GT vs PBKS IPL Gujarat Titans vs Punjab Kings.. A Clash of Contrasts, A mind-blowing show!
Gujarat Titans vs Punjab Kings: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 పండగ మొదలైంది. కేకేఆర్ vs ఆర్సీబీతో గేమ్ తో మొదలైన ఐపీఎల్ లో మరో బిగ్ ఫైట్ జరుగుతోంది. అదే గుజరాత్ టైటాన్స్ vs పంజాబ్ కింగ్స్ పోరు. ఐపీఎల్ 2025 సీజన్‌లో అన్ని జట్లు చాలా మార్పులను చూశాయి. అయితే, గుజరాత్ టైటాన్స్ (GT) కొత్త యాజమాన్యంతో ఒక ప్రత్యేకమైన మార్పును పొందింది. టీమ్ ప్లేయర్లకు పూర్తిగా స్వేచ్ఛను ఇస్తూ తొలి సీజన్ లోనే టైటిల్ గెలవడంతో పాటు రెండో సీజన్ లో ఫైనల్ వరకు వచ్చింది. ఇక ఐపీఎల్ 2025 సీజన్ లో దుమ్మురేపడానికి సిద్ధంగా ఉంది. ఐపీఎల్ 18వ ఎడిషన్ లో తమ తొలి మ్యాచ్ ను పంజాబ్ కింగ్స్ తో తలపడుతోంది.
GT vs PBKS IPL Gujarat Titans vs Punjab Kings.. A Clash of Contrasts, A mind-blowing show!
శుభ్‌మన్ గిల్ నాయకత్వంలోని గుజారత్ టీమ్ చాలా బంలంగా కనిపిస్తోంది. జోస్ బట్లర్, గ్లెన్ ఫిలిప్స్, కగిసో రబాడా, మొహమ్మద్ సిరాజ్ వంటి కొత్త ప్లేయర్లతో పాటు రషీద్ ఖాన్ లాంటి అద్భుతమైన ప్లేయర్ ఈ టీమ్ లో ఉన్నారు. అయితే, ఇప్పుడు అతిపెద్ద ప్రశ్న ఆ జట్టును ఓపెనింగ్ జోడీ ఎవరు? బట్లర్-గిల్‌తోనా, లేదా సాయి సుదర్శన్‌తోనా అనేది ఆసక్తిని పెంచుతోంది.
మరోవైపు పంజాబ్ టీమ్ గత సీజన్ లో కేకేఆర్ ను ఛాంపియన్ గా నిలబెట్టిన శ్రేయాస్ అయ్యర్ తో పాటు కోచ్ రికీ పాంటింగ్ నాయకత్వంలో దుమ్మురేపడానికి సిద్ధంగా ఉంది. బ్యాటింగ్ విషయంలో ఎక్కువగా పంజాబ్ టీమ్ శ్రేయాస్ అయ్యర్ తో పాటు అన్‌క్యాప్డ్ ఆటగాళ్లపై ఎక్కువగా ఆధారపడుతుందని టీమ్ ప్లేయర్లను చూస్తే చెప్పవచ్చు. ఆల్ రౌండర్లు స్టోయినిస్, మాక్స్‌వెల్, జాన్సెన్ లు ఉండగా, బౌలింగ్ అటాక్ లో అర్ష్‌దీప్, ఫెర్గూసన్, చాహల్ లతో బలంగానే కనిస్తోంది.
GT vs PBKS IPL Gujarat Titans vs Punjab Kings.. A Clash of Contrasts, A mind-blowing show!
ఇరు జట్లలో ప్రభావం చూపే అంశాలు ఏంటి?
గుజరాత్ టైటాన్స్: స్థిరత్వాన్ని కొనసాగించడం, అలాగే, వారి బలమైన బ్యాటింగ్ లైనప్‌ను సద్వినియోగం చేసుకుని బిగ్ స్కోర్లు సాధించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఆ జట్టులో కీలక ఆటగాళ్లలో శుభ్‌మన్ గిల్, జోస్ బట్లర్, మొహమ్మద్ సిరాజ్, రషీద్ ఖాన్ లు ఉన్నారు. గత మూడు ఐపీఎల్ సీజన్లలో విజయ శాతం అధికంగానే ఉంది.
పంజాబ్ కింగ్స్: ఆల్ రౌండర్లు, బలమైన బౌలింగ్ అటాక్ ను కలిగి ఉంది. పంజాబ్ టీమ్ లోని కీలక ఆటగాళ్లలో శ్రేయాస్ అయ్యర్, మార్కస్ స్టోయినిస్, గ్లెన్ మాక్స్‌వెల్, అర్ష్‌దీప్ సింగ్ లు ఉన్నారు. అయితే, టీమ్ లోని ఇతర చాలా మందికి పెద్దగా అనుభవం లేకపోవడం, బ్యాటింగ్ లైనప్ బలహీనంగా కనిపించడం జట్టును ఇబ్బంది పెట్టవచ్చు. గత 17 సీజన్లలో పంజాబ్ టీమ్ రెండు సార్లు మాత్రమే ప్లే ఆఫ్స్‌కు చేరుకుంది.
GT vs PBKS IPL Gujarat Titans vs Punjab Kings.. A Clash of Contrasts, A mind-blowing show!
గుజరాత్ టైటాన్స్ vs పంజాబ్ కింగ్స్.. బౌండరీల వర్షం !
అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగే మ్యాచ్ లో పరుగుల వర్షం ఖాయంగా కనిపిస్తోంది. మరో భారీ స్కోరింగ్ మ్యాచ్ గా ఉంటుందని క్రికెట్ లవర్స్ భావిస్తున్నారు. హెడ్ టూ హెడ్ రికార్డులు గమనిస్తే జీటీది పై చేయిగా ఉంది కానీ, యంగ్ ప్లేయర్లతో ఈ సారి సత్తా చాటాలని పంజాబ్ టీమ్ వ్యూహాలు సిద్ధం చేసుకుంది.
GT vs PBKS IPL Gujarat Titans vs Punjab Kings.. A Clash of Contrasts, A mind-blowing show!
గుజరాత్ టైటాన్స్ vs పంజాబ్ కింగ్స్ ప్లేయింగ్ 11 అంచనాలు:
పంజాబ్ కింగ్స్: శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), ప్రభ్‌సిమ్రాన్ సింగ్, ప్రియాంష్ ఆర్య, మార్కస్ స్టోయినిస్, గ్లెన్ మాక్స్‌వెల్, శశాంక్ సింగ్, నేహల్ వధేరా/సూర్యాంష్ షెగ్డే, మార్కో జాన్సెన్, హర్‌ప్రీత్ బ్రార్, లాకీ ఫెర్గూసన్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్.
గుజరాత్ టైటాన్స్: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), జోస్ బట్లర్, సాయి సుదర్శన్, షారుఖ్ ఖాన్, గ్లెన్ ఫిలిప్స్, వాషింగ్టన్ సుందర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, కగిసో రబాడ, ప్రసిద్ధ్ కృష్ణ, మహ్మద్ సిరాజ్.