IPL2021 CSK vs DC: అదరగొట్టిన అంబటి రాయుడు... ఢిల్లీ క్యాపిటల్స్ ముందు ఊరించే టార్గెట్...

First Published Oct 4, 2021, 9:08 PM IST

ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లు, చెన్నై సూపర్ కింగ్స్ టాపార్డర్‌ను పెవిలియన్‌‌కి పంపించి అదరగొట్టినా... తెలుగు క్రికెటర్ అంబటి రాయుడి సూపర్బ్ షో కారణంగా మంచి స్కోరు చేయగలిగింది సీఎస్‌కే... టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్, నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 136 పరుగులు చేసింది... 

నోకియా వేసిన మొదటి ఓవర్‌ మూడో బంతికే రుతురాజ్ గైక్వాడ్‌ను ఎల్బీడబ్ల్యూ అవుట్‌గా ప్రకటించాడు అంపైర్. అయితే రివ్యూ తీసుకున్న రుతురాజ్‌కి అనుకూలంగా ఫలితం దక్కింది. అయితే మూడో ఓవర్‌లోనే బౌలింగ్‌కి వచ్చిన స్పిన్నర్ అక్షర్ పటేల్, డుప్లిసిస్‌ని అవుట్ చేశాడు...

8 బంతుల్లో 2 ఫోర్లతో 10 పరుగులు చేసిన డుప్లిసిస్, అక్షర్ పటేల్ బౌలింగ్‌లో శ్రేయాస్ అయ్యర్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత రుతురాజ్ గైక్వాడ్ 13 బంతుల్లో 2 ఫోర్లతో 13 పరుగులు చేసి నోకియా బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. 

ఐపీఎల్ 2021 సీజన్‌లో సీఎస్‌కే ఓపెనర్లు ఇద్దరూ స్వల్ప స్కోరుకే అవుట్ కావడం ఇది రెండోసారి. ఇంతకుముందు ఫస్టాఫ్‌లో ఢిల్లీ క్యాపిటిల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రుతురాజ్ 5 పరుగులు చేయగా, డుప్లిసిస్ డకౌట్ అయ్యాడు...

ఆ తర్వాత మొయిన్ ఆలీ 8 బంతుల్లో 5 పరుగులు చేసి అక్షర్ పటేల్ బౌలింగ్‌లో అయ్యర్‌కే క్యాచ్ ఇచ్చి అవుట్ కాగా 19 బంతుల్లో ఓ ఫోర్‌తో 19 పరుగులు చేసిన రాబిన్ ఊతప్ప‌ను రవిచంద్రన్ అశ్విన్ పెవిలియన్ చేర్చాడు...

62 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన చెన్నై సూపర్ కింగ్స్‌ను అంబటి రాయుడు, మహేంద్ర సింగ్ ధోనీ కలిసి ఆదుకున్నారు. ఈ ఇద్దరూ ఐదో వికెట్‌కి 70 పరుగులు జోడించారు.

మహేంద్ర సింగ్ ధోనీ 27 బంతుల్లో 18 పరుగులు చేసిన ఎమ్మెస్ ధోనీ, తన ఇన్నింగ్స్‌లో ఒక్క ఫోర్, ఒక్క సిక్సర్ కూడా లేకుండానే ఆవేశ్ ఖాన్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు...

అంబటి రాయుడు 43 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 55 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు... ఐపీఎల్ కెరీర్‌లో అంబటి రాయుడికి ఇది 20వ హాఫ్ సెంచరీ...

click me!