SRH vs DC: Delhi Capitals vs Sunrisers Hyderabad, 10th IPL Match: Five Reasons for SRH's Defeat
IPL 2025 DC Vs SRH: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 10వ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ (DC) ఎవరూ ఊహించనిది చేసింది. అద్భుతమైన ఆటతో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH)ను చిత్తుగా ఓడించింది. ముఖ్యంగా హైదరాబాద్ సునామీ బ్యాటింగ్ లైనప్‌ను దృష్టిలో ఉంచుకుని భారీ అంచనాలున్నాయి. 300 పరుగులు వస్తాయని అందరూ భావించారు. కానీ, కీలక విషయల్లో తప్పిదాలు చేసి పూర్తిగా మ్యాచ్ నే కోల్పోయింది. అయితే, సన్ రైజర్స్ హైదరాబాద్ ఓటమికి గల టాప్-5 కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
SRH vs DC: Delhi Capitals vs Sunrisers Hyderabad, 10th IPL Match: Five Reasons for SRH's Defeat
1. మిచెల్ స్టార్క్ సూపర్ బౌలింగ్
హైదరాబాద్ టీమ్ ఓటమికి ప్రధాన కారణాలలో ఒకటి మిచెల్ స్టార్క్ అద్భుతమైన బౌలింగ్. తన సూపర్ బౌలింగ్ తో హైదరాబాద్ టీమ్ ను స్టార్క్ దెబ్బకొట్టాడు. మరీ ముఖ్యంగా పవర్‌ప్లేలో స్టార్క్ 3 వికెట్లు తీసి SRH టీమ్ భారీ స్కోర్ చేయకుండా అడ్డుకున్నాడు. ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి వంటి కీలక ప్లేయర్లను పెవిలియన్ కు పంపాడు. దీంతో హైదరాబాద్ టీమ్ కు 25/3 పరుగుల నుంచే కష్టాలు మొదలయ్యాయి.
SRH vs DC: Delhi Capitals vs Sunrisers Hyderabad, 10th IPL Match: Five Reasons for SRH's Defeat
2. అభిషేక్ శర్మ రనౌట్
అభిషేక్ శర్మ ప్రస్తుతం సూపర్ ఫామ్ లో ఉన్నాడు. అయితే, ఈ మ్యాచ్ తొలి తొలి ఓవర్లోనే అభిషేక్ శర్మ నిర్లక్ష్యంగా రనౌట్ కావడంతో హైదరాబాద్ కు తొలి దెబ్బతగిలింది. ఇది జట్టు ఆటతీరుపై ఒత్తిడిని పెంచింది. మరో ఓపెనర్ కు తోడుగా అభిషేక్ లా విధ్వంసక ఇన్నింగ్స్ ను ఆడే ప్లేయర్ దొరకలేదు.
SRH vs DC: Delhi Capitals vs Sunrisers Hyderabad, 10th IPL Match: Five Reasons for SRH's Defeat
3. పవర్ ప్లే ముంచేసింది
మిచెల్ స్టార్క్ తో పాటు ఇతర డీసీ బౌలర్ల అద్భుతమైన బౌలింగ్ తో హైదరాబాద్ టీమ్ 5వ ఓవర్ ముగిసే సమయానికి 37/4 స్కోరుకు పడిపోయింది. ప్రారంభ ఓవర్లలో ట్రావిస్ హెడ్, నితీస్ కుమార్ రెడ్డి వికెట్లను కూడా కోల్పోయింది. పవర్ ప్లే ముగిసే సమయానికి 58-4 పరుగులు చేసింది కానీ, కీలకమైన హిట్టర్లను కోల్పోయింది. దీంతో టీమ్ ఒత్తిడిలోకి చేరింది. 100 పరుగులు దాటిన తర్వాత వరుసగా వికెట్లు కోల్పోయింది.
SRH vs DC: Delhi Capitals vs Sunrisers Hyderabad, 10th IPL Match: Five Reasons for SRH's Defeat
4. ఎస్ఆర్హెచ్ టాప్ ఆర్డర్ విఫలం
ఐపీఎల్ 2025 మొదటి రెండు మ్యాచ్ లలో దుమ్మురేపే ఇన్నింగ్స్ లను ఆడిన టాప్ ఆర్డర్ ఈ మ్యాచ్‌లో ఘోరంగా విఫలమైంది. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ ఇద్దరూ త్వరగానే అవుట్ అయ్యారు. అలాగే, ఇషాన్ కిషన్ కూడా పెవిలియన్ కు చేరాడు. టాప్ ఆర్డర్ రాణించకపోవడంతో మిడిల్ ఆర్డర్ ఒత్తిడిలోకి జారుకుని భారీ పరుగులు చేయలేకపోయింది.
SRH vs DC: Delhi Capitals vs Sunrisers Hyderabad, 10th IPL Match: Five Reasons for SRH's Defeat
5. పెద్ద భాగస్వామ్యాలు లేవు.. బౌలింగ్ లోనూ ప్రభావం లేదు
మ్యాచ్ అంతటా హైదరాబాద్ టీమ్ పెద్ద భాగస్వామ్యాలను నిర్మించడంలో విఫలమైంది. టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్ లో కూడా బిగ్ పార్టనర్ షిప్ రాలేదు. హెన్రిచ్ క్లాసెన్ ఇన్నింగ్స్ ను పరుగులు పెట్టించడానికి ప్రయత్నించే క్రమంలో త్వరగానే అవుట్ అయ్యాడు. యంగ్ ప్లేయర్ అనికేత్ వర్మకు తోడుగా మరో ప్లేయర్ బిగ్ ఇన్నింగ్స్ ఆడలేకపోయారు. అలాగే, హైదరాబాద్ బౌలింగ్ కూడా ప్రభావం చూపలేకపోయింది.
మొత్తంగా సన్ రైజర్స్ ఓటమికి వికెట్లు పడుతున్నా మ్యాచ్ కు అనుగుణంగా ఆటను మార్చుకోకుండా పేలవమైన షాట్ ఎంపిక, రనౌట్, భాగస్వామ్యాలు లేకపోవడం ప్రధాన కారణాలుగా ఉన్నాయి. మిచెల్ స్టార్క్ కూడా అద్భుతమైన బౌలింగ్ తో హైదరాబాద్ టీమ్ ను దెబ్బకొట్టాడు.