ఆవేశ్ ఖాన్‌కి రూ.10 కోట్ల పండగ... ఐపీఎల్ వేలంలోనే సరికొత్త చరిత్ర...

Published : Feb 12, 2022, 09:47 PM IST

ఐపీఎల్ 2022 సీజన్‌లో ఆవేశ్ ఖాన్ చరిత్ర క్రియేట్ చేశాడు. గత సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కి ఆడి, హర్షల్ పటేల్ తర్వాత ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచిన ఆవేశ్ ఖాన్‌ను రూ.10 కోట్లకు కొనుగోలు చేసింది లక్నో సూపర్ జెయింట్స్...

PREV
114
ఆవేశ్ ఖాన్‌కి రూ.10 కోట్ల పండగ... ఐపీఎల్ వేలంలోనే సరికొత్త చరిత్ర...

తెలుగు వికెట్ కీపర్ కెఎస్ భరత్‌ను రూ.2 కోట్లకు కొనుగోలు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు. విష్ణు సోలంకి, విష్ణు వినోద్ వంటి దేశవాళీ క్రికెటర్లను ఏ ఫ్రాంఛైజీ కొనుగోలు చేయడానికి ఇష్టపడలేదు...

214

గత సయ్యద్ ముస్తాక్ ఆలీ టోర్నీలో సెంచరీతో అదరగొట్టిన మహ్మద్ అజారుద్దీన్‌కి కూడా ఏ జట్టు కొనుగోలు చేయడానికి ముందుకు రాలేదు. 

314

అకాశ్ దీప్ సింగ్‌ను రూ.20 లక్షలకు ఆర్‌సీబీ కొనుగోలు చేసింది. ఆవేశ్ ఖాన్ కోసం ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు పోటీపడ్డాయి...

414

ఆవేశ్ ఖాన్‌ని రూ.10 కోట్లకు కొనుగోలు చేసింది లక్నో సూపర్ జెయింట్స్... గత సీజన్‌లో కృష్ణప్ప గౌతమ్‌ను రూ.9.25 కోట్లకు కొనుగోలు చేసింది సీఎస్‌కే. ఆవేశ్ ఖాన్, ఆ రికార్డును బ్రేక్ చేసి వేలంలో అత్యధిక మొత్తం దక్కించుకున్న అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా చరిత్ర క్రియేట్ చేశాడు. 

514

వికెట్ కీపర్ అనుజ్ రావత్ కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు పోటీపడ్డాయి. రూ.3.4 కోట్లకు అనుజ్ రావత్‌ని కొనుగోలు చేసింది ఆర్‌సీబీ...

614

ప్రభుసిమ్రాన్ సింగ్‌ను రూ.60 లక్షలకు కొనుగోలు చేసింది పంజాబ్ కింగ్స్. 2020 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరుపున ఆడిన ఎన్ జగదీశన్‌‌ను ఏ జట్టూ కొనుగోలు చేయలేదు.  

714

బాసిల్ తంపిని రూ.30 లక్షలకు కొనుగోలు చేసింది ముంబై ఇండియన్స్... కెఎం అసిఫ్‌ను చెన్నై సూపర్ కింగ్స్ రూ.20 లక్షలకు కొనుగోలు చేసింది. 

 

814


కార్తీక్ త్యాగి కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ జట్లు పోటీపడ్డాయి. ఎట్టకేలకు సన్‌రైజర్స్ రూ.4 కోట్లకు కార్తీక్ త్యాగిని దక్కించుకుంది... 

914

ఇషాన్ పోరెల్‌ను పంజాబ్ కింగ్స్ రూ.25 లక్షలకు కొనుగోలు చేసింది. అంకిత్ సింగ్‌ను లక్నో సూపర్ జెయింట్స్ రూ.50 లక్షలకు దక్కించుకుంది. 

1014

నూర్ అహ్మద్‌ను గుజరాత్ టైటాన్స్ రూ.30 లక్షలకు కొనుగోలు చేసింది. తుషార్ దేశ్‌పాండేని సీఎస్‌కే రూ.20 లక్షలకు సొంతం చేసుకుంది...

1114

మురుగన్ అశ్విన్ కోసం ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు పోటీపడ్డాయి. మురగన్ అశ్విన్‌ని రూ.1.6 కోట్లకు కొనుగోలు చేసింది ముంబై ఇండియన్స్... 

1214

కేసీ కరియప్పను రాజస్థాన్ రాయల్స్ రూ.30 లక్షలకు కొనుగోలు చేసింది. శ్రేయాస్ గోపాల్ కోసం రాజస్థాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు పోటీపడ్డాయి... సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ.75 లక్షలకు శ్రేయాస్ గోపాల్‌ను దక్కించుకుంది. 

1314

జగదీశ సుచిత్‌ను రూ.20 లక్షలకు కొనుగోలు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్...ఆర్ సాయి కిషోర్ కోసం చెన్నై, ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ జట్లు పోటీ పడ్డాయి. సాయి కిషోర్‌ని రూ.3 కోట్లకు గుజరాత్ టైటాన్స్ సొంతం చేసుకుంది... 

1414

ఎం సిద్ధార్థ్, ఐపీఎల్ వేలంలో పాల్గొన్న ఏకైక నేపాల్ ప్లేయర్ సందీప్ లమిచాన్‌లను కొనుగోలు చేయడానికి ఏ జట్టు ఆసక్తి చూపించలేదు. 

click me!

Recommended Stories