ఐపీఎల్ 2022 మెగా వేలంలో అన్‌క్యాప్డ్ ప్లేయర్లకు కూడా కాసుల వర్షం కురుస్తోంది. గత సీజన్లలో కాస్తో కూస్తో రాణించి, తెలిసిన ప్లేయర్‌గా మారితే చాలు, ఆ ఆటగాడిని కొనుగోలు చేయడానికి ఫ్రాంఛైజీలు పోటీపడి కోట్లు చెల్లించడానికి సిద్ధమైపోతున్నాయి...
అండర్ 19 వరల్డ్ కప్ స్టార్ డేవాల్డ్ బ్రేవిస్‌ను రూ.3 కోట్లకు కొనుగోలు చేసిన ముంబై ఇండియన్స్... ఆర్‌సీబీ తరుపున ఆడాలని ఉందని బ్రేవిస్ మనసులో మాట బయటపెట్టినా, రాయల్ ఛాలెంజర్స్ అతని కోసం బిడ్ కోసం వేయకపోవడం విశేషం...
28
కోల్‌కత్తా నైట్‌రైడర్స్, రైజింగ్ పూణే వంటి జట్ల తరుపున ఆడిన రాహుల్ త్రిపాఠిని రూ.8.5 కోట్లకు కొనుగోలు చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్..
38
రియాన్ పరాగ్‌ను రూ.3.8 కోట్లకు తిరిగి కొనుగోలు చేసిన రాజస్థాన్ రాయల్స్... అలాగే కర్ణాటక ప్లేయర్ అభినవ్ మనోహర్‌ను రూ.2.6 కోట్లకు కొనుగోలు చేసిన గుజరాత్ టైటాన్స్...
48
అశ్విన్ హెబ్బర్‌ను రూ.20 లక్షలకు కొనుగోలు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్. ఆల్‌రౌండర్ రాహుల్ తెవాటియా కోసం ఏకంగా రూ.9 కోట్లు చెల్లించడానికి సిద్ధమైంది గుజరాత్ టైటాన్స్...
58
భారీ హిట్టర్ షారుక్ ఖాన్‌ని రూ.9 కోట్లకు కొనుగోలు చేసింది పంజాబ్ కింగ్స్... రూ.40 కోట్ల బేస్ ప్రైజ్‌తో మొదలైన షారుక్ కోసం చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్ జట్లు పోటీ పడ్డాయి...
68
కేకేఆర్ బౌలర్ శివమ్ మావిని తిరిగి రూ.7.25 కోట్లకు సొంతం చేసుకుంది ఆ జట్టు... సర్ఫరాజ్ ఖాన్‌ని బేస్ ప్రైజ్ రూ.20 లక్షలకు కొనుగోలు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్...
78
కమ్లేశ్ నాగర్‌కోటిని రూ.1.10 కోట్లకు కొనుగోలు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు. బౌలర్ హర్‌ప్రీత్ బ్రార్‌ని రూ.3.8 కోట్లకు పంజాబ్ కింగ్స్ తిరిగి సొంతం చేసుకుంది.
88
హరి నిశాంత్, రజత్ పటిదార్‌ను ఏ ఫ్రాంఛైజీ కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపించలేదు. షాబాజ్ అహ్మద్‌ని రూ.2.4 కోట్లకు తిరిగి జట్టులోకి తీసుకుంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...