IPL 2025: టీ20 క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు.. టాప్ 10 పవర్ హిట్టర్లు వీరే

Published : Mar 25, 2025, 07:38 PM IST

Most Sixes in T20 Cricket: ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్) 2025లో సిక్స‌ర్ల వ‌ర్షం కురుస్తోంది. అయితే, టీ20 క్రికెట్ లో అత్య‌ధిక సిక్స‌ర్లు బాదిన టాప్-10 ప‌వ‌ర్ హిట్ట‌ర్లు ఎవ‌రో తెలుసా?  

PREV
13
IPL 2025: టీ20 క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు.. టాప్ 10 పవర్ హిట్టర్లు వీరే
Image Credit: Twitter/Lucknow Super Giants

IPL, Most Sixes in T20 Cricket: ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్) 2025 4వ మ్యాచ్ లో రిష‌బ్ పంత్ నాయ‌క‌త్వంలోని లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్జీ), అక్ష‌ర్ ప‌టేల్ కెప్టెన్సీలోని ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ) త‌ల‌ప‌డ్డాయి. ఈ మ్యాచ్ లో ఇరు జ‌ట్లు కలిసి 400 ప‌రుగులు కొట్టాయి. రెండు టీమ్స్ లోని కొంద‌రు ప్లేయ‌ర్లు అద‌రిపోయే ఇన్నింగ్స్ ల‌ను ఆడారు. 

23
IPL : Top 10 Power Hitters: Most Sixes in T20 Cricket in telugu rma

ఈ మ్యాచ్‌లో లక్నో స్టార్ బ్యాట‌ర్ నికోలస్ పూరన్ విధ్వంసం సృష్టించాడు. కేవ‌లం 30 బంతుల్లో 75 పరుగులతో ఢిల్లీ బౌలింగ్ ను దంచికొట్టాడు. నికోల‌స్ పురాన్ సునామీ ఇన్నింగ్స్ లో 6 ఫోర్లు, 7 సిక్సర్లు బాదాడు. దీంతో లక్నో టీమ్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 209 పరుగులు చేసింది. అయితే, చివ‌రి వ‌ర‌కు ఉత్కంఠ‌గా సాగిన ఈ మ్యాచ్ లో అశుతోష్ శర్మ 31 బంతుల్లో 66 ప‌రుగుల అజేయ ఇన్నింగ్స్ తో ఢిల్లీ క్యాపిటల్స్ 19.3 ఓవర్లలో 9 వికెట్లకు 211 పరుగులతో మ్యాచ్ ను గెలుచుకుంది. 

ఈ మ్యాచ్ లో ల‌క్నో స్టార్ బ్యాట‌ర్ నికోల‌స్ పురాన్ త‌న బ్యాటింగ్ తో విధ్వంసం సృష్టిస్తూ 7 సిక్స‌ర్లు బాది మ‌రో మైలురాయిని అందుకున్నాడు. టీ20 క్రికెట్‌లో 600 సిక్సర్లు పూర్తి చేసిన నాల్గవ బ్యాట్స్‌మన్ గా నిలిచాడు. టీ20 క్రికెట్ లో 600ల‌కు పైగా సిక్స‌ర్లు బాదిన ప్లేయ‌ర్ల లిస్టులో పురాన్ చేరాడు. 

33
IPL : Top 10 Power Hitters: Most Sixes in T20 Cricket in telugu rma

టీ20 క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన టాప్ 10 ప్లేయ‌ర్ల లిస్టులో వెస్టిండీస్ స్టార్ బ్యాట‌ర్, యూనివ‌ర్స‌ల్ బాస్ క్రిస్ గేల్ 1056 సిక్సర్లతో టాప్ లో ఉన్నాడు. రెండో స్థానంలో వెస్టిండీస్ మాజీ స్టార్ ఆల్ రౌండ‌ర్ కీరన్ పొలార్డ్ 908 సిక్సర్లతో ఉన్నాడు. మూడో స్థానంలో ఉన్న ఆండ్రీ రస్సెల్ 733 సిక్సర్లు బాదాడు. నికోలస్ పూరన్ 606 సిక్సర్లతో 4వ స్థానంలో ఉన్నాడు. ఆ త‌ర్వాత ఇంగ్లాండ్ ప్లేయ‌ర్ అలెక్స్ హేల్స్ 552 సిక్సర్లతో 5వ స్థానంలో ఉన్నాడు. న్యూజిలాండ్ స్టార్ కాలిన్ మున్రో 550 సిక్సర్లు, ఆసీస్ స్టార్ గ్లెన్ మాక్స్‌వెల్ 529 సిక్సర్లతో త‌ర్వాతి స్థానంలో ఉన్నారు. భార‌త కెప్టెన్ రోహిత్ శ‌ర్మ 525 సిక్సర్లతో ఈ జాబితాలో 8వ స్థానంలో ఉన్నాడు. 515 సిక్సర్లతో జోస్ బట్లర్ 9వ స్థానంలో ఉండ‌గా, డేవిడ్ మిల్లర్ 504 సిక్సర్లతో 10 స్థానంలో ఉన్నాడు. 

 

Read more Photos on
click me!

Recommended Stories