IPL: భారత ప్లేయర్లు వేరే కంట్రీ క్రికెట్ లీగ్స్ ఎందుకు ఆడరు?
Indian Premier League (IPL): ఐపీఎల్ లో చాలా మంది విదేశీ ప్లేయర్లు ఆడతారు. అయితే, భారత ప్లేయర్లు విదేశీ క్రికెట్ లీగ్ లలో ఎందుకు ఆడరు?
Indian Premier League (IPL): ఐపీఎల్ లో చాలా మంది విదేశీ ప్లేయర్లు ఆడతారు. అయితే, భారత ప్లేయర్లు విదేశీ క్రికెట్ లీగ్ లలో ఎందుకు ఆడరు?
Indian Premier League (IPL): ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 సీజన్ మార్చి 22న ఘనంగా ప్రారంభమై మే 25, 2025న ముగుస్తుంది. ఈ సీజన్‌లో 10 జట్లు పాల్గొంటాయి, ప్రతి జట్టు 14 మ్యాచ్‌లు ఆడుతుంది.
ఐపీఎల్ 2025 తొలి మ్యాచ్ మార్చి 22న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో కోల్‌కతా నైట్ రైడర్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు సాయంత్రం 7:30 PM గంటలకు తలపడనున్నాయి. తర్వాతి రోజు మార్చి 23న సన్‌రైజర్స్ హైదరాబాద్ vs రాజస్థాన్ రాయల్స్ లు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం తలపడనున్నాయి. అదే రోజు సాయంత్రం 7:30 PM గంటలకు చెన్నై సూపర్ కింగ్స్ vs ముంబై ఇండియన్స్ మ్యాచ్ జరగనుంది.
ఐపీఎల్ లో చాలా మంది విదేశీ ప్లేయర్లు ఆడతారు. అయితే, విదేశీ క్రికెట్ లీగ్ లలో భారత ప్లేయర్లు ఆడరు. దానికి ప్రధాన కారణం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ). భారత క్రికెటర్లు విదేశీ క్రికెట్ లీగ్ లలో ఆడకపోవడానికి గల కారణాలు, బీసీసీఐ నియమాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఐపీఎల్‌లో ఆడే భారత క్రికెటర్లు విదేశీ లీగ్స్‌లో ఆడలేరు. ఎందుకంటే ఐపీఎల్ ఆడుతున్న భారత ప్లేయర్ల కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కొన్ని రూల్స్ తీసుకువచ్చింది. దీనికి కొన్ని ముఖ్యమైన కారణాలు ఉన్నాయి.
ఐపీఎల్ లాగే వివిధ దేశాలు క్రికెట్ లీగ్ లను నిర్వహిస్తున్నాయి. వాటిలో బిగ్ బాష్ లీగ్ (బీబీఎల్), ది హండ్రెడ్, కరేబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్), ఎస్ఏ 20 వంటి చాలా క్రికెట్ లీగ్స్ ఉన్నాయి. వీటిలో ఐపీఎల్ ఆడుతున్న భారత క్రికెటర్లు ఆడరు. ఎందుకంటే భారత క్రికెటర్లు విదేశీ లీగ్ లలో ఆడితే ఐపీఎల్ ను చూసేవారు తగ్గిపోతారు. దీంతో ఐపీఎల్ బ్రాండ్ వాల్యూ పడిపోతుంది. దీంతో బీసీసీఐ కి నష్టాలు వస్తాయి. ఇలాంటి చాలా కారణాలను దృష్టిలో పెట్టుకుని బీసీసీఐ ఐపీఎల్ ఆడే భారత ప్లేయర్ల కోసం రూల్స్ తీసుకువచ్చింది.
విదేశీ క్రికెట్ లీగ్ లలో భారత ప్లేయర్లు ఆడాలంటే బీసీసీఐ నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అయితే, యాక్టివ్ ఇండియన్ క్రికెటర్లు అంటే అంటే, అంతర్జాతీయ లేదా దేశవాళీ క్రికెట్ ఆడుతున్నవారికి విదేశీ లీగ్ లలో ఆడేందుకు బీసీసీఐ NOC ఇవ్వదు.
అయితే, భారత క్రికెటర్లు ఐపీఎల్, దేశవాళీ క్రికెట్, అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్ అయిన తర్వాత మాత్రమే ఇతర దేశాల క్రికెట్ లీగ్స్‌లో ఆడేందుకు అనుమతి ఉంటుంది. ఉదాహారణకు రోబిన్ ఊతప్ప రిటైర్మెంట్ తర్వాత ILT20లో ఆడారు. సురేశ్ రైనా ఐపీఎల్ నుంచి రిటైర్మెంట్ తీసుకుని అబుధాబి T10 లీగ్‌లో పాల్గొన్నారు. అలాగే, దినేష్ కార్తీక్ గత సీజన్ తర్వాత ఐపీఎల్ కు రిటైర్మెంట్ ప్రకటించి ఎస్ఏ20 లీగ్ లో ఆడాడు.
బీసీసీఐ ఇలా ఇతర లీగ్ లలో భారత ప్లేయర్లను ఆడకుండా రూల్ పెట్టడం వెనుక IPL ప్రత్యేకతను కాపాడే ఉద్దేశం ఉంది. భారత ఆటగాళ్లు ఇతర లీగ్స్‌లో ఆడితే ఐపీఎల్ ప్రత్యేకత తగ్గిపోతుంది. భారత ఆటగాళ్లు కేవలం ఐపీఎల్ లో మాత్రమే ఆడితే ఆర్థికంగా ఐపీఎల్ విలువ పెరుగుతుది. అలాగే, టీమిండియా ప్లేయర్లు ఇప్పటికే బిజీ షెడ్యూల్ గడుపుతున్నారు. కొత్త లీగ్స్‌లో ఆడితే గాయాల ప్రమాదం ఎక్కువ అవుతుంది. అందుకే బీసీసీఐ ఇతర లీగ్ లను ఆడేందుకు భారత ఆటగాళ్లను అనుమతించదు.