ఐపీఎల్ బెస్ట్ ప్లేయర్స్ వీళ్లే! ఆల్ టైమ్ ప్లేయింగ్ XI కెప్టెన్ ఎవరంటే?

IPL 2025: ఐపీఎల్‌లో దుమ్మురేపిన ఆటగాళ్లతో ఐపీఎల్ ఆల్ టైమ్ ప్లేయింగ్ XI టీమ్ రెడీ అయింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

Best IPL All Time Playing XI Captains Dhoni Rohit Virat in telugu rma

ఐపీఎల్ ఆల్ టైమ్ ప్లేయింగ్ XI: ప్రపంచంలోనే బిగ్గెస్ట్ టీ20 లీగ్ ఐపీఎల్ మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది. 2008 నుంచి ఐపీఎల్ విజయవంతంగా కొనసాగుతోంది. ఐపీఎల్‌లో ఆల్ టైమ్ ప్లేయింగ్ XI వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Best IPL All Time Playing XI Captains Dhoni Rohit Virat in telugu rma

1. రోహిత్ శర్మ

ఐపీఎల్‌లో బెస్ట్ కెప్టెన్, విధ్వంసకర ఆటగాడు రోహిత్ శర్మ. 257 మ్యాచ్‌లు ఆడి 2 సెంచరీలతో 6,628 రన్స్ చేశాడు. పవర్ ప్లేలో దుమ్మురేపే రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ టీమ్‌కు కెప్టెన్‌గా 5 కప్పులు గెలిపించాడు. రీసెంట్‌గా ఇండియన్ టీమ్‌కు ఛాంపియన్స్ ట్రోఫీ కూడా గెలిపించాడు. అతని కెప్టెన్సీ, విధ్వంసకర ఆటతో ఆల్ టైమ్ ప్లేయింగ్ XIలో చోటు దక్కించుకున్నాడు.


2. క్రిస్ గేల్

ప్రపంచంలో నంబర్ 1 విధ్వంసకర ఆటగాడు. క్రిస్ గేల్ బ్యాట్ తో దిగితే బాల్ డైరెక్ట్‌గా రూఫ్‌కే వెళ్లడం గ్యారెంటీ. ఈజీగా సిక్సర్లు కొట్టే గేల్, 142 ఐపీఎల్ మ్యాచ్‌లలో 6 సెంచరీలు, 31 హాఫ్ సెంచరీలతో 4,965 రన్స్ చేశాడు. స్ట్రైక్ రేట్ 148 ఉండటమే ఇతని స్పెషల్.

Image Credit: ANI

3. విరాట్ కోహ్లీ

క్రికెట్ కింగ్ విరాట్ కోహ్లీ ఐపీఎల్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఒకే టీమ్‌కు (ఆర్‌సీబీ) ఆడుతున్నాడు. కంటిన్యూగా రన్స్ చేసే విరాట్ కోహ్లీ 252 మ్యాచ్‌లలో 8 సెంచరీలు, 55 హాఫ్ సెంచరీలతో 8,004 రన్స్ చేశాడు. ప్రపంచంలో నంబర్ 1 ఆటగాడు లేకుండా ఆల్ టైమ్ ప్లేయింగ్ XI చేయడం కుదరదు కదా !

ఎం.ఎస్.ధోని-సురేష్ రైనా

4. సురేష్ రైనా

మిస్టర్ ఐపీఎల్ అని పిలవబడే సురేష్ రైనా, సీఎస్‌కేలో ధోని తర్వాత ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నది ఇతనికే. సూపర్ షాట్స్ కొట్టే రైనా సీఎస్‌కే కోసం చాలా మ్యాచ్‌లు గెలిపించాడు.  ఐపీఎల్ లో  205 మ్యాచ్ లను ఆడిన రైనా 5528 పరుగులు చేశాడు. సగటు: 32.51, స్ట్రైక్ రేట్ 136.73గా ఉంది. రైనా తన ఐపీఎల్ కెరీర్ లో ఒక సెంచరీ, 39 హాఫ్ సెంచరీలు సాధించాడు.

5. ఏబీ డివిలియర్స్

మిస్టర్ 360 ఆటగాడు ఏబీ డివిలియర్స్ కు తెలియని క్రికెట్ షాట్ అంటూనే లేదు. లాస్ట్ 5 ఓవర్లలో 100 రన్స్ కావాలన్నా ఇతను క్రీజ్‌లో ఉంటే గెలవడం గ్యారెంటీ. దుమ్మురేపే ఆటతో అనేక గొప్ప ఇన్నింగ్స్ లను ఆడాడు. ఐపీఎల్ లో డివిలియర్స్ 184 మ్యాచ్ లను ఆడి 5162 పరుగులు చేశాడు. అతని వ్యక్తిగత అత్యధిక పరుగులు 133*. 39.70 సగటు, 151.68 స్ట్రైక్ రేటుతో 3 సెంచరీలు, 40 హాఫ్ సెంచరీలు సాధించాడు.

6. ఎం.ఎస్.ధోని (కెప్టెన్, వికెట్ కీపర్)

ఇండియన్ క్రికెట్ హీరో ధోని, సీఎస్‌కేను టాప్‌కు తీసుకెళ్లడంలో చాలా ముఖ్యమైన వ్యక్తి. కూల్ కెప్టెన్ అని పిలవబడే ధోని సైలెంట్‌గా, తెలివిగా టీమ్‌ను లీడ్ చేయడంతో ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయ్యాడు. ఇతని నాయకత్వంలోనే చెన్నై రికార్డు స్థాయిలో 5 సార్లు ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలిచింది. ధోని 264 ఐపీఎల్ మ్యాచ్ లను ఆడి 5243 పరుగులు చేశాడు. 

రవీంద్ర జడేజా

7. రవీంద్ర జడేజా

ప్రపంచంలో బెస్ట్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా బ్యాటింగ్, బౌలింగ్‌లో మాత్రమే కాదు ఫీల్డింగ్‌లో కూడా ప్రత్యర్థి టీమ్ కు చెమటలు పట్టిస్తాడు. 2008లో రాజస్థాన్ టీమ్ కప్ గెలవడానికి ముఖ్య కారణమైన ఇతను ఇప్పటికీ సీఎస్‌కేకు ట్రంప్ కార్డ్. 2023లో లాస్ట్ ఓవర్‌లో 10 రన్స్ కొట్టి సీఎస్‌కేకు కప్ తెచ్చిపెట్టాడు. జడేజా  240 మ్యాచ్ లను ఆడి 2959 పరుగులు చేశాడు. అలాగే, 160 వికెట్లు కూడా సాధించాడు. బెస్ట్ బౌలింగ్ గణాంకాలు 5/16 వికెట్లు.

8. భువనేశ్వర్ కుమార్

ఐపీఎల్‌లో ఎక్స్‌పీరియన్స్ ఉన్న ఆటగాడు భువనేశ్వర్ కుమార్ స్పీడ్ లేకపోయినా తన తెలివితో సూపర్ బాల్స్ వేసి బ్యాటర్లకు టెన్షన్ పెడతాడు. పవర్ ప్లేలో ఇతని స్వింగ్ బౌలింగ్ ఎదుర్కోవడం చాలా కష్టం. భూవీ 176 మ్యాచ్ లను ఆడి 181 వికెట్లు తీసుకున్నాడు. అతని బౌలింగ్ బెస్ట్: 5/19 వికెట్లు. రెండు సార్లు ఐదేసి వికెట్లు తీసుకున్నాడు.

జస్ప్రీత్ బుమ్రా

9. జస్ప్రీత్ బుమ్రా

ప్రపంచంలో నంబర్ 1 బౌలర్ జస్ప్రీత్ బుమ్రా, మ్యాచ్ ఏ స్టేజ్‌లో ఉన్నా సూపర్ బాల్స్ వేసి వికెట్లు తీయడంలో ఎక్స్‌పర్ట్. ఎంత బెస్ట్ బ్యాటర్ అయినా బుమ్రా బౌలింగ్ ఎదుర్కోవడం కష్టం. ముంబై ఇండియన్స్ వెన్నెముక బుమ్రా అంటే తప్పేం కాదు. బుమ్రా తన ఇప్పటివరకు 133 మ్యాచ్ లను ఆడి 165 వికెట్లు తీశాడు. బౌలింగ్ బెస్ట్ 5/10 వికెట్లు కాగా, రెండు సార్లు 5 వికెట్లు తీసుకున్నాడు.

యుజ్వేంద్ర చాహల్

10. యుజ్వేంద్ర చాహల్

ఇండియాలో టాప్ స్పిన్ బౌలర్ యుజ్వేంద్ర చాహల్ తన లెగ్ స్పిన్‌తో ఎదుటి టీమ్‌లను కట్టడి చేయడంలో ఎక్స్‌పర్ట్. దాదాపు 7 సంవత్సరాలు ఆర్‌సీబీకి వెన్నెముకగా ఉన్న చాహల్, చిన్నదైన బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో కూడా ధైర్యంగా బాల్ వేసి వికెట్లు తీశాడు. ఇప్పటివరకు 160 మ్యాచ్ లను ఆడి 205 వికెట్లు తీసుకున్నాడు. 

11. లసిత్ మలింగ 

యార్కర్ కింగ్ లసిత్ మలింగ ఐపీఎల్‌లో మిస్ చేయకూడని ఆటగాడు. తన బెస్ట్ బౌలింగ్‌తో ముంబై ఇండియన్స్ టీమ్ చాలాసార్లు కప్ గెలవడానికి పెద్ద పాత్ర పోషించాడు. డెత్ ఓవర్లలో ఇతని బౌలింగ్ ఎదుర్కోవడం కష్టం. మలింగ 122 మ్యాచ్ లను ఆడి 170 వికెట్లు సాధించాడు. 

Latest Videos

vuukle one pixel image
click me!