ఇండియా, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ అంటే ఈ మాత్రం క్రేజ్ ఉండాల్సిందే... నిమిషాల్లోనే టికెట్లన్నీ...

First Published Oct 4, 2021, 6:43 PM IST

దాయాదులు ఇండియా, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ అంటే జనాల్లో ఎలాంటి క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అది హాకీ అయినా క్రికెట్ అయినా కసిగా మ్యాచ్‌ను చూస్తారు ఇరుదేశాల జనాలు....

పాకిస్తాన్ పరిస్థితి గురించి తెలీదు కానీ, ఇండియాలో మాత్రం పాక్‌తో మ్యాచ్ జరిగిన రోజు జనాల్లో విపరీతమైన దేశభక్తి ఉప్పొంగిపోతుంది...

శత్రుదేశంగా భావించే పాకిస్తాన్‌ను భారత జట్టు చిత్తు చేయాలని ప్రతీ భారతీయుడు కసిగా కోరుకుంటాడు. టీమిండియాలోని ప్లేయర్ల పేరు తెలియనివాళ్లు కూడా, భారత జట్టు గెలుపుని కాంక్షిస్తూ స్టేటస్‌లు పెట్టేస్తారు... ఆ రోజు క్రికెట్ కేవలం ఓ ఆట మాత్రమే కాదు, చాలా మంది ఎమోషన్ కూడా...

భారత్‌లో తీవ్రవాద దాడుల తర్వాత ఇరుదేశాల మధ్య దైపాక్షిక సంబంధాలు దెబ్బతిన్నడంతో ఈ రెండు దేశాల మధ్య మ్యాచుల కోసం ఐసీసీ టోర్నీల దాకా వేచి చూడాల్సి వస్తోంది...

వన్డే వరల్డ్‌కప్ 2019లో చివరిగా తలబడిన ఇండియా, పాకిస్తాన్ జట్లు, టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో తలబడబోతున్నాయి. ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు చాలామంది క్రికెట్ ఫ్యాన్స్...

టీ20 వరల్డ్‌కప్ టోర్నీకి ఆన్‌లైన్ ద్వారా టికెట్ల అమ్మకాలు మొదలెట్టింది ఐసీసీ. అందులో అక్టోబర్ 24న దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో భారత్, పాకిస్తాన్ మధ్య జరిగే మ్యాచ్ టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడైపోయాయి...

బుకింగ్ మొదలెట్టిన నిమిషాల్లోనే ఈ మ్యాచ్‌ టికెట్లన్నీ సేల్ అయిపోయాయి. కరోనా నిబంధనల కారణంగా 70 శాతం కెపాసిటీతో స్టేడియంలోకి అభిమానులను అనుమతించాలని నిర్ణయం తీసుకుంది ఐసీసీ...

ఐసీసీ టోర్నీల్లో టీమిండియాకి పాకిస్తాన్‌పై మంచి రికార్డు ఉంది. వరల్డ్‌కప్ టోర్నీల్లో ఇప్పటిదాకా భారత్‌పై విజయం సాధించలేకపోయింది పాకిస్తాన్...

అయితే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2017లో భారత్‌ను చిత్తు చేసిన పాకిస్తాన్, 2021 టీ20 వరల్డ్‌కప్‌లోనూ ఆ సీన్ రిపీట్ చేస్తామని ధీమా వ్యక్తం చేస్తోంది...

click me!