ఏప్రిల్ 6న లక్నో సూపర్ జెయింట్స్ (LSG) తో జరగాల్సిన కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) మ్యాచ్‌ను గౌహతికి మార్చనున్నారు. ఇప్పుడు తొలి మ్యాచ్ ను వర్షం బెదిరిస్తోంది. దీంతో ఈడెన్ గార్డెన్స్ లో రెండు ఐపీఎల్ 2025 మ్యాచ్‌పై ప్రభావం పడింది.
శ్రీరామ నవమి సందర్భంగా భద్రతా కారణాలతో మ్యాచ్‌ను కోల్‌కతాలో నిర్వహించడం సమస్యలు తెచ్చిపెడుతుందని కోల్‌కతా పోలీసులు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI)కి తెలిపారు. ఈ విషయాన్ని బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ (CAB) అధ్యక్షుడు స్నేహాశిష్ గంగూలీ స్పష్టం చేశారు.
పశ్చిమ బెంగాల్‌లో 20,000కి పైగా ఊరేగింపులు నిర్వహించాలని యోచిస్తున్నట్లు వచ్చిన నివేదికల కారణంగా, భద్రతా సమస్యలు తలెత్తుతాయని భావించారు. ఈ క్రమంలోనే కోల్ కతా నుంచి మ్యాచ్ ను గౌహతికి మార్చనున్నారు.