ఇదే కొట్టుడు సామి.. స్టేడియం దద్దరిల్లిపోయింది !
ఈ మ్యాచ్‌లో లక్నో స్టార్ బ్యాటర్ నికోలస్ పూరన్ విధ్వంసం సృష్టించాడు. కేవలం 30 బంతుల్లో 75 పరుగులతో ఢిల్లీ బౌలింగ్ ను దంచికొట్టాడు. నికోలస్ పురాన్ సునామీ ఇన్నింగ్స్ లో 6 ఫోర్లు, 7 సిక్సర్లు బాదాడు. అతనికి తోడుగా మిచెల్ మార్ష్ 36 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్సర్లతో 72 పరుగుల దుమ్మేరేపే ఇన్నింగ్స్ తో లక్నో టీమ్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 209 పరుగులు చేసింది. అయితే, భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన ఢిల్లీ టీమ్ కు ఆరంభంలోనే కష్టాలు మొదలయ్యాయి.
కానీ, ఎప్పుడైతే అశుతోష్ శర్మ, విప్రజ్ క్రీజులోకి వచ్చారో అప్పుడే మ్యాచ్ పూర్తిగా మారిపోయింది. లక్నో టీమ్ గెలుపు సంబరాలు చేసుకుంటుంది అనుకునే లోపే అశుతోష్ శర్మ 31 బంతుల్లో 66 అజేయ పరుగులు, విప్రజ్ నిగమ్ 15 బంతుల్లో 39 పరుగులు పవర్ ఫుల్ హిట్టింగ్ ఢిల్లీ క్యాపిటల్స్ 19.3 ఓవర్లలో 9 వికెట్లకు 211 పరుగులతో మ్యాచ్ ను గెలుచుకుంది.