most expensive divorces: చాహల్-ధన‌శ్రీ కాదు.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన టాప్-5 విడాకులు ఇవే

Published : Mar 20, 2025, 08:55 PM IST

Yuzvendra Chahal, Dhanashree Verma divorce: యుజ్వేంద్ర చాహల్-ధనశ్రీ వర్మలు విడాకులు తీసుకున్నారు. ధ‌న‌శ్రీకి చాహ‌ల్ రూ.4.75 కోట్ల భ‌ర‌ణం ఇచ్చాడని సమాచారం. అయితే, ప్ర‌పంచంలోని అత్యంత ఖ‌రీదైన టాప్-5 విడాకులు ఎవ‌రివో తెలుసా?  

PREV
16
most expensive divorces: చాహల్-ధన‌శ్రీ కాదు.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన టాప్-5 విడాకులు ఇవే

5 most expensive divorces: భార‌త స్టార్ స్పిన్న‌ర్ యుజ్వేంద్ర చాహల్-ధనశ్రీ వర్మలు 5 సంవత్సరాల వివాహ బంధానికి గుడ్ బై చెప్పారు. వారిద్దరూ ఇప్పుడు విడాకులు తీసుకున్నారు. బాంబే హైకోర్టు ఆదేశం మేరకు ఫ్యామిలీ కోర్టు మార్చి 20, గురువారం వీరికి విడాకుల మంజూరు చేసింది. ఈ స్టార్ క‌పుల్ డిసెంబర్ 22, 2020న వివాహం చేసుకున్నారు.

అయితే, గత 2.5 సంవత్సరాలుగా విడివిడిగా ఉంటున్నారు. చాహల్-ధనశ్రీల విడాకుల‌ సెటిల్మెంట్ రూ.4.75 కోట్లకు జరిగిందని రిపోర్టులు పేర్కొంటున్నాయి. ప్రపంచంలో ఇలాంటి ఖరీదైన విడాకులు చాలానే ఉన్నాయి. వీటికి పరిష్కారం కోసం బిలియన్ల ట్రిలియన్ల రూపాయలు చెల్లించారు. అయితే, ప్రపంచంలో అత్యంత ఖరీదైన 5 విడాకులు ఎవ‌రివో ఇప్పుడు తెలుసుకుందాం. 

26
top 5 most expensive divorces in the world

1. బిల్ గేట్స్ - మెలిండా గేట్స్ విడాకులు 

మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తన భార్య మెలిండా గేట్స్ నుండి 27 సంవత్సరాల త‌ర్వాత వివాహ బంధాన్ని తెంచుకున్నారు. మే 3, 2021న వీరు విడాకులు తీసుకున్నారు. ఈ విడాకుల నుండి మెలిండాకు $73 బిలియన్ల భ‌ర‌ణం లభించింది. ఫోర్బ్స్ నివేదిక ప్రకారం మెలిండా వివిధ కంపెనీల నుండి $6.3 బిలియన్ల విలువైన షేర్లను కూడా పొందారు. ఈ విడాకులు ప్ర‌పంచంలోని అత్యంత ఖ‌రీదైన విడాకులుగా నిలిచాయి. 

36
top 5 most expensive divorces in the world

2. జెఫ్ బెజోస్ - మెకెంజీ స్కాట్ విడాకులు
 
అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ తన భార్య మెకెంజీ స్కాట్‌కు 2019లో విడాకులు ఇచ్చారు. ప్రతిగా, మెకెంజీకి అమెజాన్ షేర్లలో 4 శాతం లభించింది. దీని విలువ $38 బిలియన్లకు పైగా ఉంది. ఇది ప్ర‌పంచంలోని అత్యంత ఖ‌రీదైన విడాకుల్లో ఒక‌టిగా నిలిచింది. 

46
top 5 most expensive divorces in the world

3. అలెక్ వైల్డెన్‌స్టెయిన్ - జోసెలిన్ వైల్డెన్‌స్టెయిన్ విడాకులు 

ఫ్రెంచ్-అమెరికన్ వ్యాపారవేత్త అలెక్ వైల్డెన్‌స్టెయిన్ - అతని భార్య జోసెలిన్ వైల్డెన్‌స్టెయిన్ 21 సంవత్సరాల వివాహ బంధం త‌ర్వాత 1999లో విడిపోవాలని నిర్ణయించుకున్నారు. ఈ విడాకులకు ప్రతిఫలంగా జోస్లిన్ $3.8 బిలియన్ల భరణం అందుకున్నారు.

56
top 5 most expensive divorces in the world

4. రూపెర్ట్ ముర్డాక్ - మరియా టోర్వ్ విడాకులు
 
ఆస్ట్రేలియన్-అమెరికన్ వ్యాపారవేత్త రూపర్ట్ ముర్డోక్ 31 సంవత్సరాల వైవాహిక జీవితం తర్వాత 1998లో తన భార్యకు విడాకులు ఇచ్చారు. దీంతో $1.7 బిలియన్ల భ‌ర‌ణాన్ని మ‌రియా టోర్వ్ అందుకున్నారు. వారి విడాకులు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన విడాకులలో ఒకటి.

66
top 5 most expensive divorces in the world

5. బెర్నీ ఎక్లెస్టోన్  - స్లావికా రాడిక్ విడాకులు 

మాజీ ఫార్ములా వన్ బాస్, బ్రిటన్‌లో అత్యంత ధనవంతుడు అయిన బెర్నీ ఎక్లెస్టోన్, క్రొయేషియా మోడల్ స్లావికా రాడిక్‌ను విడాకులు తీసుకున్న క్ర‌మంలో అత‌ను $1.2 బిలియన్ల భ‌ర‌ణం ఇచ్చాడు. ఈ భరణంతో స్లావికా బ్రిటన్‌లో అత్యంత ధనవంతురాలైన మహిళగా మారింది.

Read more Photos on
click me!

Recommended Stories