IPL 2021: మమ్మల్ని తొక్కేస్తున్నారు సార్... ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ పరిస్థితిపై ట్రెండింగ్...

First Published Oct 4, 2021, 7:42 PM IST

ఐపీఎల్‌లో మొత్తం 8 జట్లు ఉన్నా, ఫ్యాన్ ఫాలోయింగ్, క్రేజ్ విషయంలో ఆఖరున ఉంటుంది రాజస్థాన్ రాయల్స్... సోషల్ మీడియాలో ఆర్ఆర్ అడ్మిన్ చేసే ఫన్నీ పోస్టులకు విపరీతమైన ఫాలోయింగ్ వచ్చినా రాజస్థాన్‌కి మాత్రం ఫ్యాన్స్ తక్కువే...

కీలక సమయంలో చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అద్భుత విజయాన్ని అందుకున్న రాజస్థాన్ రాయల్స్, తాము కూడా ప్లేఆఫ్ రేసులో ఉన్నామని ఘనంగా చాటుకున్నారు...
(photo Source- www.iplt20.com)

సీఎస్‌కే విధించిన 190 పరుగుల టార్గెట్‌ను 15 బంతులు మిగిలి ఉండగానే ఊదేసింది రాజస్థాన్ రాయల్స్. యశస్వి జైస్వాల్, శివమ్ దూబే సంచలన ఇన్నింగ్స్‌లతో చెన్నై బౌలర్లను చెడుగుడు ఆడేశారు...

అయితే ఆఖరి బంతికి సెంచరీ చేసిన రుతురాజ్ గైక్వాడ్‌కి దక్కిన ప్రశంసలు, సీఎస్‌కే టాప్ బౌలర్ జోష్ హజల్‌వుడ్ బౌలింగ్‌లో సిక్సర్ల మోత మోగించిన 19 ఏళ్ల కుర్రాడు యశస్వి జైస్వాల్‌కి దక్కలేదనే చెప్పాలి..
(photo Source- www.iplt20.com)

బెన్ స్టోక్స్, జోఫ్రా ఆర్చర్, జోస్ బట్లర్ వంటి ఫారిన్ స్టార్లు జట్టుకి దూరమైనా, లియామ్ లివింగ్‌స్టోన్, గ్లెన్ ఫిలిప్ వంటి బిగ్‌బాష్ హీరోలు పెద్దగా క్లిక్ కాకపోయినా...

రూ.16.25 కోట్లు పెట్టి కొన్ని క్రిస్ మోరిస్ ఫెయిల్ అయినా... దేశవాళీ కుర్రాళ్ల పోరాటంతో విజయాలు అందుకుంటోంది రాజస్థాన్ రాయల్స్...

అయితే క్రికెట్ విశ్లేషకులు కూడా రాజస్థాన్ రాయల్స్‌ను ప్లేఆఫ్ రేసులో పోటీదారుడిగా గుర్తించడం లేదు. కోల్‌కత్తా నైట్‌రైడర్స్, ముంబై ఇండియన్స్ మధ్యే ఫోర్త్ ప్లేస్ కోసం పోటీ ఉంటుందని అంచనా వేస్తున్నారు...

క్రికెట్ విశ్లేషకులు కూడా రాజస్థాన్ రాయల్స్‌ను ప్లేఆఫ్ రేసులో పోటీదారుడిగా గుర్తించడం లేదు. కోల్‌కత్తా నైట్‌రైడర్స్, ముంబై ఇండియన్స్ మధ్యే ఫోర్త్ ప్లేస్ కోసం పోటీ ఉంటుందని అంచనా వేస్తున్నారు...

అందుకేనేమో బాగా హార్ట్ అయిన రాజస్థాన్ రాయల్స్, ఆ జట్టు కెప్టెన్ సంజూ శాంసన్ ఫ్యాన్స్... ‘IPL against RR’ అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ చేస్తున్నారు...

దేశవ్యాప్తంగా ట్రెండ్ అవుతున్న ఈ హ్యాష్‌ట్యాగ్ ఎందుకు ఇంతలా ట్రెండింగ్‌లో నిలిచిందో అర్థం కాక, కాస్త అయోమయానికి గురవుతున్నారు క్రికెట్ ఫ్యాన్స్..

12 మ్యాచుల్లో ఐదు విజయాలు అందుకున్న రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్ కంటే మెరుగైన రన్‌రేట్ కారణంగా పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉంది...

రేపు ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్ ఆడనున్న రాజస్థాన్, ఆ తర్వాత అక్టోబర్ 7న కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌తో మ్యాచ్ ఆడుతుంది... కేకేఆర్‌, పంజాబ్ కింగ్స్‌కి మెరుగైన రన్‌రేట్ ఉన్న కారణంగా రాజస్థాన్ ప్లేఆఫ్స్ చేరాలంటే మిగిలిన రెండు మ్యాచుల్లోనూ తప్పక గెలవాల్సి ఉంటుంది...

click me!