IND vs AUS: ఐపీఎల్ మధ్యలో భారత్-ఆస్ట్రేలియా టూర్ షెడ్యూల్ !
India Tour of Australia 2025: భారత జట్టు 5 టీ20, 3 వన్డే మ్యాచ్‌ల సిరీస్ కోసం ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. ఐపీఎల్ మధ్య దీనికి సంబంధించిన షెడ్యూల్ విడుదలైంది.
India Tour of Australia 2025: భారత జట్టు 5 టీ20, 3 వన్డే మ్యాచ్‌ల సిరీస్ కోసం ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. ఐపీఎల్ మధ్య దీనికి సంబంధించిన షెడ్యూల్ విడుదలైంది.
India Tour of Australia 2025 Full schedule: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 సందడి మధ్య భాతర క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. భారత్ 2025లో ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. ఈ పర్యటనలో 3 వన్డేలు, 5 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌ల సిరీస్ ఆడనుంది. క్రికెట్ ఆస్ట్రేలియా తన షెడ్యూల్‌ను ప్రకటించింది.
క్రికెట్ మైదానంలో ఇండియా-ఆస్ట్రేలియా మధ్య పోటీ ఎల్లప్పుడూ ఉత్తేజకరంగా ఉంటుంది. ఇరు జట్ల పోరును క్రికెట్ లవర్స్ ఎంతగానో ఎంజాయ్ చేస్తారు.
టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనకు ఎప్పుడు వెళ్లనుంది?
ఈ ఏడాది చివర్లో భారత పురుషుల జట్టు మూడు వన్డేలు, ఐదు టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌ల సిరీస్ కోసం ఆస్ట్రేలియాలో పర్యటిస్తుందని క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ఆదివారం తెలిపింది. అక్టోబర్ 19 - నవంబర్ 8 మధ్య వైట్ బాల్ మ్యాచ్‌లు ఆడనుంది. 50 ఓవర్ల మ్యాచ్‌లు డే-నైట్ మ్యాచ్‌లు కాగా, T20 మ్యాచ్‌లు నైట్ మ్యాచ్‌లుగా ఉంటాయని తెలిపింది.
భారత్-ఆసీస్ లు ఏ గ్రౌండ్ లో ఆడతాయి?
రాబోయే 2025–26 సీజన్‌లో ఆస్ట్రేలియాలోని ఎనిమిది రాష్ట్రాల్లో క్రికెట్ మ్యాచ్ లు జరపడానికి క్రికెట్ ఆస్ట్రేలియా ప్లాన్ చేసింది. 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో కాన్‌బెర్రా, హోబర్ట్ లో జరుగుతాయి. దీనికి ముందు పెర్త్, అడిలైడ్, సిడ్నీలలో కూడా 50 ఓవర్ల మ్యాచ్‌లు ఆడతాయి. 2024-25 ఐదు టెస్టుల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ తర్వాత భారత్ తిరిగి ఆస్ట్రేలియా టూర్ కు వెళ్తోంది.
ఇండియా ఆస్ట్రేలియా టూర్ షెడ్యూల్-వన్డే సిరీస్
అక్టోబర్ 19: పెర్త్ స్టేడియం, పెర్త్
అక్టోబర్ 23: అడిలైడ్ ఓవల్, అడిలైడ్
అక్టోబర్ 25: SCG, సిడ్నీ
ఇండియా ఆస్ట్రేలియా టూర్ షెడ్యూల్-టీ20 సిరీస్
అక్టోబర్ 29: మనుకా ఓవల్, కాన్‌బెర్రా
అక్టోబర్ 31: MCG, మెల్‌బోర్న్
నవంబర్ 2: బెల్లెరివ్ ఓవల్, హోబర్ట్
నవంబర్ 6: గోల్డ్ కోస్ట్ స్టేడియం, గోల్డ్ కోస్ట్
నవంబర్ 8: ది గబ్బా, బ్రిస్బేన్