీవ్ స్మిత్, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్, హెట్మయర్, లలిత్ యాదవ్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, కగిసో రబాడా, నోకియా, ఆవేశ్ ఖాన్

కోల్‌కత్తా నైట్‌రైడర్స్: శుబ్‌మన్ గిల్, వెంకటేశ్ అయ్యర్, రాహుల్ త్రిపాఠి, ఇయాన్ మోర్గాన్, నితీశ్ రాణా, దినేశ్ కార్తీక్, సునీల్ నరైన్, లూకీ ఫర్గూసన్, టిమ్ సౌథీ, వరుణ్ చక్రవర్తి, సందీప్ వారియర్

Latest Videos

click me!