అవకాశం వస్తే ఎమ్మెస్ ధోనీ బుర్రలోకి దూరిపోతా... దినేశ్ కార్తీక్ ఫన్నీ కామెంట్...

First Published Jun 13, 2022, 12:27 PM IST

టీమిండియాలో దశాబ్దానికి పైగా కెప్టెన్‌గా, వికెట్ కీపింగ్ బ్యాటర్‌గా, ఫినిషర్‌గా సెటిల్ అయిపోయిన ఎమ్మెస్ ధోనీ కారణంగా ఎంతో మంది ప్లేయర్లు తుదిజట్టులో చోటు దక్కించుకోవడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. అలాంటి వారిలో దినేశ్ కార్తీక్ కూడా ఒకడు...

2004లో ఎమ్మెస్ ధోనీ ఎంట్రీ ఇచ్చినప్పుడే టీమిండియాలోకి ఆరంగ్రేటం చేశాడు దినేశ్ కార్తీక్. అయితే 18 ఏళ్ల కెరీర్‌లో దినేశ్ కార్తీక్ ఆడింది మొత్తంగా 154 అంతర్జాతీయ మ్యాచులే...

టీమిండియా తరుపున 26 టెస్టులు, 94 వన్డేలు ఆడిన దినేశ్ కార్తీక్, 34 టీ20 మ్యాచులు ఆడాడు. వన్డేల్లో 1752 పరుగులు చేసిన దినేశ్ కార్తీక్, టెస్టుల్లో 1025 పరుగులు చేశాడు...

Latest Videos


Image credit: PTI

ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2019 తర్వాత టీమిండియాలో చోటు కోల్పోయిన దినేశ్ కార్తీక్, ఐపీఎల్ 2022 సీజన్ పర్ఫామెన్స్ కారణంగా భారత జట్టులో తిరిగి స్థానం దక్కించుకోగలిగాడు...

ఐపీఎల్ 2022లో 55 సగటుతో 16 మ్యాచుల్లో 183.33 స్ట్రైయిక్ రేటుతో 330 పరుగులు చేసిన దినేశ్ కార్తీక్, సౌతాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్‌కి ఎంపికయ్యాడు. మొదటి మ్యాచ్‌లో 2 బంతులే ఎదుర్కొన్న దినేశ్ కార్తీక్, రెండో టీ20లో ఆకట్టుకునే పర్ఫామెన్స్ ఇచ్చాడు...

ఐదో వికెట్ పడిన తర్వాత క్రీజులోకి వచ్చిన దినేశ్ కార్తీక్ 21 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 30 పరుగులు చేశాడు. దినేశ్ కార్తీక్ మెరుపుల కారణంగానే 148 పరుగుల డీసెంట్ స్కోరు చేయగలిగింది భారత జట్టు...

ఈ మ్యాచ్ ఆరంభానికి ముందు బీసీసీఐ ఛానెల్ వేదికగా అభిమానులు అడిగిన ప్రశ్నలకు తన స్టైల్‌లో సమాధానాలు చెప్పి మెప్పించాడు దినేశ్ కార్తీక్...

తనకి మూవీ నైట్స్ కంటే టీమ్ డిన్నర్స్ ఎక్కువ ఇష్టమని చెప్పిన దినేశ్ కార్తీక్, కాఫీ కంటే టీ ఎక్కువ ఇష్టపడతానని చెప్పాడు. పార్టీల్లో తాను డ్యాన్స్‌ చేయడానికి కానీ, పాటలు పాడడానికి కానీ ఇష్టపడనని చెప్పాడు కార్తీక్...

బీచ్‌ల కంటే పర్వాతాలు ఎక్కవడానికి, వంట చేయడానికి కంటే క్లీన్ చేయడమే ఇష్టమని చెప్పిన దినేశ్ కార్తీక్... టెన్నిస్ స్టార్ రోజర్ ఫెదరర్ ఆటను ఇష్టపడతానని, అతనితో లంచ్ చేయాలని ఉందంటూ కామెంట్ చేశాడు...

తనకు ఎగిరే సామర్థ్యం ఉంటే అలస్కాకి ఎగిరెళ్లిపోతానని, ఆ ప్లేస్ గురించి చాలా గొప్ప గొప్ప విషయాలు విన్నానని చెప్పిన దినేశ్ కార్తీక్... మైండ్ రీడ్ చేసే పవర్ వస్తే... ఎమ్మెస్ ధోనీ బుర్రలోకి దూరిపోయి, అతని ఆలోచనలు తెలుసుకుంటానని చెప్పాడు...

click me!