IPL2021 DC vs RR: మెరిసిన శ్రేయాస్ అయ్యర్... రాజస్థాన్ రాయల్స్ ముందు...

First Published Sep 25, 2021, 5:25 PM IST

ఐపీఎల్ 2021 సీజన్ ఫేజ్ 2లో భాగంగా రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్, నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 154 పరుగులు చేసింది... గాయం నుంచి కోలుకుని కమ్‌బ్యాక్ ఇచ్చిన శ్రేయాస్ అయ్యర్, వరుసగా రెండో ఇన్నింగ్స్‌లో 40+ స్కోరు చేసి ఆకట్టుకున్నాడు...

Sanju-Rishabh Pant

రాజస్థాన్ రాయల్స్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో నెమ్మదిగా ఇన్నింగ్స్ ఆరంభించింది ఢిల్లీ క్యాపిటల్స్. 8 బంతుల్లో ఓ ఫోర్‌తో 8 పరుగులు చేసిన శిఖర్ ధావన్, కార్తీక్ త్యాగి బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. 

ఆ తర్వాత కొద్దిసేపటికే 12 బంతుల్లో 10 పరుగులు చేసిన పృథ్వీషా కూడా చేతన్ సకారియా బౌలింగ్‌లో భారీ షాట్‌కి ప్రయత్నించి పెవిలియన్ చేరాడు...

ఆ తర్వాత రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్ కలిసి మూడో వికెట్‌కి 62 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 24 బంతుల్లో 2 ఫోర్లతో 24 పరుగులు చేసిన రిషబ్ పంత్, ముస్తాఫిజుర్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. 

32 బంతుల్లో ఓ ఫోర్, 2 సిక్సర్లతో 43 పరుగులు చేసిన శ్రేయాస్ అయ్యర్, రాహుల్ తెవాటియా బౌలింగ్‌లో స్టంపౌట్‌గా పెవిలియన్ చేరాడు...

ఐపీఎల్‌లో 2019 సీజన్‌లో రవీంద్ర జడేజా బౌలింగ్‌లో, 2020లో రాహుల్ చాహార్ బౌలింగ్‌లో స్టంపౌట్ అయిన శ్రేయాస్ అయ్యర్, ఈ సీజన్‌లో తెవాటియా బౌలింగ్‌లో ఇదే విధంగా అవుటై... హ్యాట్రిక్ నమోదుచేశాడు...

కార్తీక్ త్యాగి వేసిన 16వ ఓవర్‌లో మూడు ఫోర్లతో జోరు మీదున్న హెట్మయర్, ఆ తర్వాత ముస్తాఫిజుర్ ఓవర్‌లో అవుట్ అయ్యాడు... 16 బంతుల్లో 5 ఫోర్లతో 28 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు హెట్మయర్...

7 బంతుల్లో ఓ సిక్సర్‌తో 12 పరుగులు చేసిన అక్షర్ పటేల్, చేతన్ సకారియా బౌలింగ్‌లో అవుట్ కాగా... లలిత్ యాదవ్ 15 బంతుల్లో ఓ ఫోర్‌తో 14 పరుగులు, అశ్విన్ 6 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు.

click me!