IPL 2022 Mega Auction: దుమ్మురేపిన దీపక్ చాహార్, ప్రసిద్ధ్ కృష్ణ, శార్దూల్ ఠాకూర్...

Published : Feb 12, 2022, 06:48 PM IST

ఐపీఎల్ 2022 మెగా వేలంలో భారత పేసర్లు దుమ్మురేపారు. దీపక్ చాహార్‌ని తిరిగి కొనుగోలు చేసేందుకు చెన్నై సూపర్ కింగ్స్‌ జట్టు రూ.14 కోట్లు చెల్లించడానికి సిద్ధం కాగా, యంగ్ సెన్సేషన్ ప్రసిద్ధ్ కృష్ణ, శార్దూల్ ఠాకూర్ కోసం ఫ్రాంఛైజీలు పోటీపడ్డాయి...

PREV
114
IPL 2022 Mega Auction: దుమ్మురేపిన దీపక్ చాహార్, ప్రసిద్ధ్ కృష్ణ, శార్దూల్ ఠాకూర్...

భారత బౌలర్ ‘యార్కర్ కింగ్’ టి నటరాజన్‌ని సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు రూ. 4 కోట్లకు తిరిగి కొనుగోలు చేసింది...

214

భారత బౌలర్ దీపక్ చాహార్‌ కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు పోటీపడ్డాయి. మధ్యలో ఎంట్రీ ఇచ్చిన చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు పోటీపడినా... రూ.14 కోట్లకు సీఎస్‌కే దక్కించుకుంది...
 

314

భారత సీనియర్ పేసర్ ఉమేశ్ యాదవ్‌ను బేస్ ప్రైజ్ రూ.2 కోట్లకు కొనుగోలు చేయడానికి ఏ జట్టూ ఆసక్తి చూపించలేదు...

414

యంగ్ పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ కోసం లక్నో సూపర్ జెయింట్స్, రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు పోటీపడ్డాయి. ఆర్ఆర్ జట్టు రూ.10 కోట్లకు ప్రసిద్ధ్ కృష్ణను కొనుగోలు చేసింది...

514

న్యూజిలాండ్ పేసర్ లూకీ ఫర్గూసన్ కోసం గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు పోటీపడ్డాయి... ఫర్గూసన్‌ని రూ. 10. కోట్లకు కొనుగోలు చేసింది గుజరాత్ టైటాన్స్ జట్టు... 

614

ఆస్ట్రేలియా బౌలర్ జోష్ హజల్‌వుడ్ కోసం ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు పోటీపడ్డాయి. ఆఖర్లో రూ.7.75 కోట్లకు బిడ్ వేసిన ఆర్‌సీబీ, హజల్‌వుడ్‌ని దక్కించుకుంది.

714

ఇంగ్లాండ్ పేసర్ మార్క్ వుడ్‌ని లక్నో సూపర్ జెయింట్స్ జట్టు రూ.7.5 కోట్లకు కొనుగోలు చేసింది...  మార్క్ వుడ్‌కి ఇదే మొదటి ఐపీఎల్ సీజన్.

814

భారత పేసర్ భువనేశ్వర్ కుమార్‌ కోసం రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు పోటీపడ్డాయి. భువీని రూ.4.20 కోట్లకు దక్కించుకుంది ఎస్‌ఆర్‌హెచ్ జట్టు... 

914


భారత ఆల్‌రౌండర్ దీపక్ చాహార్ కోసం పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు పోటీపడ్డాయి. శార్దూల్ ఠాకూర్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు రూ.10.75 కోట్లకు కొనుగోలు చేసింది... 
 

1014

బంగ్లా బౌలర్ ముస్తాఫిజుర్ రహ్మాన్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు బేస్ ప్రైజ్ రూ.2 కోట్లకు దక్కించుకుంది. ఇంగ్లాండ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్‌ను ఏ జట్టూ కొనుగోలు చేయడానికి ఇష్టపడలేదు...

1114

ఆఫ్ఘాన్ స్పిన్నర్ ముజీబ్ జడ్రాన్‌, సౌతాఫ్రికా స్పిన్నర్ ఇమ్రాన్ తాహీర్‌, ఆస్ట్రేలియా యంగ్ స్పిన్నర్ ఆడమ్ జంపా, భారత స్పిన్నర్ అమిత్ మిశ్రాలను కొనుగోలు చేయడానికి ఏ ఫ్రాంఛైజీ ఆసక్తి చూపించలేదు...

1214


భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌‌ను ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ జట్లు పోటీపడ్డాయి. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు, కుల్దీప్ యాదవ్‌ని రూ.2 కోట్లకు కొనుగోలు చేసింది.  

1314

భారత యంగ్ స్పిన్నర్ రాహుల్ చాహార్ కోసం ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు పోటీ పడ్డాయి. రూ.5.25 కోట్లకు రాహుల్ చాహార్‌ను కొనుగోలు చేసింది పంజాబ్ కింగ్స్..

1414


భారత స్పిన్నర్ యజ్వేంద్ర చాహాల్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్లు పోటీ పడ్డాయి. చాహాల్‌ను రూ. 6.5కోట్లకు కొనుగోలు చేసింది రాజస్థాన్ రాయల్స్.

click me!

Recommended Stories